
ముంబై : బాలీవుడ్ భామల ఎయిర్‌పోర్ట్ లుక్ అందరినీ ఆకర్షిస్తున్న క్రమలో తాజాగా నటి మలైకా అరోరా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అందరి దృష్టినీ ఆకర్షించారు.స్టన్నింగ్ లుక్‌తో పాటు స్టైలిష్ యాక్సెసరీస్‌తో ఆకట్టుకున్నారు.
గ్రే కలర్ డ్రెస్‌పై అదే కలర్ జాకెట్, బ్లాక్ గాగుల్స్‌తో కట్టిపడేశారు. ఇక ఆమె ధరించిన డ్రెస్, యాక్సెసరీస్‌లో హ్యాండ్‌బ్యాగ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ బ్యాగ్ ఖరీదు జస్ట్ 2900 అమెరికన్ డాలర్లు. అయితే భారత కరెన్సీలో దీని విలువ అక్షరాలా రూ 2.3 లక్షలపైచిలుకే.