Kangana Ranaut Ignores No Mask, No Entry Sign: కంగనా రనౌత్ తాజాగా ముంబై విమానాశ్రయాంలో దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో కెమెరాలకు ఫోజులిస్తూ లోపలికి కదిలింది. అయితే నో మాస్క్, నో ఎంట్రీ అనే బోర్డు ఉన్నా కంగనా ఏమాత్రం పట్టించుకోలేదు. మాస్క్ లేకుండానే ఎయిర్‌పోర్ట్ లోపలికి వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టాయి. చదవండి: ఆస్పత్రి పాలైన నటి.. త్వరగా కోలుకోవాలంటూ మాజీ భర్త పోస్ట్
ఈ విషయంపై ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ స్పందిస్తూ.. కంగానాకు అతి దగ్గర్లోనే ‘నో మాస్క్, నో ఎంట్రీ’బోర్డు ఉంది. అయినా నిర్లక్ష్యంగా మాస్క్ లేకుండానే వెళ్లిపోయింది. ఎన్నికల తర్వాత ఎలా అయితే రాజకీయ నాయకులు ఓటర్లను పట్టించుకోరో, కంగనా కూడా నియమాలను విస్మరించింది అంటూ దుయ్యబట్టారు. మాస్క్ లేకపోతే లోపలికి ప్రవేశం లేదు అనే నియమం సెలబ్రిటీలకు మాత్రం వర్తించవా అంటూ మరో యూజర్ ప్రశ్నించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవలె కంగనా తలైవి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. సినీ నటి, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అరెరె.. కత్రినా కైఫ్‌కు జిరాక్స్ కాపీలా ఉందే..
Comments
Please login to add a commentAdd a comment