మళ్లీ వెండి తెరపై దర్శనమివ్వనున్నరవీనాటాండన్ | Raveena Tandon steals Sangeeta’s Bijli | Sakshi
Sakshi News home page

మళ్లీ వెండి తెరపై దర్శనమివ్వనున్నరవీనాటాండన్

Published Sat, Jun 28 2014 7:22 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మళ్లీ వెండి తెరపై దర్శనమివ్వనున్నరవీనాటాండన్ - Sakshi

మళ్లీ వెండి తెరపై దర్శనమివ్వనున్నరవీనాటాండన్

ముంబై: బాలీవుడ్ మాజీ మెరుపుతీగ రవీనాటాండన్ మళ్లీ వెండి తెరపై దర్శనమివ్వనుంది. ఒనిర్ సినిమా ‘షాబ్’లో సంగీతా బిజ్లానీ స్థానంలో ఆమె పాత్రను దక్కించుకుంది. చిత్రంలో కొన్ని ముద్దు సీన్లు హాట్ హాట్ సన్నివేశాలు ఉండడంతో సంగీతా ‘షాబ్’లో పాత్రను నిరాకరించింది. దీంతో ఆ చాన్స్ రవీనా ఒళ్లో వాలింది. సంజయ్ సూరి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రవీనా తనకు 14 ఏళ్లుగా తెలుసని, సంగీత కన్నా చిన్నది కూడా కావడంతో ఆమె పాత్రకు వయసుకు అనుగుణంగా మెరుగులు దిద్దుతున్నానని నిర్మాత, దర్శకుడు ఒనిర్ చెబుతున్నాడు.

 

ముందు ఈ చిత్రాన్ని చేయడానికి సంగీతా హామీ ఇచ్చినా తరువాత వెనుకడుగేసిందని ఒనిర్ పేర్కొన్నాడు.ఈ సినిమా ఆధునిక సంబంధాలు మరియు శృంగారం ప్రధాన కథాంశంగా రూపుదిద్దుకుంటుదని ఆ దర్శక నిర్మాత తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement