Sangeeta Bijlani
-
సల్మాన్ ముఖంపై పంచ్ ఇచ్చిన మాజీ ప్రేయసి
-
సల్మాన్ పెళ్లి చేసుకోకపోవడానికి ఆవిడే కారణం! వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లరే.. కానీ అప్పట్లో ఆయన నడిపిన ప్రేమాయణాల చిట్టా తీస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే! ఎంతోమంది హీరోయిన్లను ప్రేమించిన ఆయన ఎవరినీ తన లైఫ్ పార్ట్నర్ను చేసుకోలేకపోయాడు. నచ్చినన్నాళ్లు ప్రేమించి, ఆ తర్వాత బ్రేకప్ చెప్పడమనేది అతడి విషయంలో పరిపాటిగా మారింది. తాజాగా అతడు తన సోదరి అర్పితా ఖాన్- ఆయుష్ శర్మల దంపతులు ఇచ్చిన ఈద్ పార్టీకి వెళ్లాడు. ముంబైలో శనివారం జరిగిన ఈద్ పార్టీకి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు విచ్చేశారు. వారిలో సల్లూభాయ్ మాజీ ప్రేయసి, నటి సంగీతా బిజ్లానీ కూడా ఉంది. అతడి వెనకాలే ఉన్న సంగీతా సల్మాన్ ముఖంపై ఒక్క పంచ్ ఇచ్చింది. అదేమీ పట్టించుకోని హీరో మరొకరితో నవ్వుతూ మాట్లాడుతుండటంతో ఆమె అతడిని మరోసారి సరదాగా కొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. 'సల్మాన్ పెళ్లి చేసుకోకుండా మిగిలిపోవడానికి ఆవిడే కారణం', 'సల్మాన్‌తో నిశ్చితార్థం రద్దు చేసుకుని క్రికెటర్‌ను పెళ్లాడింది. తీరా అక్కడ సంసారం నాశనం చేసుకుని విడాకులిచ్చేసి ఇప్పుడు మళ్లీ హీరో చెంతకు చేరింది', 'ఆమె మరొకరిని పెళ్లి చేసుకునేలోపు మీరే ఆమెను వివాహం చేసుకోండి' అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా సల్మాన్ ఖాన్, ఒకప్పటి హీరోయిన్ సంగీత బిజ్లానీతో దాదాపు దశాబ్ధకాలం పాటు డేటింగ్ చేశాడు. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. తర్వాత సంగీత ఇండియన్ మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌ను పెళ్లి చేసుకోగా 14 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ 2010లో విడాకులిచ్చింది. ఇకపోతే సల్మాన్-సంగీత విడిపోయినప్పటికీ మంచి స్నేహితులుగా మాత్రం తరచూ కలిసి దర్శనమిస్తారు. చదవండి: విరూపాక్ష సినిమా వేయలేదని థియేటర్‌పై దాడి -
సల్మాన్‌తో డేటింగ్..అజహరుద్దీన్‌తో పెళ్లి.. చివరకు బ్రేకప్
అజహరుద్దీన్.. క్రికెట్లో ఓ కొత్త చరిత్ర! సంగీతా బిజ్లానీ.. బాలీవుడ్ తెర మీద మెరిసిన ఒక కొత్త మోడల్! ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటికే అజహర్ వివాహితుడు.. ఇద్దరు పిల్లల తండ్రి కూడా. సంగీతా బిజ్లానీది శుభలేఖల దగ్గరే ఆగిపోయిన పెళ్లి. ఆ విరిగిన మనసుకు మళ్లీ ప్రేమతో సాంత్వననిచ్చాడు అజహర్. అదీ శుభం కార్డ్ వేసుకోలేకపోయింది. క్రికెటర్ అజహర్ కంటే ముందు సంగీతా జీవితంలో నటుడు సల్మాన్ ఖాన్ ఉన్నాడు తన ప్రేమ వర్తమానాన్ని అందించి. కెరీర్లో సల్మాన్ కంటే సంగీతానే సీనియర్. ఆమె అందమో.. అభినయమో.. సల్మాన్‌ను ఆకట్టుకుంది. సంగీతా అంటే ఇష్టం ఏర్పడింది. అదే విషయం ఆమెతో చెప్పాడు. ఆశ్చర్యపోయింది. ‘నువ్వంటే నాకిష్టం.. ఒట్టు.. నన్ను నమ్ము’ అన్నాడు అతను. ఆ అభ్యర్థనలో నిజాయితీ కనిపించింది.. వినిపించింది. ‘సరే’ అంది మది నిండా నమ్మకాన్ని నింపుకుంటూ.. కళ్లతో ప్రేమను కురిపిస్తూ! అలా ఆరంభమైన ఆ డేట్ దాదాపు పదేళ్లు కొనసాగింది. ఆ విషయం బాలీవుడ్లో వార్తవడమూ.. దాన్ని సినిమా పత్రికలు మోయడమూ సాధారణమే కదా! నిశ్చితార్థం జరిగింది.. కానీ సల్మాన్ మరో అమ్మాయితో.. వాళ్ల ప్రేమ... పెళ్లి ప్రస్తావననూ తెచ్చింది. దానికి నిశ్చితార్థమూ జరిగింది. శుభలేఖలూ అచ్చయ్యాయట. మరి పెళ్లి సందడి మొదలవలేదు ఎందుకు?సంగీతాను కాదని సల్మాన్ ఇంకో అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఆ నిజం సంగీతాకు చెప్పే ధైర్యం చేయలేదు. ఆమెకు తెలియకుండా జాగ్రత్తపడే ప్రయత్నం చేశాడు. కానీ అనుకోకుండా ఆ అమ్మాయితో సంగీతా కంటపడ్డాడు. ‘నా పట్ల నీ ప్రేమ నిజమని నమ్మమన్నావ్?’ కళ్లతోనే నిలదీసింది సంగీతా. సమాధానం లేక తలవంచుకున్నాడు సల్మాన్. అందుకే ఆ పెళ్లి పీటలెక్కలేదు. సల్మాన్ నమ్మకద్రోహాన్ని తట్టుకోలేకపోయింది సంగీతా. ఇద్దరు పిల్లల తండ్రితో సంగీత.. ప్రేమను వెతుక్కుంది ఆ సమయంలోనే అజహరుద్దీన్‌తో ఓ యాడ్ షూట్ చేస్తోంది సంగీతా. తొలిచూపులోనే ఆమెకు ఫిదా అయిపోయాడు అజహర్. ప్రణయంతోనే మొదలైంది ఆ పరిచయం. దాంతో ఆ యాడ్ షూటింగ్ అయిపోయాకా కలుసుకోవడం మొదలుపెట్టారు ఇద్దరూ. ఏ సినిమా ఈవెంట్‌కైనా అజహర్తోనే హాజరవ సాగింది సంగీతా. అజహర్ కూడా సంగీతా తోడు లేనిదే.. రానిదే పేజ్ త్రీ పార్టీకి అటెండ్ అయ్యేవాడు కాదు. లైఫ్ స్టయిల్ కాలమ్స్ అన్నీ వాళ్ల కబుర్లతోనే కడుపునింపుకొనేవని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా! అయితే.. అప్పటికే అజహరుద్దీన్‌కు పెళ్లయి, ఇద్దరు పిల్లల కూడా ఉండడంతో ఆ ప్రేమ వివాదాస్పదంగా మారింది. భార్యకు తలాక్ చెప్పి..సంగీత చేయి అందుకున్నాడు అజహర్ భార్య నౌరీన్‌కు మనస్తాపాన్ని కలిగించింది. కానీ సంగీతా పట్ల తన ప్రేమ విషయంలో అజహర్ మాత్రం ఒక స్పష్టతతోనే ఉన్నాడు. తతిమా జీవితాన్ని ఆమెతోనే పంచుకోవాలనుకున్నాడు. ఆ నిజాన్నే నౌరీన్‌కు చెప్పాడు. బాధపడింది. ఏడ్చి, ఏడిపించి ప్రేమను లాక్కోలేమని గ్రహించింది నౌరీన్. అజహర్ తలాక్ ప్రపోజల్‌ను మన్నించింది. అతని వైవాహిక జీవితంలోంచి పక్కకు తప్పుకుంది. సంగీతా చేయి అందుకున్నాడు అజహర్.అప్పటి నుంచి అతని అడుగులో అడుగైంది సంగీతా. అతని కెరీర్ ఒడిదుడుకుల్లో కొండంత ధైర్యంగా నిలబడింది. అతని వ్యక్తిగత దుఃఖాలకు ఓదార్పుగా మారింది. అజహర్ చుట్టే ప్రపంచాన్ని అల్లుకుంది. అతని ఆనందానికి నిమిత్తమైంది. తన నిమిత్తంలేని అతని బాధను పంచుకుంది. అలా పద్నాలుగేళ్లు సాగింది వాళ్ల కాపురం. అదీ బ్రేక్ అయింది దానికీ కారణం నమ్మకద్రోహమే! నౌరీన్‌ను కాదని తనతో ప్రేమలో పడ్డట్టే తనను మరచి మరో అమ్మాయితో అజహర్ ప్రేమలో పడ్డాడని సంగీతా మనసులో బాధ. అది అపోహ మాత్రమే అంటాడు అజహర్. ఎవరిది నిజమో.. ఎవరిది అపోహో ఆ ఆలుమగలకే తెలియాలి. ప్రేమ పంచాయతీకొచ్చిందనేది మాత్రం బయటవాళ్లెరిగిన సత్యం. ఎట్టకేలకు ఆ ప్రేమ విడాకులతో చిత్తగించింది. సంగీతా ఒంటరిగా మిగిలింది. తన బ్లాగ్ రచనలో తలమునకలైంది. ‘ప్రేమలో పడిన మాటను బయటకెవరూ చెప్పుకోరు కానీ నేను చెప్తున్నాను.. తొలిచూపులోనే సంగీతాతో ప్రేమలో పడ్డా. ఇది నిజం’ అని చెప్పాడు అజహరుద్దీన్ ఒక ఇంటర్వ్యూలో. ‘మగవాళ్లెప్పుడూ పలాయనవాదులే. తమ అసంతృప్తులు, ఇబ్బందులకు వైవాహిక బంధానికి ఆవల పరిష్కారాన్ని వెదుక్కోవాలనుకుంటారు’ అని తన బ్లాగ్‌లోని ఓ వ్యాసంలో రాసుకుంది సంగీతా. ఎస్సార్ -
సల్మాన్‌తో ఇప్పటికీ టచ్‌లోనే ఉంటా : సల్లు భాయ్ మాజీ ప్రేయసీ
కండల వీరుడు, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నడిపిన ప్రేమయాణాల గురించి తెలిసిందే. ఒకప్పటి హీరోయిన్ సంగీత బిజ్లానీతో దాదాపు దశాబ్దం పాటు డేటింగ్ చేశాడు సల్లు భాయ్. పెళ్లిదాకా వచ్చిన వీరి బంధం ఎందుకో బెడిసికొట్టింది. అనంతరం బిజ్లానీ ఇండియన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌ను వివాహం చేసుకుంది, అయితే 2010లో అతడితో విడాకులు తీసుకుంది. (చదవండి: మెంటల్ వెకేషన్లో హైదరాబాద్ కోడలు) అయితే ఇటీవల బిజ్లానీ ఓ ప్రముఖ పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమెను మీరు సినీ ఇండస్ట్రీలో ఎవరితో టచ్‌లో ఉంటారు అని అడగగా.. ‘సల్మాన్‌తో విడిపోయిన తర్వాత కూడా మేం మంచి స్నేహితులుగానే ఉన్నాం అని తెలిపింది. ఎందుకంటే మేం స్నేహానికి గౌరవమిస్తాం’ అని సల్లు భాయ్ మూవీ ‘మైనే ప్యార్ కియా’లోని డైలాగ్ ఒకటి చెప్పింది. అలాగే మీనాక్షి శేషాద్రితో సన్నిహితంగా ఉంటానని, వారిద్దరూ కలిసి వరల్డ్ టూర్ చేసినట్లు తెలపింది. మోడలింగ్ రోజుల నుంచి నేను కొల్పోయిన పాత స్నేహితులు అందరూ టచ్‌లోకి వచ్చారని, అందుకు కారణమైన సోషల్ మీడియాకి థ్యాంక్స్ చెప్పింది. కాగా, పెళ్లి తర్వాత సినిమా నుంచి విరామం తీసుకున్న సంగీత అంతకుముందు త్రిదేవ్, హథ్యార్, జుర్మ్తో వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఇటీవల డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ ఓ ఎపిసోడ్లో కనిపించింది. -
మెంటల్ వెకేషన్లో హైదరాబాద్ కోడలు
అజారుద్దీన్‌ను పెళ్లి చేసుకున్నాక సంగీతా బిజిలానీ హైదరాబాద్ కోడలు అయ్యింది కానీ ఆమె ఇక్కడ ఉండేది తక్కువ. ముంబైలోనే ఎక్కువగా ఉంటారామె. పెళ్లి తర్వాత నటనకు దూరంగా గృహ జీవితానికే పరిమితమైన సంగీత యోగాను బాగా సాధాన చేస్తుంటారు. కుండలినీ శక్తిని జాగృతం చేయడం కోసం యోగా చేయాలని చెబుతుంటారామె. పత్రికల కథనం ఆమె ఆస్తిపాస్తులు 35 కోట్ల వరకూ ఉంటాయని. నటిగా ‘త్రిదేవ్’, ‘హత్యార్’, ‘జుర్మ్’ వంటి హిట్ సినిమాల్లో నటించారామె. అయితే నటిగా కంటే మోడల్‌గా సంపాదించింది ఎక్కువ. 1980లో ‘మిస్ ఇండియా’ అయిన సంగీత కుర్రాళ్ల కలల దేవతగా ఉండేది. ఆమెను గెలుచుకున్న వీరుడు మాత్రం రెండో వివాహానికి సిద్ధపడ్డ అజారుద్దీన్. సంగీతా బిజిలానీకి ప్రకృతి అంటే ఇష్టం. ఆమె ప్రకృతి పరిసరాల్లో తిరుగుతూ ఆ ఫొటోలను తన ఫేస్బుక్ పేజీలో పెడుతూ ఉంటారు. ఆమెకు లోనావాలా దగ్గర ఒక ఫామ్‌హౌస్ ఉంది. అక్కడకు వెళుతుంటారు. ఇటీవల తండ్రితో వెళుతున్న వీడియోను పోస్ట్ చేశారు. లోనావాలకు దగ్గరగా ఉన్న పావ్నా సరస్సు దగ్గర కూడా ఆమె బస చేసిన ఫోటోలు ఉన్నాయి. ఇలా తిరగడాన్ని ఆమె ‘మెంటల్ వెకేషన్స్’ అంటారు. కరీనా కపూర్ వంటి నటీమణులు పెళ్లయిన వ్యక్తితో వివాహానికి సిద్ధపడి సంతానాన్ని కన్నా సంగీతా సంతానానికి దూరంగా ఉన్నారు. -
రీలుపై... రియల్ పాత్ర వివాదం
భారత మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ జీవితంపై ఇమ్రాన్ హష్మీ హీరోగా హిందీలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ‘అజహర్’ సినిమాలో అజహరుద్దీన్ జీవితం, ఆయన మాజీ భార్య అయిన సినీ నటి సంగీతా బిజ్లానీ సహా పలువురు నిజజీవిత వ్యక్తులు పాత్రలు కనిపించడం సహజం. సంగీతా బిజ్లానీ పాత్రను వెండితెరపై నర్గిస్ ఫక్రీ పోషించనున్నారు. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారమే వివాదాస్పదంగా మారింది. మొదట్లో ఈ సినిమా, అందులోని పాత్ర గురించి మాట్లాడేందుకు చిత్ర దర్శక, నిర్మాతలు సంగీతను కలిసే ప్రయత్నం చేశారు. కానీ, ఈ ప్రాజెక్ట్‌తో తమకేమీ సంబంధం లేదని సంగీత తేల్చేశారు. తీరా ఇప్పుడు తనతో ఏ మాత్రం పోలిక లేని నర్గిస్ ఫక్రీ ఆ పాత్రను పోషించడం సంగీతకు నచ్చట్లేదని వినికిడి. దాంతో, రేపు సినిమాలో తన పాత్రను సరిగ్గా తీర్చిదిద్దకపోతే ఆమె చట్టపరంగా చర్య తీసుకోవాలని భావిస్తున్నారట! అయితే, అజహరుద్దీన్ వ్యక్తిగత, వృత్తి జీవితాల్లోని భావోద్వేగభరిత ఘట్టాలకు వెండితెర రూపమైన ఈ సినిమాలో నటిస్తున్నందుకు నర్గిస్ ఫక్రీ మాత్రం మహదానందపడిపోతున్నారు. వీలుంటే, త్వరలోనే సంగీతా బిజ్లానీని స్వయంగా కలవాలని కూడా భావిస్తున్నారు. ‘‘ఈ సినిమాలో ఆమె (సంగీత పాత్ర)ను ఎంతో హుందాగా దర్శకుడు తీర్చిదిద్దారు. మా దర్శకుడు చెప్పినట్లే చేశాను. కాకపోతే, ఆమె గురించి అందుబాటులో ఉన్న సమాచారం మొత్తం చదివాను. పరిచయస్థుల ద్వారా అజహర్, సంగీతల జీవితం గురించి తెలుసుకున్నా’’ అని చెప్పుకొచ్చారు. అదే సమయంలో, ‘‘స్క్రిప్ట్‌లోని పాత్రలన్నీ నిజజీవితంలో సజీవంగా ఉన్నవారివి కాబట్టి, కచ్చితంగా పోలికలు వస్తాయి కాబట్టి, కొంత భయంగా కూడా ఉంది’’ అన్నారు. మొత్తానికి, నిజజీవిత కథల మీద ఆధారపడి తీస్తున్న సినిమా అంటే, ఆ నిజజీవిత వ్యక్తులకైనా, ఈ తెర మీద నటిస్తున్నవాళ్ళకైనా అనుమానాలు, భయాలు సహజమే కదూ! -
జూలై 9 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: సంగీతా బిజ్లాని (నటి) వెంకటపతిరాజు (క్రికెటర్) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రగ్రహానికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం మీరు పట్టినదంతా బంగారమా అన్నట్లుంటుంది. పిల్లల చదువులు, పెళ్ళిళ్లు వంటి కుటుంబపరమైన బాధ్యతలన్నీ నెరవేర్చి ఆత్మసంతృప్తిని పొందుతారు. అవివాహితులకు వివాహమవుతుంది. సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. వ్యాపారం లేదా స్థిరాస్తి వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. కుటుంబంతో సంతోషంతో గడుపుతారు. ఇంటికి అవసరమైన దానికన్నా అధిక ధరలో గృహోపకరణాలను సమకూర్చుకుంటారు. వస్త్రధారణలోనూ, జీవనశైలిలోనూ మంచి మార్పులు వస్తాయి. సినిమా, మీడియా రంగాలలో ఉన్న వారికి, ఇంటీరియర్ డెకరేటర్లకు, ఆర్కిటెక్ట్‌లకు, సంగీత, నాట్య రంగాలలోని వారికి అధిక ఆదాయం, గుర్తింపు వస్తాయి. లక్కీ నంబర్లు: 1,6,9,5; లక్కీ కలర్స్: రెడ్, బ్లూ, ఆరంజ్, పర్పుల్, శాండల్; లక్కీ ఏస్: మంగళ, బుధ, శుక్రవారాలు. సూచనలు: పేద విద్యార్థులకు బట్టలు, పుస్తకాలు కొనివ్వడం, తల్లిని కాని, తల్లితో సమానమైన వారిని కాని ఆదరించి గౌరవించడం మంచిది. మద్యం జోలికి పోకుండా ఉండటం మంచిది. - డా. మహమ్మద్ దావూద్ జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు -
ఎక్స్‘ప్లస్’!
‘బోల్డ్’గా ఉండే సల్మాన్‌ఖాన్ చుట్టూ బోల్డన్ని కబుర్లుంటాయి ఎప్పుడూ! ముఖ్యంగా మనోడు సినిమాలతో ఎంత ఫేమస్సో... చుట్టూ గాళ్‌ఫ్రెండ్స్‌తో అంతే పాపులర్. థియేటర్లలో అతగాడి పిక్చర్ ఏదీ ఆడకపోతున్నా... డేటింగ్ అప్డేట్స్తో న్యూస్‌లో కనిపిస్తూనే ఉంటాడు. లేటెస్ట్గా ఓ సన్సేషన్... సల్లూ భాయ్ తొలినాళ్ల ప్రేయసి సంగీతా బిజ్లానీ... ప్రస్తుత ప్రియురాలు లులియా వంట్యూర్ ఒకే పార్టీలో కలసి ఎంజాయ్ చేశారట! అక్కడే ఉన్న కండల వీరుడు తన లైఫ్‌లోకొచ్చిన మాజీ ప్రియురాళ్లందరి గురించి వారితో షేర్ చేసుకున్నాడనేది ఓ వెబ్సైట్ కథనం. అయితే ఒక్క ఐశ్వర్యారాయ్ పేరు మాత్రం ప్రస్తావించలేదట! మిగిలిన అందరితో తాను ఎంతో ఆనందంగా గడిపానని... వారి సాన్నిహిత్యాన్ని ప్రతి క్షణం ఆస్వాదించానని చెప్పుకొచ్చాడట. అంటే ఐశ్వర్యతో ఆ హ్యాపినెస్ దొరకలేదా మనోడికి అన్నది బీటౌన్ గుసగుస! -
సంగీత అప్సెట్!
బ్యాండ్ బాజా బారాత్‌తో మతిపోయేలా సోదరి అర్పిత పెళ్లి చేసినా... సల్మాన్‌కు ఇంకా తల బొప్పి కడుతూనే ఉంది. కారణం... గెస్ట్స్ లిస్ట్‌లో కొందరి పేర్లు లేకపోవడం. గిట్టక కొందరిని... గుర్తు లేక మరికొందరిని లిస్ట్‌లో చేర్చని సల్మాన్‌ను ఇప్పుడా సెగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. షారూఖ్‌తో మళ్లీ దోస్తానీ కుదిరి ఓ పక్క ఆనందిస్తుంటే... కావల్సిన వారిని పిలవడం మరచిన గోల మరో పక్క షేక్ చేస్తోంది. తాజాగా ఈ లిస్టులో ఒకప్పటి మనోడి ప్రియురాలు, బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్ సంగీతా బిజిలానీ చేరింది. అతగాడితో కలసి పెళ్లి షాపింగ్ కూడా చేసిన తనను ఎలా పిలవరంటూ సల్మాన్ ఫ్యామిలీని సంగీత నిలదీసిందట పెళ్లి రిసెప్షన్లో. -
మళ్లీ వెండి తెరపై దర్శనమివ్వనున్నరవీనాటాండన్
ముంబై: బాలీవుడ్ మాజీ మెరుపుతీగ రవీనాటాండన్ మళ్లీ వెండి తెరపై దర్శనమివ్వనుంది. ఒనిర్ సినిమా ‘షాబ్’లో సంగీతా బిజ్లానీ స్థానంలో ఆమె పాత్రను దక్కించుకుంది. చిత్రంలో కొన్ని ముద్దు సీన్లు హాట్ హాట్ సన్నివేశాలు ఉండడంతో సంగీతా ‘షాబ్’లో పాత్రను నిరాకరించింది. దీంతో ఆ చాన్స్ రవీనా ఒళ్లో వాలింది. సంజయ్ సూరి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రవీనా తనకు 14 ఏళ్లుగా తెలుసని, సంగీత కన్నా చిన్నది కూడా కావడంతో ఆమె పాత్రకు వయసుకు అనుగుణంగా మెరుగులు దిద్దుతున్నానని నిర్మాత, దర్శకుడు ఒనిర్ చెబుతున్నాడు. ముందు ఈ చిత్రాన్ని చేయడానికి సంగీతా హామీ ఇచ్చినా తరువాత వెనుకడుగేసిందని ఒనిర్ పేర్కొన్నాడు.ఈ సినిమా ఆధునిక సంబంధాలు మరియు శృంగారం ప్రధాన కథాంశంగా రూపుదిద్దుకుంటుదని ఆ దర్శక నిర్మాత తెలిపాడు.