
నేటి నుంచి ఉపాధ్యాయులకు కెరీర్ గైడెన్స్‌పై శిక్షణ
సాక్షి, అమరావతి: విద్యార్థులను ఉన్నత చదువులు, ఉత్తమ భవిష్యత్ వైపు ప్రోత్సహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలోను విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ నిపుణులను అందుబాటులో ఉంచేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనుంది.
యునిసెఫ్ ప్రాజెక్టులో భాగంగా కెరీర్ గైడెన్స్ కంటెంట్ రూపకల్పనపై మొదటి విడత శిక్షణను సోమవారం నుంచి మూడు రోజులపాటు విజయవాడలో నిర్వహించనున్నట్టు సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత తెలుగు వెర్షన్ శిక్షణ పూర్తయ్యాక, ఇంగ్లిష్ మీడియంలో కూడా అందిస్తామని, దీనిద్వారా ఉపాధ్యాయులు సమర్థంగా విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment