ఉద్యోగ విరమణ తర్వాత చాలామంది విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలనే ఉద్దేశంతో ఇంటికే పరిమితం అవుతుంటారు. కానీ, జైపూర్ వాసి డాక్టర్ మాయా టాండన్ మాత్రం తన రిటైర్మెంట్ జీవితాన్ని రోడ్డు ప్రమాదాల్లో ్రపాణాలు కోల్పోతున్నవారిని కాపాడేందుకు అంకితం చేసింది. స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి లక్షా ముప్పై మూడు వేల మందికి రోడ్డు భద్రతకు సంబంధించిన శిక్షణ ఇచ్చింది. జీవితం పట్ల ఉత్సాహం, సమాజం కోసం పనిచేయాలనే
తపనతో గత ముప్ఫై ఏళ్లుగా డాక్టర్ మాయా టాండన్ చేస్తున్న కృషికి గానూ ఆమెను ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారం వరించింది. వైద్యసేవలోనే తరిస్తున్న టాండన్ గురించి ఆమె మాటల్లోనే...
‘‘అజ్మీర్‌లో పుట్టి పెరిగాను. చిన్ననాటి నుంచి కుటుంబ మద్దతు నాకు ఎక్కువే ఉంది. అన్ని బోర్డ్ పరీక్షలలో మంచి మార్కులు సాధించి, అజ్మీర్‌లోని మెడికల్ స్కూల్‌లో చేరాను. జీవితమంతా నాదైన మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ నాకు లభించింది. అజ్మీర్‌లోని హాస్పిటల్‌లో వైద్యురాలిగా చేరాను. అక్కడే టాండన్‌తో జరిగిన పరిచయం పెళ్లికి దారితీసింది. పెళ్లి తర్వాత జైపూర్‌కు వెళ్లాను. కొడుకు పుట్టిన తర్వాత అనస్తీషియాలజీలో డి΄÷్లమా చేశాను. డి΄÷్లమా పూర్తయ్యేనాటికి కూతురు కూడా పుట్టింది. ఆ తర్వాత అనస్తీషియాలోనే ఎమ్మెస్ కూడా చేశాను. జైపూర్‌లోని మెడికల్ కాలేజీలో అనస్తీషియాపై స్పీచ్‌లు ఇచ్చేదాన్ని. అందులో భాగంగా పీడియాట్రిక్ అనస్తీషియా కోసం లండన్ ఫెలోషిప్‌కు హాజరయ్యాను. అక్కణ్ణుంచి వచ్చాక జైపూర్‌లో పనిచేయడం ్రపారంభించాను.
మూడు రోజుల కోర్సు తిప్పిన మలుపు
సాధారణంగా అందరికీ అనస్తీషియాలజిస్ట్ పాత్ర తెర వెనుక పనిగా కనిపిస్తుంది. నేను మాత్రం రోగి జీవితం అనస్తీషియాలజిస్ట్ పై ఆధారపడి ఉంటుందని నమ్ముతాను. 1975లో సవాయ్ మాన్‌సింగ్ హాస్పిటల్‌లో సూపరింటెండెంట్‌గా, అనస్తీషియా హెడ్‌గా పనిచేస్తూ దాని నిర్వహణను చూశాను. 1985లో పదవీ విరమణ చేసే సమయంలో జైపూర్‌లోని రాజస్థాన్ ΄ోలీసు అకాడమీ నన్ను సంప్రదించి, రోడ్డు భద్రత, ్రపాణాలను రక్షించడంపై మూడు రోజులు కోర్సు ఇవ్వాలని కోరింది.
రిటైర్‌మెంట్ తర్వాత అదే నా జీవిత గమనాన్ని మలుపు తిప్పుతుందని తెలియకనే వారి అభ్యర్థనను అంగీకరించాను. మూడు రోజుల కోర్సు చాలా సక్సెస్ అయ్యింది. దీంతో జైపూర్, చుట్టుపక్కల హైవేలపై ΄ోస్ట్ చేసే సీనియర్ అధికారులందరి కోసం మరొక కోర్సు ఏర్పాటు చేశారు. ఒక ఫొటోగ్రాఫర్ ఆ ఈవెంట్ ఫొటోలు తీయడానికి వచ్చాడు. కొన్ని నెలల తర్వాత అతను నాకు ఫోన్ చేసి, నేను అతని ్రపాణాలను రక్షించానని చె΄్పాడు. అదెలా అని ఆశ్చర్య΄ోయాను. ఆ ఫొటోగ్రాఫర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతని తొడల వెనక భాగంలో రక్తస్రావం అవుతూ ఉంది.
అతని చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలా సహాయం చేయాలో తెలియక ప్రమాదం తాలూకు ఫొటోలు తీసుకుంటున్నారు. తనను ఎత్తి, ఒక చోట ఎలా కూర్చోబెట్టాలో చెప్పి, రక్తస్రావం తగ్గేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సాటివారికి వివరించి, ప్రమాదం నుంచి బయటపడిన విధం గురించి తెలియజేశాడు. దీంతో ఆ కోర్సు ్రపాముఖ్యత ఎంతటిదో గ్రహించాను. సమయానుకూలంగా తీసుకునే జాగ్రత్తలు మన ్రపాణాలను ఎలా కాపాడతాయో ఆ రోజు మరింతగా కళ్లకు కట్టాయి. ఎక్కడైనా ప్రమాదం జరిగితే చుట్టూ అందరూ గుమికూడుతారు. ఆ గుంపులోని వ్యక్తులలో ఎవరికీ ్రపాణాలను రక్షించే దశలు తెలియవు. దీంతో భారతదేశంలో రహదారి భద్రత తీరుతెన్నులు మార్చాలనే ఉద్దేశ్యంతో ‘సహాయ’ ట్రస్ట్‌ను ్రపారంభించాను. అప్పటి నుండి 1,33,000 మంది వ్యక్తులకు ఉచిత కోర్సులు, సెమినార్లు, ఉపన్యాసాలు ఇస్తూ వచ్చాను.
కోర్సులు అన్నీ ఉచితమే
కార్డియోపల్మొనరీ రిససిటేషన్ (సీపీఆర్), ప్రమాదాలను ఎదుర్కోవడానికి సరైన నిర్వహణ పద్ధతులు, అవగాహన పెంచడం దీని లక్ష్యం. ΄ోలీసు విచారణ నుండి లైఫ్ సేవర్‌ను రక్షించే వివిధ చట్టాల గురించి కూడా కోర్సులో పాల్గొనేవారికి తెలియజేస్తాం. గాయపడిన వ్యక్తికి సిపీఆర్, ప్రథమ చికిత్స ఎలా అందించాలో మేం చూపిస్తాం. ప్రజలను చేరుకోవడానికి మాకు వివిధ మార్గాలు ఉన్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో సెమినార్లు ఇస్తాం. వర్క్‌షాప్‌లు, తరగతులను కూడా నిర్వహిస్తాం. అదనంగా ర్యాలీలు చేస్తాం. వీధి నాటకాలు కూడా వేయిస్తాం.
ఒక చిన్న కోర్సులో మొదటి పది సెకన్లలో ఏమి చేయాలో వారికి సూచనలు అందించడానికి ్రపాధాన్యత ఇస్తాం. ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు తలకు గాయాలు, రక్తస్రావం కోసం తనిఖీ చేయమని చెబుతాం. సమస్య ఏమిటో నిర్థారించుకున్న తర్వాత ఆ వ్యక్తికి ఊపిరి, గుండెకు సంబంధించిన సమస్య ఉంటే సీపీఆర్‌ని ఆశ్రయించడం ఉత్తమమైన మార్గం. అంతర్గత రక్తస్రావం, కార్డియాక్ అరెస్ట్ వంటి సమస్యలలో సీపీఆర్ మాత్రమే సహాయం చేస్తుంది. మాల్స్, విమానాశ్రయాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో అత్యవసర సేవలు ఉండేలా ప్రభుత్వ సంస్థలతో కలిసి ట్రస్ట్ పని చేస్తుంది.
అవగాహన లోపమే ప్రధాన అడ్డంకి
వర్క్‌షాప్‌లకు హాజరయ్యేందుకు ప్రజలను తీసుకురావడం మేం ఎదుర్కొంటున్న ప్రధాన అడ్డంకి. భారతీయ ప్రజానీకం ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటారు. కొంత సమయాన్ని అవగాహనకు కేటాయించాలనుకోరు. మా కోర్సులకు వచ్చి, విషయాల పట్ల అవగాహన పెంచుకోక΄ోవడంతో ఇంకా తక్కువ ప్రతిస్పందన రేటునే చూస్తున్నాం. రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం ముందుంది. ప్రతిస్పందనలో మాత్రం చాలా వెనుకుంది. దీంతో మన మూలాలైన గ్రామీణ ్రపాంతాలకు వెళ్లి, ప్రజలను రక్షించడానికి కావల్సిన శిక్షణ ఇవ్వాలని ΄్లాన్ చేస్తున్నాం. కోర్సులో పాల్గొన్న వ్యక్తులు స్వచ్ఛందంగా సేవ చేయడానికి లైఫ్‌సేవర్‌కి తగిన పరికరాలను ట్రస్ట్ అందిస్తుంది. హైవేలకు సమీపంలో నివసించే గ్రామస్థులకు శిక్షణ ఇవ్వడానికి అందరి నుంచి ఆర్థిక సాయం కూడా కోరుతుంటాను. ఎందుకంటే గాయపడిన వారిని చేరుకోవడానికి, మొదటగా స్పందించినవారికి.. విరాళం ఇవ్వడానికి కూడా మేము సహాయం చేస్తుంటాం’ అని వివరిస్తుంది ఈ డాక్టర్.
Comments
Please login to add a commentAdd a comment