అభిమానం అత్యుత్సాహం | Rashmika Mandanna Surrounded By Fans At Airport In Mumbai, Felt Uncomfortable | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: అభిమానం అత్యుత్సాహం

Published Sun, Jul 14 2024 1:20 PM | Last Updated on Sun, Jul 14 2024 2:34 PM

Rashmika Mandanna surrounded by fans at airport

సెలబ్రిటీలకు ఒక్కోసారి అనూహ్య సంఘటనలు ఎదురవుతుంటాయి. అందులో కొన్ని ఆనందాన్ని కలిగిస్తే, మరికొన్ని అసౌకర్యాన్ని కలిగిస్తుంటాయి. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలను నటీనటులు ఎదుర్కొంటుంటారు. అసౌకర్య సంఘటలకు కొందరు నటీనటులు ఆగ్రహానికి గురవడం, అభిమానులపై దురుసుగా ప్రవర్తించడం జరుగుతుంటుంది. మరికొందరైతే అసౌకర్యం అనిపించినా, పైకి మాత్రం చిరునవ్వులు చిందిస్తూ అక్కడ నుంచి త్వరగా బయటపడతారు. 

సరిగ్గా అలాంటి సంఘటననే నటి రష్మిక మందన్న ఎదుర్కొన్నారు. అసలే ఈ బ్యూటీ నేషనల్‌ క్రష్‌ కావడంతో అభిమానుల కంటపడితే ఊరుకుంటారా? చుట్టుముట్టేయరూ.. తాజాగా ఈ భామ విషయంలో అదే జరిగింది. రష్మిక మందన్న తెలుగు, తమిళం, హిందీ అంటూ కాళ్లకు బలపాలు కట్టుకుని విమానాల్లో తిరిగేస్తున్నారు. ఈమె హిందీలో సల్మాన్‌ఖాన్‌కు జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. 

ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొనడానికి ముంబయికి వెళ్లారు. అక్కడ విమానాశ్రయంలో దిగగానే పలువురు అభిమానులు రష్మికను చుట్టు ముట్టారు. వారంతా ఉత్సాహంతో ఆమెతో సెల్ఫీలు తీసుకునే పనిలోపడ్డారు. అందు లో ఒక అభిమాని మాత్రం అత్యుత్సాహంతో రష్మిక మందన్న చేతిని పట్టుకుని సెల్ఫి దిగే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక్క క్షణం షాక్‌కు గురైన రష్మికమందన్నా అసహనానికి గురయ్యారు. అయితే దాన్ని బయటకు తెలియకుండా పైకి చిరునవ్వులు చిందిస్తూ అక్కడి నుంచి బయట పడ్డా రు. ఆ వీడియో ఇప్పుడు సా మాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.  దీన్ని చూసిన నెటిజ న్లు మహానటి కదా అంటూ కాంమెంట్స్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement