ఎక్స్‌‘ప్లస్’! | explus! | Sakshi
Sakshi News home page

ఎక్స్‌‘ప్లస్’!

Published Thu, Mar 12 2015 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM

ఎక్స్‌‘ప్లస్’!

ఎక్స్‌‘ప్లస్’!

‘బోల్డ్’గా ఉండే సల్మాన్‌ఖాన్ చుట్టూ బోల్డన్ని కబుర్లుంటాయి ఎప్పుడూ! ముఖ్యంగా మనోడు సినిమాలతో ఎంత ఫేమస్సో... చుట్టూ గాళ్‌ఫ్రెండ్స్‌తో అంతే పాపులర్. థియేటర్లలో అతగాడి పిక్చర్ ఏదీ ఆడకపోతున్నా... డేటింగ్ అప్‌డేట్స్‌తో న్యూస్‌లో కనిపిస్తూనే ఉంటాడు. లేటెస్ట్‌గా ఓ సన్సేషన్... సల్లూ భాయ్ తొలినాళ్ల ప్రేయసి సంగీతా బిజ్‌లానీ... ప్రస్తుత ప్రియురాలు లులియా వంట్యూర్ ఒకే పార్టీలో కలసి ఎంజాయ్ చేశారట! అక్కడే ఉన్న కండల వీరుడు తన లైఫ్‌లోకొచ్చిన మాజీ ప్రియురాళ్లందరి గురించి వారితో షేర్ చేసుకున్నాడనేది ఓ వెబ్‌సైట్ కథనం. అయితే ఒక్క ఐశ్వర్యారాయ్ పేరు మాత్రం ప్రస్తావించలేదట! మిగిలిన అందరితో తాను ఎంతో ఆనందంగా గడిపానని... వారి సాన్నిహిత్యాన్ని ప్రతి క్షణం ఆస్వాదించానని చెప్పుకొచ్చాడట. అంటే ఐశ్వర్యతో ఆ హ్యాపినెస్ దొరకలేదా మనోడికి అన్నది బీటౌన్ గుసగుస!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement