‘ఐపీఎల్‌ కోసం అత్యు‍త్తమ శిక్షణ’ | Good Training Sessions For IPL Says Kohli | Sakshi
Sakshi News home page

‘ఐపీఎల్‌ కోసం అత్యు‍త్తమ శిక్షణ’

Aug 15 2020 6:42 PM | Updated on Aug 15 2020 6:54 PM

Good Training Sessions For IPL Says Kohli - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత తరం క్రికెటర్లలో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి హవా గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. విరాట్‌ కేవలం క్రికెట్‌లో మాత్రమే కాకుండా సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతు అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా ఐపీఎల్(ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్)‌ 2020‌పై కోహ్లీ స్పందిస్తూ.. సెప్టెంబర్‌లో జరగబోయే ఐపీఎల్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కాగా త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్‌ కోసం అత్యుత్తమ శిక్షణతో సాధన చేశామని అన్నారు. శిక్షణ తరగతులను టీమ్‌ ఆటగాళ్లు అద్భుతంగా ఉపయోగించుకున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

కాగా తమ జట్టు ఆటగాళ్లు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారని కోహ్లీ తెలిపారు. ఇటీవల ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఐపీఎల్‌ 2020 19 సెప్టెంబర్‌ నుంచి 8నవంబర్‌ 2020 వరకు యూఏఈలో జరగనున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement