
గోవా ఫ్లయిట్ క్యాచ్ చెయ్యడానికి ఆదాశర్మ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఉంది. ఫ్యాన్స్ ఆమెను గుర్తు పట్టగానే అక్కడో చిన్న గుంపు తయారైంది. ‘కొద్దిగా దూరం జరగండి.. ప్లీజ్’ అన్నాడు ఆదా మేనేజర్. ఫ్లయిట్‌కి కొంచెం టైమ్ ఉంది కాబట్టి, ఫ్యాన్స్‌కి వాళ్ల కోరికపై ఆదాతో చిన్న ఇటరాక్షన్ కూడా పెట్టించాడు. మధ్యలో ఒక మిడిల్ ఏజ్డ్, మ్యారీడ్ గై.. చెయ్యెత్తాడు. ‘‘నాకో కిస్ ఇస్తావా మిస్’’ అని. ఆదాకు మతి పోయింది! ‘నో’ అంది. ‘‘నేను మీ బ్రదర్‌నో, ఫాదర్‌నో అనుకుని ముద్దివ్వొచ్చు కదా.. నా చెంపల మీద’’ అన్నాడు. ఆదాకు అతడి చెంప పగల గొట్టాలనిపించింది. చిరునవ్వుతో మళ్లీ ‘నో.. నో..’ అన్నట్లు తల ఊపింది. ‘కమాండో 2’ లో ముద్దు పెట్టుకున్నావు! ‘హార్ట్ ఎటాక్‌లో’ నిమిషం నలభై ఐదు సెకన్లు ఒకే కిస్ మీద ఉన్నావు.
నాకు ఇవ్వడానికి ఏమైంది బేబీ’ అన్నాడు. ‘ఓరి దరిద్రుడా.. అది సినిమారా. అందులో ముద్దు పెట్టింది నేను కాదు. నా క్యారెక్టర్’ అని అనాలనుకుంది కానీ అనలేకపోయిందట ఆదా. ఫ్యాన్స్ మూడ్ పాడు చేసి, తన మూడ్ పాడు చేసుకోవడం ఎందుకని. తర్వాత తన బాధను ట్విట్టర్‌లో పెట్టింది. ‘‘సినిమాలో నా మోకాళ్లు కనిపించవచ్చు. నా మోచేతులు కనిపించవచ్చు. నా వెన్ను, నా భుజాలు కూడా. దానర్థం నేను వాంఛతో రగిలిపోతున్నానని కాదు కదా’’ అని. ఎంతో బాధగా, కోపంగా. దీనిపై ఇప్పుడు పెద్ద డిబేట్ నడుస్తోంది. సినిమా హీరోయిన్లు పబ్లిక్ ఫిగర్స్ అయినంత మాత్రాన పబ్లిక్ ప్రాపర్టీ అయిపోతారా? మైండ్ సెట్ మార్చుకోండి బ్రో.
Comments
Please login to add a commentAdd a comment