Sangeeta Bijlani Jokingly Punches Ex-Boyfriend Salman Khan, Watch Video - Sakshi
Sakshi News home page

Salman Khan: సల్మాన్‌ ముఖంపై పంచ్‌ ఇచ్చిన మాజీ ప్రేయసి, వీడియో వైరల్‌

Published Mon, Apr 24 2023 10:28 AM | Last Updated on Mon, Apr 24 2023 11:24 AM

Sangeeta Bijlani Punches Ex Boyfriend Salman Khan, Watch Video - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఇప్పటికీ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లరే.. కానీ అప్పట్లో ఆయన నడిపిన ప్రేమాయణాల చిట్టా తీస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే! ఎంతోమంది హీరోయిన్లను ప్రేమించిన ఆయన ఎవరినీ తన లైఫ్‌ పార్ట్‌నర్‌ను చేసుకోలేకపోయాడు. నచ్చినన్నాళ్లు ప్రేమించి, ఆ తర్వాత బ్రేకప్‌ చెప్పడమనేది అతడి విషయంలో పరిపాటిగా మారింది.

తాజాగా అతడు తన సోదరి అర్పితా ఖాన్‌- ఆయుష్‌ శర్మల దంపతులు ఇచ్చిన ఈద్‌ పార్టీకి వెళ్లాడు. ముంబైలో శనివారం జరిగిన ఈద్‌ పార్టీకి పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు విచ్చేశారు. వారిలో సల్లూభాయ్‌ మాజీ ప్రేయసి, నటి సంగీతా బిజ్లానీ కూడా ఉంది. అతడి వెనకాలే ఉన్న సంగీతా సల్మాన్‌ ముఖంపై ఒక్క పంచ్‌ ఇచ్చింది. అదేమీ పట్టించుకోని హీరో మరొకరితో నవ్వుతూ మాట్లాడుతుండటంతో ఆమె అతడిని మరోసారి సరదాగా కొట్టింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. 'సల్మాన్‌ పెళ్లి చేసుకోకుండా మిగిలిపోవడానికి ఆవిడే కారణం', 'సల్మాన్‌తో నిశ్చితార్థం రద్దు చేసుకుని క్రికెటర్‌ను పెళ్లాడింది. తీరా అక్కడ సంసారం నాశనం చేసుకుని విడాకులిచ్చేసి ఇప్పుడు మళ్లీ హీరో చెంతకు చేరింది', 'ఆమె మరొకరిని పెళ్లి చేసుకునేలోపు మీరే ఆమెను వివాహం చేసుకోండి' అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

కాగా సల్మాన్‌ ఖాన్‌, ఒకప్పటి హీరోయిన్‌ సంగీత బిజ్లానీతో దాదాపు దశాబ్ధకాలం పాటు డేటింగ్‌ చేశాడు. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో వీరిద్దరూ బ్రేకప్‌ చెప్పుకున్నారు. తర్వాత సంగీత ఇండియన్‌ మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ను పెళ్లి చేసుకోగా 14 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ 2010లో విడాకులిచ్చింది. ఇకపోతే సల్మాన్‌-సంగీత విడిపోయినప్పటికీ మంచి స్నేహితులుగా మాత్రం తరచూ కలిసి దర్శనమిస్తారు.

చదవండి: విరూపాక్ష సినిమా వేయలేదని థియేటర్‌పై దాడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement