
లక్షలు పలికే హ్యాండ్‌బ్యాగ్..
ముంబై : స్టన్నింగ్ ఎయిర్‌పోర్ట్ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటున్న బాలీవుడ్ భామల సరసన క్వీన్ బ్యూటీ కంగనా రనౌత్ చేరారు. కంగనా ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో బ్లాక్ పవర్ సూట్ ధరించి స్టైలిష్ యాక్సెసరీస్‌తో మెరిసిపోయారు.
బ్లాక్ సూట్‌పై వైట్ టీ షర్ట్, లెనాన్ గ్లాసెస్‌తో అల్ట్రా మోడ్రన్ లుక్‌తో దర్శనమిచ్చారు. కంగనా ఎయిర్‌పోర్ట్ లుక్‌లో హ్యాండ్ బ్యాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కంగనా చేపట్టిన బ్లాక్ వింటేజ్ టోటె బ్యాగ్ 6022 అమెరికన్ డాలర్లు కాగా మన కరెన్సీలో రూ 4,23,136. కంగనా రనౌత్ త్వరలో మణికర్ణికగా స్క్రీన్‌పై సందడి చేయనున్నారు.