
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): కేంద్ర ప్రభుత్వం విశేష పథకాలైన పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ పథకాలపై రాష్ట్రంలోని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఈనెల 20వ తేదీన బిజినెస్ స్టార్టప్ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ దాసరి దేవరాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు పెట్టుబడి కలిగిన పరిశ్రమలు స్థాపించటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలు, ఎగుమతులు, మార్కెటింగ్ అవకాశాలపై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.
శిక్షణ అనంతరం బిజినెస్ సెటప్ ఫ్లానింగ్, బ్యాంక్ క్రెడిట్ సపోర్ట్, మెషినరీ సపోర్ట్ కల్పిస్తామని తెలిపారు. శిక్షణ పొందిన వారికి మెటీరియల్‌తో పాటు సర్టిఫికెట్ ఇస్తామని తెలిపారు. విజయవాడ నాడార్స్ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఎంఎస్‌ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో జరిగే ఈ శిక్షణకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈనెల 19 లోపు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం ఎంఎస్‌ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో స్వయంగాగానీ, 6305941717, 8919737517 నంబర్లలోగానీ సంప్రదించాలని ఆయన సూచించారు. (క్లిక్ చేయండి: ఆధునిక టెక్నాలజీతో.. కొత్త ఫ్లైఓవర్)
Comments
Please login to add a commentAdd a comment