
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల రజత పతక విజేత, ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ స్పెయిన్‌లో 45 రోజుల ప్రత్యేక శిక్షణ తీసుకోనుంది. జ్యోతికి సంబంధించి విమాన ప్రయాణాలు, వసతి, శిక్షణ ఇతరత్రా ఖర్చులన్నీ మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ) భరిస్తుందని కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ప్రకటించింది.
పారిస్ ఒలింపిక్స్ సహా, ఈ సీజన్‌లో అత్యున్నత ప్రదర్శన కనబరిచేందుకు ఎంఓసీ పథకంలో ఆమెతో పాటు పలువురు అథ్లెట్లకు ఆర్థిక చేయూత ఇవ్వనున్నారు. వైజాగ్‌కు చెందిన 24 ఏళ్ల జ్యోతి గత ఆసియా క్రీడల్లో 100 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకం గెలిచింది. మరో తెలుగుతేజం, స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు కూడా మరింత మెరుగైన శిక్షణ కోసం ఆరి్థక సాయం అందించే ప్రతిపాదనకు ఎంఓసీ ఆమోదం తెలిపింది.