
అటవీ వ్యవసాయ పద్ధతుల్లో కరువు కాలంలోనూ సిరిధాన్యాల సాగు చేసే పద్ధతులు, సిరిధాన్యాలు–కషాయాలతో కూడిన దేశీ ఆహారం ద్వారా ఆధునిక రోగాలన్నిటినీ పారదోలే పద్ధతులపై ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార, ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి ఈ నెల 18, 19 తేదీల్లో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సభల్లో ప్రసంగిస్తారు. 18(ఆదివారం)న ఉ. 10 గం.కు హిందూపురంలోని బెంగళూరు రోడ్డులోని రాజధాని ఫంక్షన్ హాల్‌లో డా. ఖాదర్ ప్రసంగిస్తారు. 18వ తేదీ సా. 4.30 గం. నుంచి అనంతపురంలోని రామ్‌నగర్ కమ్మ సంఘం ఆడిటోరియంలో డా. ఖాదర్ వలి సభ జరుగుతుంది. వివరాలకు.. భానుజ – 94400 17188, ఆదరణ రామకృష్ణ – 98663 45715, కుళ్లాయస్వామి– 92464 77103. 19(సోమవారం)న ఉ. 10 గం. నుంచి 1 గం. వరకు జెడ్పీ మాజీ చైర్మన్ నారాయణ ఆధ్వర్యంలో గుంతకల్లులోని శంకరానందగిరి స్వామి ఎయిడెడ్ డిగ్రీ కాలేజీ ఆవరణలో డాక్టర్ ఖాదర్ ప్రసంగిస్తారు. వివరాలకు.. నారాయణ(98480 91989). 19న సా. 4.30 గం. నుంచి 8 గం. వరకు కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కాలేజి(బి.క్యాంప్)లో డా. ఖాదర్ ప్రసంగిస్తారు. వివరాలకు.. పి. సూర్యప్రకాశ్‌రెడ్డి – 96038 34633. ప్రవేశం ఉచితం.
Comments
Please login to add a commentAdd a comment