
అటవీ కృషి పద్ధతిలో ఆరోగ్యదాయకమైన సిరిధాన్యాలు పండించడం.. సిరిధాన్యాలు, కషాయాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలపై ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో వివిధ సభల్లో ప్రసంగించనున్నారు. డిసెంబర్ 9 (ఆదివారం) ఉ. 10 గం. నుంచి నెల్లూరు జిల్లా గూడూరులోని దువ్వూరు నారాయణరెడ్డి కమ్యూనిటీ హాలు (ఐ.సి.ఎస్. రోడ్డు)లో, అదే రోజు సా. 4.30 గం. నంచి నెల్లూరులోని జి.పి.ఆర్. గ్రాండ్ (మినీ బైపాస్ రోడ్డు)లో, డిసెంబర్ 10 (సోమవారం) ఉ. 10 గం. నుంచి కడప జిల్లా రాజంపేటలోని తోట కన్వెన్షన్ సెంటర్(మన్నూరు)లో, అదే రోజు సా. 4.30 గం. నుంచి తిరుపతిలోని లక్ష్మీ వేంకటేశ్వర కళ్యాణ మండపం (పద్మావతిపురం, తిరుచానూరు రోడ్డు, తిరుపతి)లో, 11వ తేదీ చిత్తూరులోని డా. బి.ఆర్.అంబేద్కర్ భవన్(కలెక్టర్ బంగ్లా వెనుక) డాక్టర్ ఖాదర్ వలి సభలను నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు∙తెలిపారు. అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. ఇతర వివరాలకు.. 96767 97777, 70939 73999.
జనవరిలో జాతీయ ఉద్యాన ప్రదర్శన–2019
బెంగళూరు హెసరఘట్టలోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐ.ఐ.హెచ్.ఆర్.)ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం జనవరి 23–25 తేదీల్లో జాతీయస్థాయి ఉద్యాన ప్రదర్శన జరగనుంది. ఉద్యాన పంటల సాగులో కొత్త ఆవిష్కరణలను శాస్త్రవేత్తలు, రైతులు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, సాధారణ ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ఐ.ఐ.హెచ్.ఆర్. ఈ ప్రదర్శన నిర్వహిస్తోంది. ఉద్యాన తోటల సాగులో కొత్త సవాళ్లు – పరిష్కారాలపై రైతులు – శాస్త్రవేత్తల మధ్య చర్చలు జరుగుతాయి. ఐ.ఐ.హెచ్.ఆర్., ప్రైవేటు కంపెనీల విత్తనాలు, మొక్కలను అమ్ముతారు. వినూత్న పోకడలతో అభివృద్ధి సాధిస్తున్న ఆదర్శ రైతులను సత్కరిస్తారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు... డాక్టర్ ఎ. టి. సదాశివ– 98450 97472
sadashiva.AT@icar.gov.in,
డా. టి. ఎస్. అఘోర – 99861 00079
aghora.TS@icar.gov.in
080-23086100 Extn - 280
13,14 తేదీల్లో అటవీ కృషిపై మైసూరులో డా. ఖాదర్ శిక్షణ
అటవీ కృషి పద్ధతిపై రైతులకు డిసెంబర్ 13–14 తేదీల్లో హెచ్.డి. కోట, హ్యాండ్ పోస్టు బేస్ క్యాంప్, మైరాడలో అటవీ కృషి నిపుణులు డా. ఖాదర్ వలి, బాలన్ తెలుగులో రైతులకు శిక్షణ ఇస్తారు. అటవీ చైతన్య ద్రావణంతో భూసారం పెంపుదల, వాన నీటి సంరక్షణ, సిరిధాన్యాలు + నూనెగింజలు + పప్పుధాన్యాల మిశ్రమ సాగు పద్ధతులు, సిరిధాన్యాల ధాన్యాన్ని మిక్సీతో బియ్యాన్ని తయారు చేసుకోవడం.. వంటి విషయాలపై రైతులకు శిక్షణ ఇస్తారు. ఫీజు తదితర వివరాలకు.. 93466 94156, 97405 31358, 99017 30600.
డిసెంబర్ 8 నుంచి పాలేకర్ 10 రోజుల సేనాపతి శిక్షణ
500 మంది తెలంగాణ రైతులకూ అవకాశం
గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ప్రకృతి వ్యవసాయంపై పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 8 నుంచి 17 వరకు సుమారు 8 వేల మంది రైతులకు సేనాపతి శిక్షణా శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఆం. ప్ర. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ శిబిరంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 500 మంది రైతులు కూడా పాల్గొనేందుకు అవకాశం ఉంది. వీరిని ఎంపిక చేసే బాధ్యతను తమకు అప్పగించినట్లు గ్రామభారతి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి సూర్యకళ తెలిపారు. పాలేకర్ స్వయంగా శిక్షణ ఇచ్చే ఈ శిబిరంలో తెలంగాణ రైతులకూ శిక్షణ, భోజనం, వసతి ఉచితం. రైతులు కప్పుకోవడానికి కంబళ్లు వెంట తెచ్చుకోవాలి. శిబిరానికి హాజరయ్యే ఉద్దేశం ఉన్న తెలంగాణ రైతులు గ్రామభారతి ప్రతినిధి ఎం. బాలస్వామిని 93981 94912, 97057 34202 నంబర్లలో సంప్రదించి ముందుగా పేర్లు, వివరాలు నమోదు చేయించుకోవాలని కోరారు.