రెడీమేడ్ గార్మెంట్స్లో చక్కగా చుట్టి ... | New 2000 rupees notes seized at mumbai airport | Sakshi
Sakshi News home page

రెడీమేడ్ గార్మెంట్స్లో చక్కగా చుట్టి ...

Published Fri, Dec 30 2016 3:31 PM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM

New 2000 rupees notes seized at mumbai airport

ముంబయి : నిన్న మొన్నటి వరకూ లగేజ్‌లోనో, బట్టల్లోనో, అండర్‌ గార్మెంట్స్‌లోనే బంగారాన్ని అక్రమంగా తరలించి విమానాశ్రయాల్లో పట్టుబడిన వార్తలు చూశాం. తాజాగా పెద్దనోట్ల రద్దు ఎఫెక్ట్‌తో కొత్తనోట్లను తరలించేందుకు అక్రమార్కులు కొత్తపంథాను ఎంచుకున్నారు. కొత్త రెడీమేడ్‌ దుస్తుల  మాటున కొత్తనోట్ల కట్టలను చక్కగా ప్యాక్‌ చేసి తరలించేందుకు యత్నించారు.

అయితే అనుమానం వచ్చిన అధికారులు  ఆ రెడిమేడ్‌ గార్మెంట్‌ను తెరిచి చూసి ఆశ్చర్యపోయారు. బట్టలు నలిగిపోకుండా, సపోర్టుగా ఉంచే అట్టముక్కల మధ్యలో కొత్త 2వేల నోట్లు కవర్లలో ఉంచి ప్యాక్‌ చేశారు. ఒక్కో దానిలో నోట్ల కవర్లు నాలుగు ఉండటం విశేషం. ఈ ఘటన ముంబయి విమానాశ్రయంలో చోటుచేసుకుంది. కాగా ముంబయి నుంచి దుబాయి వెళుతున్న ప్రయాణికుల నుంచి లక్షల విలువైన రెండువేల నోట్లను అధికారులు స‍్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నిందితుల వివరాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement