వ్యక్తిగత ఆహ్వాన లేఖ, పత్రికను పంపిన సీఎం
ప్రొటోకాల్ సలహాదారు ద్వారా అందించేందుకు ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 2న పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించే అధికారిక కార్యక్రమానికి హాజరుకావా ల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా లేఖ రాశారు. ఈ వ్యక్తిగత ఆహ్వాన లేఖను, ఆహ్వాన పత్రికను స్వయంగా కేసీఆర్‌కు అందించాలని ప్రొటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్‌లను సీఎం ఆదేశించారు.
ఈ మేరకు కేసీఆర్‌ను కలసి ఆహ్వాన లేఖ, పత్రికను అందించేందుకు వారిద్దరూ కేసీఆర్ సిబ్బందితో చర్చలు జరిపారు. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఉన్నారని సిబ్బంది వెల్లడించడంతో.. ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఆహ్వాన పత్రిక, లేఖను అందించేందుకు వేణుగోపాల్, అరవింద్ సింగ్ ప్రయత్నిస్తున్నారని సీఎం కార్యాలయం తెలిపింది.
చుక్కా రామయ్యకు సీఎం పరామర్శ.. వేడుకలకు ఆహ్వానం..
సాక్షి, హైదరాబాద్: కొంతకాలం నుంచి అనారో గ్యంతో బాధపడుతున్న ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. గురువారం నల్లకుంటలోని చుక్కా రామయ్య నివాసానికి సీఎం వెళ్లారు. రామయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. శాలువా కప్పి సన్మానించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరుకావాలంటూ రామయ్యను ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment