ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకత, సేంద్రియ వ్యవసాయోత్పత్తుల విశిష్టత, సిరిధాన్య వంటకాల తయారీ– వినియోగం, ప్రయోజనాలపై రైతులను, ప్రజలను చైతన్యవంతం చేసే లక్ష్యంతో ఈ నెల 30న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని సత్యవతి మెమోరియల్ లయన్స్ కమ్యూనిటీ హాల్‌లో సదస్సు జరగనుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, పాలకొల్లు అర్బన్– రూరల్ లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో ఉ. 9 గం. నుంచి మ. 3 గం. వరకు సదస్సు జరుగుతుంది. 29న సిరిధాన్య వంటకాలపై ఆహార నిపుణులు ‘మిల్లెట్స్ రాంబాబు’ శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 98487 11445, 94401 24253
Comments
Please login to add a commentAdd a comment