జూన్‌ 2,3 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో డా. ఖాదర్‌ వలి సభలు | Kaadhar Wali Speeches on June | Sakshi
Sakshi News home page

జూన్‌ 2,3 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో డా. ఖాదర్‌ వలి సభలు

Published Tue, May 28 2019 3:26 PM | Last Updated on Tue, May 28 2019 3:26 PM

Kaadhar Wali Speeches on June  - Sakshi

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై జూన్‌ 2, 3 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త డా.ఖాదర్‌ వలి సభలు రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జూన్‌ 2(ఆదివారం)వ తేదీ ఉ. 9.40 గం. నుంచి మ. 12.30 గం. వరకు పద్మశాలి కళ్యాణ మండపంలో డా. ఖాదర్‌ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 99595 77280, 96767 97777. తిరుపతిలోని మహతి కళాక్షేత్రం(ప్రకాశం రోడ్‌)లో జూన్‌ 2వ (ఆదివారం) సా. 4 గం. నుంచి 7 గం. వరకు డా. ఖాదర్‌ వలి సభ జరుగుతుంది. వివరాలకు.. 99499 52020. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని వరదరాజుల స్వామి దేవాలయం ఆవరణలో జూన్‌ 3వ (సోమవారం) ఉ. 9.30 గం. నుంచి మ. 12.30 గం. వరకు డా. ఖాదర్‌ వలి సభ జరుగుతుంది. వివరాలకు: 88869 02902, 96767 97777

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement