
ముంబై : బ్రాండెడ్ ఐటెమ్స్‌ను ప్రదర్శించడంలో బాలీవుడ్ నటులు ఎప్పుడూ ముందుంటారు. ఇక క్రేజీ హీరోయిన్ల విషయం ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ బల్గేరియా నుంచి ముంబైకి వస్తూ ఎయిర్‌పోర్ట్‌లో తళుక్కున మెరిశారు. దుస్తుల నుంచి యాక్సెసరీస్ వరకూ బ్లాక్ కలర్‌ను ఎంపిక చేసుకున్న అలియా రెడ్ బ్యాగ్‌ను ధరించి ఆకట్టుకున్నారు.
స్పానిష్ లగ్జీరీ బ్రాండ్ బలెన్సియగకు చెందిన రెడ్ నైలాన్ బెల్ట్ ప్యాక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ బ్యాగ్ ఖరీదు 660 డాలర్లు కాగా భారత కరెన్సీలో రూ 45,000. అలియా భట్ మొత్తానికి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రెడ్ బ్యాగ్‌తో ఆల్ ఇన్ బ్లాక్ అంటూ స్టన్నింగ్ లుక్‌లో దర్శనమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment