
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్లు రవి దహియా, దీపక్ పూనియా శిక్షణ మొదలుపెట్టారు. ఇక్కడి ఛత్రశాల స్టేడియంలో ఇద్దరు పట్టుపట్టే పనిలో నిమగ్నమయ్యారు. వీరి ప్రాక్టీస్ వీడియోను కోచ్, రెజ్లింగ్ దిగ్గజం సత్పాల్ సింగ్ మంగళవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అవసరమైన ముందు జాగ్రత్తలతో భౌతిక దూరం పాటిస్తూ శిక్షణ మొదలు పెట్టామని ఆయన ట్వీట్ చేశారు. గతేడాది ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ (కజకిస్తాన్)లో పతకాలు సాధించడం ద్వారా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన దీపక్ (86 కేజీలు), రవి (57 కేజీలు) ఇన్నాళ్లు కోవిడ్ మహమ్మారి వల్ల శిక్షణకు దూరమయ్యారు.