తినే గమ్‌(గోండ్‌) గురించి తెలుసా? బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు.. | Edible Gum Or Gondh Health Benefits In Winter Season | Sakshi
Sakshi News home page

తినే గమ్‌(గోండ్‌) గురించి తెలుసా? బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు..

Published Fri, Dec 29 2023 4:31 PM | Last Updated on Sun, Dec 31 2023 11:28 AM

Edible Gum Or Gondh Health Benefits In Winter Season - Sakshi

తినదగిన గమ్‌(గోండ్‌) లేదా గోధుమ బంక శీతకాలంలో శరీరాలను వెచ్చగా ఉంచడంలో సహయపడుతుంది. జిగురులా ఉండే ఈ ప్రత్యేకమైన పదార్థంతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఏంటీ తినదగిన గమ్‌ ? ఇది ఎలా ఆరోగ్యాననికి మంచిది?

తినదగిన గమ్‌ అంటే..
తినదగిన గమ్‌(గోండ్‌) అనేది జిగురు లాంటి ఆయుర్వేద ఔషధం. ఇది స్థానికంగా గోధుమ బంక లేదా బాదాం బంక అనే పేర్లతో పిలుస్తారు. సాధారణంగా మార్కెట్లలో అయితే గోండ్ కటిరా లేదా ట్రగాకాంత్ గమ్ అనే పేర్లతో అందుబాటులో ఉంటుంది. నిజానికి గ్రీకు భాషలో ట్రాగోస్ అంటే మేక, అలాగే అకాంత అంటే కొమ్ము అని అర్థం. ఈ రెండు పదాల కలయికతో ట్రగాకాంత్ గమ్ అని పిలుస్తారు. ఇది అకాసియా చెట్ల వేర నుంచి తీసే సహజ గమ్‌(రెసిన్‌). ఇది జిగట పదార్ధం. దీని వాసన, రుచి అంటూ ఏమి ఉండదు. ఈ బంకను నీటిలో వేసినపుడు కొద్దిగా కరిగి జెల్లీలాగా మృదువుగా మారుతుంది. 

కలిగే ప్రయోజనాలు..

  • శీతాకాలంలో ఈ గోధుమ బంకను తీసుకోవడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అయ్యి వెచ్చగా ఉండేలా చేస్తుంది. అందువల్ల దీన్ని చలికాలపు ఎనర్జీ బూస్ట్‌గా పిలుస్తారు. 
  • జీర్ణక్రియకు మంచి ఔషధం.
  • దీన్ని స్వీట్లు, పానీయాలు, రుచికరమైన వంటకాలు తయారీలో కూడా ఉపయోగిస్తారు. 
  • కీళ్ల ఆరోగ్యంలో యాంటీ ఇన్‌ప్లమేటరీగా ఉపయోగపడుతుంది. అంతేగాదు ఆర్థరైటిస్‌కు సంబంధించిన సమస్యలకు చక్కటి నివారిణి ఇది. 
  • రెసిన్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడతాయి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో సహయపడుతుంది. 
  • ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లతో సహా అవసరమైన పోషకాలకు మూలం. అందువల్ల దీన్ని మంచి పోషాకాహారం కూడా తీసుకోవచ్చు. 
  • బాలింతలకు మంచి శక్తినిచ్చే ఔషధంగా చెబుతారు.
  • రక్త ప్రసరణను మెరుగపరిచి గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. 
  • శ్వాసకోశ సమస్యలకు చెక్కుపడుతుంది. పైగా దగ్గు, జలుబు సమస్యలను తగ్గించడంలో మంచి నివారిణిగా కూడా ఉంటుంది.

దీంతో చేసుకునే వంటకాలు..

  • గోండ్‌ కీ రాబ్:
  • గోంద్ లడూ:
  • గోండ్‌ డ్రై ఫ్రూట్ పరాటా
  • గోండ్ చిక్కి
  • గోండ్ కీ ఖీర్
  • గోండ్ నువ్వుల లడ్డు

(చదవండి: మహిళ చెవిలోనే గూడు కట్టేసిన సాలీడు! వేడినూనె పోయడంతో..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement