బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ఎంతోమంది హీరోయిన్లను ప్రేమించాడు. వారిలో ఓ హీరోయిన్‌తో గాఢ ప్రేమలో ఉన్న అతడు పెళ్లికి సైతం ఒప్పుకున్నాడు. మంచి ముహూర్తం చూసుకుని పెళ్లిపత్రికలు కూడా అచ్చు వేయించాడు.. కానీ చివరకు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఇంతకీ అతడు జీవిత భాగస్వామిగా కోరుకున్న హీరోయిన్ మరెవరో కాదు సంగీత బిజ్లానీ (Sangeeta Bijlani).
పత్రికలు కొట్టించాక ఆగిన పెళ్లి?
సంగీత బిజ్లానీ తాజాగా ఇండియన్ ఐడల్ 15వ షోకు ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా మానసి ఘోష్ అనే కంటెస్టెంట్ సంగీతను ఊహించని ప్రశ్న అడిగింది. సల్మాన్‌తో పెళ్లికి సిద్ధమై పత్రికలు కూడా కొట్టించుకున్నాక చివరకు ఆ వివాహమే ఆగిపోయింది. నిజమేనా? అని ప్రశ్నించింది. అది అబద్ధమైతే కాదు అని బదులిచ్చింది. దీంతో అందరూ షాకయ్యారు. ఎందుకు మీ పెళ్లి ఆగిపోయిందో చెప్తారా? అని అడిగాడు. ఇంతటితో ప్రోమో పూర్తయింది. మరి అతడి ప్రశ్నకు సంగీత ఆన్సరిచ్చిందా? లేదా? అనేది ఫుల్ ఎపిసోడ్‌లోనే చూడాలి!
పదేళ్లకు పైగా డేటింగ్
కాగా బాలీవుడ్ (Bollywood)లో కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలో సల్మాన్ ఖాన్, సంగీత ఒకరినొకరు కలుసుకున్నారు. దశాబ్దకాలంపాటు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ చివరకు అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత సంగీత 1996లో మహ్మద్ అజారుద్దీన్‌ను పెళ్లి చేసుకుంది. 2019లో వీరు విడాకులు తీసుకున్నారు. అయితే సల్మాన్‌తో ఇప్పటికీ ఫ్రెండ్‌షిప్ కొనసాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment