
హీరోయిన్ తమన్నా ప్రేమ వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఇంతవరకు తమన్నాపై ఎలాంటి రూమర్స్ లేవు. అలాంటిది నటుడు విజయ్ వర్మను ముద్దుపెట్టుకుంటున్న వీడియో బయటకు రావడంతో అది టాక్ ఆఫ్ టౌన్‌గా మారింది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా గోవాలో ముద్దు పెట్టుకుంటూ కెమెరాలకు చిక్కారు. దీంతో ఆ వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే ఇప్పటివరకు ఈ పుకార్లపై విజయ్, తమన్నాలు స్పందించలేదు. ఇదిలా ఉంటే న్యూఇయర్ సెలబ్రేషన్స అనంతరం వీరిద్దరూ ముంబైకి చేరుకున్నారు. మొదటగా ఎయిర్‌పోర్టుకు తమన్నా రాగా, ఆ వెంటనే విజయ్ కూడా కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.