పుష్ చాపర్
మనం చేసుకునే చాలా వంటకాల్లో కూరగాయలు, ఆకుకూరల తరుగులు, తురుములనే ఎక్కువగా వాడుతుంటాం. ఇక ఉల్లిపాయ ముక్కలు లేకుండానైతే చాలామందికి వంటే పూర్తవదు. వాటన్నింటికీ ఈ పుష్ చాపర్ చక్కగా యూజ్ అవుతుంది. ఈ టూల్ కింద భాగంలో ఉన్న ట్రాన్స్‌పరెంట్ బౌల్‌లో ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇతర కూరగాయలు.. పండ్లు ఇలా అన్నింటినీ సులభంగా ముక్కలు చేసుకోవచ్చు.
మరింత చిన్నగా కచ్చాబిచ్చాగా చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఈ చాపర్ పై నుంచి ప్రెస్ చేస్తుంటే.. దీనిలోని సిమెట్రిక్ బ్లేడ్స్ ట్రాన్స్‌పరెంట్ బౌల్‌లో ఉన్న కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ముక్కలవుతాయి. అవి ఎంత మెత్తగా అవ్వాలో ఏ స్థాయిలో తురుము కావాలో చూసుకుంటూ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చాపింగ్ తర్వాత అదే బౌల్‌తో డైరెక్ట్‌గా వంటలో వేసుకోవచ్చు. అలాగే క్లీనింగ్ కూడా ఈజీగానే ఉంటుంది. ధర 25 డాలర్లు (రూ.2,081)
డంప్లింగ్ మేకర్
సాధారణంగా స్టఫ్డ్ స్నాక్స్‌కి ప్రతి ఇంటా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందులో కర్జికాయలు, డంప్లింగ్స్ వంటివి ప్రత్యేకం. కాకపోతే వాటిని చేసుకోవడమే కష్టం. అందుకు సహకరిస్తుంది ఈ డంప్లింగ్ మేకర్. ఎర్గోనామిక్స్ డిజైన్ తో ఉన్న ఈ సంప్రదాయ యంత్రం.. యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది. గోధుమ పిండి, లేదా మైదాపిండితో చపాతీ ముద్దలుగా చేసుకుని.. చిన్న చిన్న ఉండల్ని మేకర్‌కి ఎడమవైపు కన్నంలో పెట్టి.. గుండ్రటి చపాతీలా చేసుకోవచ్చు.
ఆ వెంటనే ఆ చపాతీని కుడివైపు పెట్టుకుని.. ముందుగానే సిద్ధంగా ఉంచుకున్న నచ్చిన వెజ్ లేదా నాన్ వెజ్ స్టఫ్‌ని కొద్దిగా వేసుకుని కుడి నుంచి ఎడమ వైపు మడిచి ప్రెస్ చేస్తే చాలు డంప్లింగ్ స్నాక్స్ రెడీ! వాటిని నూనెలో వేసుకుని దోరగా వేయించుకోవచ్చు. లేదా ఆవిరిపై ఉడికించుకోవచ్చు. ఇది సమయాన్ని, శ్రమను ఆదా చేస్తుంది. దీనిలో డంప్లింగ్ రేపర్లతో పాటు.. టోర్టిలా(ప్లాట్ బ్రెడ్), మినీ పిజ్జా బేస్ వంటివీ సులభంగా తయారు చేసుకోవచ్చు. ధర 4 డాలర్లు (రూ.333).
Comments
Please login to add a commentAdd a comment