ఇంప్లీడ్ పిటిషనర్‌పై హైకోర్టు ఫైర్
సాక్షి, అమరావతి : తన భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో అవసరం లేకున్నా మూడో వ్యక్తి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడంపై హైకోర్టు మండిపడింది. భద్రత కోసం బాధిత వ్యక్తే(జగన్‌మోహన్‌రెడ్డి) స్వయంగా పిటిషన్ దాఖలు చేసుకున్నప్పుడు, ఈ వ్యవహారంతో సంబంధం లేని వ్యక్తి ఇంప్లీడ్ పిటిషన్ ఎలా దాఖలు చేస్తారంటూ ఇంప్లీడ్ పిటిషనర్ అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజావలిపై నిప్పులు చెరిగింది. జగన్‌కు భద్రత కల్పించాలని మీరెలా కోరుతారని నిలదీసింది.
కోర్టును క్రీడా మైదానంగా, కామెడీ క్లబ్బుగా ఇంప్లీడ్ పిటిషనర్ ఖాజావలీ భావిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఇంప్లీడ్ పిటిషన్‌లో రాసిన అంశాలపైనా కోర్టు అభ్యంతరం తెలిపింది. ఆ పిటిషన్‌లో ప్రతి అక్షరాన్ని చదివామన్న హైకోర్టు.. పిటిషన్‌లో ఉపయోగించిన పదజాలం దారుణంగా ఉందంది. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదే లేదని.. పూర్తిస్థాయి విచారణ అనంతరం భారీ ఖర్చులు విధించి ఈ ఇంప్లీడ్ పిటిషన్‌ను కొట్టేస్తామని స్పష్టం చేసింది.
జగన్ తరఫు న్యాయవాది చింతల సుమన్ సైతం ఈ ఇంప్లీడ్ పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. భద్రత విషయంలో ప్రభుత్వం దాఖలు చేసినకౌంటర్‌కు తిరుగు సమాధానం(రిప్‌లై) దాఖలు చేయాలని వైఎస్ జగన్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను 27కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment