
ముంబై : తమ స్టేటస్ చాటుకునేందుకు బాలీవుడ్ భామలు ఎంతైనా ఖర్చుచేస్తున్నారు. ఖరీదైన వస్తువులను ప్రదర్శిస్తూ స్టైల్ స్టేట్‌మెంట్‌లో ఒకర్ని ఒకరు మించిపోతున్నారు. తాజాగా నటి ఇషా కొప్పికర్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేశారు. ఎరుపు రంగు దుస్తులు, యాక్సెసరీస్‌తో ఆకట్టుకున్న ఇషా కొప్పికర్ ఖరీదైన వస్తువులతో రాజసం ప్రదర్శించారు.
పొడవాటి రెడ్ గౌన్ ధరించిన ఇషా కొప్పికర్ తన క్రేజీ బ్యాగ్‌తో కెమెరాలకు ఫోజులిచ్చారు. ఈ బ్యాగ్ ధర భారత కరెన్సీలో రూ 14,54,849 మాత్రమే. కాగా, ఇషా డ్రెస్ ఆమెకు పెద్దగా నప్పలేదని, భారీ బ్యాగ్‌పైనే అందరి దృష్టి కేంద్రకృతమైందని అక్కడి వారు గుసగుసలాడటం వినిపించింది.
Comments
Please login to add a commentAdd a comment