సాక్షి, ముంబై: ముంబై విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికుల నుండి రూ. 36 లక్షల విలువ చేసే బంగారం కడ్డీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశ విదేశాలకు వస్తువులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులు, తమ కంప్యూటర్ సీపీయూ, వంట చేసే పాన్‌లో బంగారాన్ని దాచి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
దుబాయ్ నుండి వచ్చిన హిరేన్ చౌహ న్ సామగ్రిని స్క్రీనింగ్ చేయగా, అతని కంప్యూటర్ సీపీయూలో 10 బంగారు కడ్డీలు బైట పడ్డాయని, ఒక్కొక్కటి 116 గ్రాముల బరువుందని, వాటి మొత్తం విలువ రూ.27.88 లక్షలుంటుందని కస్టమ్స్ కమిషనరు ఏపీఎస్ సూరి చెప్పారు.
రహస్యంగా దాచిన బంగారాన్ని గుర్తించడానికి ముంబై విమానాశ్రయంలో అత్యాధునిక లైన్ స్క్రీనింగ్ పరికరాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. షార్జా నుంచి వచ్చిన సఫియా షరీఫ్ మొహమ్మద్ అనే మహిళా ప్రయాణికురాలినుంచి రూ.8.74 లక్షల విలువ చేసే 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని మరో కస్టమ్స్ అధికారి మిలింద్ లాంగేవర్ తెలిపారు.
విమానాశ్రయంలో రూ.36 లక్షల విలువైన బంగారం స్వాధీనం
Published Thu, Jan 29 2015 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM
Advertisement
Advertisement