![Kaadhar Wali Speeches on may 19, 20 - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/7/vali.jpg.webp?itok=hmzyha0i)
హైదరాబాద్, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌లలో
సిరిధాన్యాలతో భూతాపాన్ని, సకల వ్యాధులనూ జయించవచ్చని కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేస్తున్న స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్ వలి ఈ నెల 19, 20 తేదీల్లో హైదరాబాద్, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌లలో హైదరాబాద్, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌లలో జరిగే ఆహార, ఆరోగ్య, అటవీ వ్యవసాయ సభల్లో ప్రసంగిస్తారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్‌ల తోడ్పాటుతో వివిధ సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఈ సభలకు అందరూ ఆహ్వానితులే.
ఖైరతాబాద్‌లో: 19వ(ఆదివారం) తేదీ (ఉ. 9–12 గం.)న హైదరాబాద్ ఖైరతాబాద్ జంక్షన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ సంస్థ తమ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఆహార, ఆరోగ్య సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 040–23314969.
సూర్యాపేటలో: 19వ (ఆదివారం) తేదీ (సా. 5 గం. – 8 గం.)న సూర్యాపేటలో నేచర్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో జరిగే ఆహార, ఆరోగ్య సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. కె. క్రాంతికుమార్ – 96032 14455, శివప్రసాద్–86868 71048.
గచ్చిబౌలిలో: 20వ (సోమవారం) తేదీ (ఉ. 10 గం. – 2 గం.)న హైదరాబాద్ గచ్చిబౌలిలో ‘ఇస్కీ’ ఆవరణలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆర్ అండ్ డి సెంటర్ (కేర్ ఆస్పత్రి పక్కన)లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్‌కు చెందిన వాటర్ మేనేజ్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో రైతుల కోసం జరిగే ప్రత్యేక సభలో డాక్టర్ ఖాదర్ వలి అటవీ వ్యవసాయ పద్ధతి, వాననీటి సంరక్షణ, తక్కువనీటితో సిరిధాన్యాల సాగుపై ప్రసంగిస్తారు. వివరాలకు.. శంకర్‌ప్రసాద్ – 90003 00993, ముత్యంరెడ్డి – 94419 27808
మహబూబ్‌నగర్‌లో: 20వ (సోమవారం) తేదీ(సా. 5–7 గం.)న మహబూబ్‌నగర్(న్యూ టౌన్)లోని క్రౌన్ ఫంక్షన్ హాల్‌లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాంకిషన్ ఆధ్వర్యంలో ఆహారం, ఆరోగ్యం, అటవీ వ్యవసాయంపై డాక్టర్ ఖాదర్ వలి తదితరులు ప్రసంగిస్తారు. వివరాలకు.. 94407 12021.
Comments
Please login to add a commentAdd a comment