ఉక్రెయిన్‌పై గెలుపు కోసం పుతిన్ పెద్ద ఎత్తున సైనిక సమీకరణలు చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు లక్షల మందికి పైగా సైనికులను సైతం రిక్రూట్ చేసుకుంది రష్యా. ఇప్పుడూ ఏకంగా చిన్నారులకు పాఠశాల స్థాయి నుంచి సైనిక శిక్షణ ఇవ్వమంటూ ఆదేశాలు జారీ చేసింది రష్యా. ఈ మేరకు రష్యా విద్యామంత్రి సెర్గీ క్రావ్‌త్సోవ్ మాట్లాడుతూ....సోవియట్ కాలం నాటి ప్రాథమిక సైనిక శిక్షణ పునరుద్ధరించనున్నట్లు చెప్పారు.
తాము ప్రాథమిక సైనిక శిక్షణ కార్యక్రమం పాఠ్యాంశాల్లో చేర్చనున్నట్లు తెలిపారు. పిల్లలకు తుపాకిని ఎలా పట్టుకుని షూట్ చేయాలి, ఎలా లాక్ చేయాలి, గాయాలైతే ఎలా ప్రథమ చికిత్స అందించాలి, ఏదైనా రసాయన దాడి జరిగితే ఎలా తమను తాము కాపాడుకోవాలి వంటి వాటిల్లో తర్ఫీదు ఇవ్వాలన్నారు. ఈ సైనిక కోర్సు వచ్చే ఏడాది నుంచి పాఠ్యాంశాల్లో చేర్చనున్నట్లు తెలిపారు.
ఈ విధానంతో పౌరులు శత్రువుతో ఎలా తలపడాలో నేర్చుకోవడమే గాక యుద్ధానికి సన్నద్ధమయ్యేలా సిద్ధం చేయగలుగుతాం అంటున్నారు. ఐతే ఈ విధానం పట్ల తల్లిదండ్రల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాఠశాలలు అనేవి యుద్ధానికి కాదు ప్రశాంతమైన సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించటం నేర్పడానికి అంటూ తిట్టిపోస్తున్నారు.
(చదవండి: ఖేర్‌సన్: కీలక విలీన ప్రాంతం నుంచి రష్యా బలగాల ఉపసంహరణ)
Comments
Please login to add a commentAdd a comment