పచ్చి మిరపకాయలేని కూరను ఊహించలేం కదా. పచ్చిమిర్చి అనగానే సహజంగా సుర్రున మండే కారం, కూరల్లో వాటి ప్రాధాన్యత, ఇంకాస్త ముందుకెడితే ఊరబెట్టిన మిరపకాయలు గుర్తొస్తాయి కదా. కానీ మన శరీరానికి కావాల్సిన విటమిన్లు పచ్చి మిర్చిలో పుష్కలంగా ఉంటాయి. జుట్టు అందాన్ని, చర్మమెరుపును సాధించవచ్చు. రోగ నిరోధక వ్యవస్థను పెంచే విటమిన్ సీ, చర్మ సంరక్షణకు తోడ్పడి, కంటి చూపును మెరుగు పరిచే విటమిన్ ‘ఏ’ కూడా వీటి ద్వారా లభ్యమవుతుంది తెలుసా? మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.
పచ్చిమిర్చిని శాస్త్రీయంగా క్యాప్సికమ్ ఫ్రూట్‌సెన్స్ అంటారు. మిర్చిల్లో క్యాప్సైసిన్ అనే పదార్థమే దీని రుచి కారంగా ఉండడానికి కారణం. దీన్ని ఏడాది పొడవునా సాగు చేస్తారు. దాదాపు 400 రకాల పచ్చి మిరప కాయలు వినియోగంలో ఉన్నాయట. వీటిల్లో ఒక్కొక్కటి ఒక్కో స్థాయిలో ఘాటు కలిగి ఉంటాయి.
యాంటీమైక్రోబయల్ లక్షణాలతోపాటు, పచ్చి మిరపకాయలలో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్స్, ఎసెన్షియల్ ఆయిల్స్, టానిన్లు, స్టెరాయిడ్స్ , క్యాప్సైసిన్ వంటి అనేక మొక్కల సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. పచ్చి మిరపకాయల్లో ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి పోషకాలతో పాటు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయని పరిశోధనలో తేలింది.
పచ్చి మిరపకాయల వల్ల కలిగే ప్రయోజనాలు
దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ
డయాబెటిస్‌కు రోగులకు ఉపయోగపడుతుంది.
రక్తహీనతను నయం చేయడంలో సహాయపడుతుంది
బరువు తగ్గడానికి సహాయం చేయడం
చలికాలంలో శరీర ఉష్ణోగ్రతలను బ్యాలెన్స్ చేస్తుంది
పొట్టలో అల్సర్‌లను తగ్గిస్తుంది.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ కారణంగా పచ్చిమిర్చి నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.
కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
బోలు ఎముకల వ్యాధి నివారణలో సహాయం చేస్తుంది
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది.
వీటిల్లోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడితే, విటమిన్ ఈ వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది.
జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది
శరీరంలో రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. జలుబు, దగ్గు సమస్యలకు పచ్చిమిర్చి దివ్యౌషధం.
నోట్: ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కదా అని దేన్నీ అతిగా తినడం మంచిది కాదు. శృతిమించితే ప్రయోజనాలు లభించక పోగా అనారోగ్యాన్ని చేతులారా కొని కొంటామనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment