Ice Apple
-
తాటి ముంజలతో లాభాలు మేటి
జ్యోతినగర్(రామగుండం): మండే వేసవిలో చల్లదనంతోపాటు సంపూర్ణారోగ్యాన్ని చేకూర్చే తాటిముంజల వ్యాపారంతో వేలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. తెలంగాణ లో తాటిముంజలు అంటే తెలియని వారుండరు.. అందుకే వీటికి ఏటా డిమాండ్ పెరుగుతూ వ స్తోంది.. దీన్ని దృష్టిలో పెట్టుకున్న చిరు వ్యా పారులు, రోజువారీ కూలీలు.. గీత కార్మికు ల నుంచి హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తూ పట్టణా లు, నగరాలకు తరలిస్తూ విక్రయిస్తున్నారు. మరికొందరు గీత కార్మికులే నేరుగా విక్రయిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏటా 46–48 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. వేడి నుంచి ఉపశమనం కోసం శ్రామికులు, కార్మికులే కాదు.. అధికారులూ తాటిముంజల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిని ఆధారం చేసుకుని పెద్దపల్లి జిల్లాలో సుమారు 100 మంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా పరిశీలిస్తే దాదాపు 500 మంది వరకు తాటిముంజలు విక్రయి స్తూ సీజనల్ ఉపాధి పొందుతు న్నారు.వైద్యులు ఏమంటున్నారంటే..» అరటిపండ్లలో మాదిరిగానే పొటాషియం ఉంటుంది» గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది» రక్తపోటును అదుపులో ఉంచుతుంది» విటమిన్ కే, సీ, బీ, జింక్, ఐరన్, కాల్షియం, పోషకాలు లభిస్తాయి » శరీరంలో ద్రవాలు పెరుగుతాయి» అధిక బరువును నియంత్రిస్తుంది» చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి, జీర్ణశక్తిని పెంచుతుందిసీజన్ వ్యాపారం బాగుందిప్రతీ సీజన్లో దొరికే మామిడి, దోసకాయలు అమ్ముత. ఈసారి కూడా పల్లెటూరులో గౌడ కులస్తుల వద్ద ముంజకాయలు కొనుగోలు చేసి ఎన్టీపీసీ తీసుకొచ్చిన. గిరాకీ బాగుంది. ఖర్చుపోనూ రోజూవారీ కూలి మంచిగనే గిట్టుబాటవుతోంది. వారం నుంచి ఈ వ్యాపారం చేస్తున్న. – బాకం మల్లేశ్, చిరు వ్యాపారి, ఎన్టీపీసీ రింగ్రోడ్డుచిన్నప్పుడు తినేవాళ్లం చిన్నప్పుడు మా ఊరిలో గౌడ్ నుంచి మా నాన్న ముంజకాయలు తీసుకొచ్చేవారు. ఇప్పుడు తిందామంటే ఊరికి వెళ్లడానికి కుదరడం లేదు. గోదావరిఖనికి వెళ్లి తాటిముంజలు కొనుగోలు చేసి తీసుకొస్తున్న. మా పిల్లలకు కూడా వీటి గురించి చెప్పి తినిపిస్తున్న. ఎండాకాలంలో మంచిది. – స్వరూప, నర్రాశాలపల్లె, ఎన్టీపీసీఅమ్మ తీసుకొచ్చింది నేను పాఠశాల నుంచి వస్తున్నప్పుడు రోడ్డు పక్కన తాటిముంజలు చూసిన. అవి కావాలని మా అమ్మకు చెప్పిన. వెంటనే వెళ్లికొని తీసుకొచ్చింది. చాలా రుచిగా ఉన్నయి. మా పాఠశాలలో కూడా వీటిగురించి చెప్పిన. ఫాస్ట్‌ఫుడ్ కన్నా ఇవి ఆరోగ్యానికి ఎంతోమంచివని మా ఉపాధ్యాయులు కూడా చెప్పారు. – నిత్యశ్రీ, విద్యార్థిని, ఎన్టీపీసీ, రామగుండంతెలంగాణలో కల్లు ఫేమస్ తెలంగాణలో తాటి, ఈతకల్లు ఫేమస్. వేరే ప్రాంతాల్లో కల్లు గీయడం, తాటి ముంజలు అమ్ముకోవడం చాలా తక్కువ. తెలంగాణలో చాలామంది గీత కార్మికులు ఉన్నారు. తెల్లకల్లు మూడు సీజన్లలో దొరుకుతుంది. వీటిని పొద్దాటి, పరుపుదాటి, పండుతాటి అని అంటారు. నీరా, అడగల్లు కూడా ఉంటుంది. – సింగం మల్లికార్జున్‌గౌడ్, మేడిపల్లిఆరోగ్యానికి మంచిది తాటిముంజలు తింటే గుండె, లివర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి వేసవిలో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. వాటిలోని పోషకాలు ఆరోగ్యానికి ఉపయోగకరం. శరీరంలో నీటి శాతం తగ్గకుండా దోహదపడుతాయి. ఎండలో బయటకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ రాజశేఖరరెడ్డి, ఫిజీషియన్, ప్రభుత్వ ఆస్పత్రి, గోదావరిఖని -
Beat the heat : తాటి ముంజెల్ని ఇలా ఎపుడైనా తిన్నారా?
సీజన్‌కు తగ్గట్టుప్రకృతి అనేక పళ్లను మానవజాతికి అందిస్తుంది ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. మరి సమ్మర్ అనగానే నోరూరించే మామిడిపళ్లతో పాటు తాటి ముంజలు గుర్తొస్తాయి. పల్లె, పట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా ముంజలు మనల్ని ఊరిస్తుంటాయి. తాటిముంజలు , నీటిముంజలు, పాల ముంజలు.. ఎలా పిలుచుకుంటేనేం, ఎండకాలంలో వీటిని ఒక్కసారైనా రుచి చూడాల్సిందే. . ‘ఐస్ ఆపిల్స్’ అంటే పిలుచుకునే వీటిల్లో పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి.శరీరాన్ని చల్లగా చేస్తాయి తాటి ముంజెలు. మండించే ఎండల్లో ఎండవేడిమిని తట్టుకునేందుకు ముంజెల్లో లభించే పుష్కలమైన నీరు ‘డీహైడ్రేషన్’కు చక్కగా పనిచేస్తాయి. తక్షణమే శక్తినిస్తాయి. తాటిముంజల్లో విటమిన్-బి, ఐరన్, క్యాల్షియం పుష్కలం. వీటిలోని నీరు అధిక బరువు సమస్యను పరిష్కరించడంలో సాయపడుతుంది. వికారం, వాంతులు వంటి లక్షణాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు తాటిముంజల్ని తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది. కొంతమందికి ఎండకాలం మొహం మీద పొక్కులు వస్తుంటాయి. ముంజల్ని కనుక తింటే, ఆ ఇబ్బంది ఉండదని నిపుణులు అంటారు.అలాగే లివర్ సమస్యలు నియంత్రణలోకి వస్తాయి. వీటిలోని పొటాషియం శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.వేసవిలో మాత్రమే దొరికే తాటి ముంజెలంటే చాలామందికి భలే ఇష్టముంటుంది. అయితే అంత మధురమైన ముంజెలను మరింత మధురంగా చేసుకోవడం ఎలా? ఈజీగా, టేస్టీగా ఇలా ట్రై చేస్తే సరి పిల్లలేంటి... పెద్దలు కూడా ఇష్టంగా లాగించేస్తారు. వంటలు కూడా చేసుకోవచ్చు. ప్రాంతాలు, పద్ధతులనుబట్టి కొందరు వీటిలో సగ్గుబియ్యం, బెల్లం వేసి వండుతారు. చూసేందుకు అచ్చం పాయసంలా కనిపిస్తూ నోరూరిస్తుందీ వంటకం. మనం ఇపుడు తాటి ముంజెల హల్వా, జ్యూస్‌ను తయారు చేసుకోవచ్చు. వాటి తయారీని చూద్దాం.తాటి ముంజెల హల్వాముందుగా చిన్నమంట మీద కళాయిలో 2 కప్పుల చిక్కటి పాలు మరిగించి, అందులో దోరగా వేయించిన ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటూ గరిటెతో ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అనంతరం దానిలో రెండు కప్పుల మెత్తటి ముంజెల గుజ్జు వేసుకుని దగ్గరపడే వరకూ తిప్పాపాలి. అభిరుచిని బట్టి కొద్దిగా ఫుడ్ కలర్, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యితో పాటు ఏలకుల పొడి, వేయించిన బాదం, జీడిపప్పు వంటివి కలిపి దగ్గరపడ్డాక ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఆ మిశ్రమం బాగా చల్లారాక ముక్కలుగా కట్ చేసుకుని ఆరగించొచ్చు.తాటి ముంజెల జ్యూస్ రెండు కప్పు ముంజెల గుజ్జు, అర కప్పు కాచిన చిక్కటి పాలు, అర కప్పు పాల పొడి, రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ లేదా విప్పింగ్ క్రీమ్, సరిపడా పంచదార కలిపి బాగా గిలకొట్టాలి. లేదా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని డీప్ ఫ్రీజర్‌లో పెట్టి, గడ్డ కట్టాక తింటే సూపర్ ఉంటుంది.ముంజెకాయల గుజ్జులో కొద్దిగా నీళ్లు, తేనె వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. వడకట్టి చల్లగా తాగాలి. ఏలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ మరింత బాగుంటుంది. -
కడుపు ఉబ్బరం, ఎసిడిటీ ఉన్నవారు లేత ముంజెలు తిన్నారంటే!
నేటి నుంచి రోహిణి కార్తె. రోళ్లు పగులుతాయని ప్రతీతి. ఇంకో రెండు వారాలు ఉగ్ర ఉష్ణాన్ని ఎదుర్కొనక తప్పదు. కాని ప్రతిదానికి ప్రకృతిలో విరుగుడు ఉంటుంది. మార్కెట్‌ను ముంజెలు ముంచెత్తుతున్నాయి. ఎండకు జవాబుగా తమను జుర్రుకోమంటున్నాయి. పెద్దవాళ్లు వీటిని మర్చిపోయారు. పిల్లలు చులకనగా చూస్తున్నారు. కాని ముంజె చేసే మేలు తల్లి కూడా చేయదు. కుటుంబాన్ని కాపాడే శక్తి దీనికి ఉంది. అంతేనా? ఈ ముంజెల చుట్టూ అందరికీ ఎన్నో జ్ఞాపకాలు. ఇప్పుడు కాదులెండి... ముప్పై నలబై ఏళ్ల కింద మంచి ఎండపూట వీధుల్లో ‘తాటి ముంజెలో తాటి ముంజెలో’ అని అరపు వినిపిస్తే వంట పనిలోనో, అన్నాలు అయ్యాక కునుకులోకి వెళ్లబోతో ఉన్న అమ్మ, నానమ్మ, ఇంటికి భోజనానికి వచ్చిన నాన్న... ‘పిలువు... పిలువు’ అని పిల్లల్ని పురమాయించేవారు. పిల్లలు పరిగెత్తుకొని బయటకు వెళితే ఎవరో ఒక గ్రామీణుడు కావడిబద్దకు చెరొకవైపు ముంజెలు కట్టిన లేత తాటాకు కట్టలతో కనిపించేవాడు. 12 తాటి ముంజెల కట్టది ఒక రేటు. 24 తాటి ముంజెల కట్టది ఒక రేటు. గీచి గీచి బేరం తెగ్గొట్టాక, ఇంట్లోకి తెచ్చి కట్ట విప్పితే అన్నీ లేతగా ఉంటే అదృష్టం. ముదురు ఎక్కువగా ఉండే నష్టం. అమ్మ తాటిముంజెల చెక్కు తీసి, స్టీలు గిన్నెలో వాటిలో నుంచి నీరు చిమ్ముతూ ఉండగా ముక్కలుగా కోసి, కొద్దిగా చెక్కెర జల్లి మూతేసి పెట్టి (ఇప్పుడు ఫ్రిజ్‌లో పెట్టి) ‘నిద్ర పోయి లేచాక తిందాం’ అని చెప్తే నిద్ర పడితే కదా. మధ్యాహ్నం కునుకు పూర్తి కాకముందే ఆ తాటి ముంజెల్ని గబగబా తింటూ ఆఖరున ఆ చక్కెర నీరు తాగుతూ ఉంటే ఎంతో హాయి మరెంతో రుచి ఇంకెంతో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయేది. పల్లెల్లో ఎక్కడ పడితే అక్కడ తాటి చెట్లు, వాటిక్కాసిన గెలలు దొరుకుతాయి. తాటిచెట్టు ఎక్కడం ఆర్ట్. రాకపోతే ఒళ్లు చెక్కుకుపోతుంది. ఎక్కగలిగినవాడు కొడవలి విసిరి గెల కిందకు తెస్తే అల్లరి పిల్లలు మూగి చెక్కిన తాటి కాయల్లో నుంచి తొంగి చూసే కన్నులను కుడివేలు బొటన వేలుతో జుర్రేసి మింగేసేవారు. ఒక్కొక్కరు ఐదు పది కాయలను కూడా జుర్రేసేవారు. ఇక ఎంత ఎండలో ఆడినా డీహైడ్రేషన్ అవడం అసాద్యం. వడదెబ్బ అసంభవం. కడుపులో చేరిన లేత నీరు అలాంటిది. పట్నాల్లో ఎడ్ల బండ్లలో తాటి గెలలు తెచ్చి రోడ్డుకు ఒకవైపున బండి ఆపి తాటికాయలను కొట్టి ఒక్కో కాయ ఇంత అని అమ్ముతూ ఉంటే పిల్లలు తెగమూగేవారు. పెద్దలు అక్కడిక్కడ తిని డిప్పల్ని పారేసేవారు. పిల్లలు ఆ ఖాళీ డిప్పల్లో కాస్త పెద్దవాటిని రెండు ఎంచుకుని ఒక పుల్లతో అనుసంధానించి తాడు కట్టి లాగుతూ తాటిబండి ఆట ఆడుకునేవారు. వేసవిని పంపిన భగవంతుడు తాటిచెట్టు చిటారుకొమ్మన తాటి గెలలను పెట్టి వాటిలో ముంజెలను పెట్టి ఆ ముంజెల్లో తియ్యటి నీరును పెట్టడమే దయకు సూచన. కరుణకు ఆనవాలు. తాటి ముంజెలు పిల్లలు, పెద్దలు, గర్భిణులు, బాలింతలు అందరూ తినొచ్చు. తినాలి. వేసవిలో ఉష్ణం వల్ల ఆమ్ల, క్షార గుణాల్లో తేడా వచ్చి శరీరంలో విషకారకాలు ఉత్పన్నం అవుతాయి. వాటిని నిర్మూలం చేయాలంటే తాటి ముంజెలకు మించినవి లేవు. శరీరంలో కోల్పోయిన నీటిని ముంజెలు సమతులం చేస్తాయి. ఒంటికి చలువనిస్తాయి. కోవిడ్ అనంతర నీరసంలాంటి సమస్యలను, అలసటను తరిమికొట్టే శక్తి ముంజెలకు ఉంది. అవి మార్కెట్లో కనపడేనన్ని రోజులు తరచూ తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి తెచ్చుకోవచ్చు. లేత తాటిముంజెల్లో ఉన్న నీరు మినరల్ వాటర్‌తో సమానం. తాటి ముంజెలు జీర్ణశక్తికి అద్భుతంగా తోడ్పడతాయి. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ ఉన్నవారు ఉదయాన్నే గ్యాస్ నిండినట్టుగా భావించేవారు లేత ముంజెలు తింటే చాలా మంచిది. గర్భిణులు తింటే తల్లికి, లోపల ఉన్న బిడ్డకు మంచిది. ఈ విషయాన్ని తమిళనాడుకు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనతో తేల్చారు. రోహిణి కార్తెలో వడదెబ్బ తగలకుండా ముంజెలు కాపాడతాయి. వికారం ఉంటే పోగొడతాయి. తట్టు, పొంగులను నివారిస్తాయి. కాలేయాన్ని ఉత్సాహపరుస్తాయి. అధిక బరువు ఉన్నవారు వీటిని ఒకపూట ఆహారంగా తీసుకుంటే (వీటితో పాటు ఒక పండు తింటే) బరువు తగ్గుతారు. సీజన్లో వచ్చే ఫలాలు ఆ సీజన్లో వచ్చే సమస్యలను దూరం చేస్తాయని అందరికీ తెలుసు. వేసవిలో వచ్చే ముంజెలు వేసవి సమస్యలకు సమాధానం చెప్తాయి. ముదురు తాటిముంజెలు తినకూడదు. పిల్లలకు పెట్టకూడదు. కడుపునొప్పి వస్తుంది. ఇప్పుడు మార్కెట్లో పాలిథిన్ కవర్లలో ముంజెలు అమ్ముతున్నారు. పిల్లలు పోజులకు పోయినా తప్పనిసరిగా తినిపించాలి. వీటిని ఇంగ్లిష్‌లో ‘ఐస్ యాపిల్స్’ అంటారని చెప్తే పేరు నచ్చయినా తింటారు. చల్లగా తినండి. ఎండను జయించండి. -
సమ్మర్ యాపిల్.. గిరాకీ సూపర్!
ప్రకాశం (కొనకనమిట్ల) : సమ్మర్ యాపిల్‌గా పేరొందిన తాటి ముంజల వ్యాపారం జిల్లాలో జోరుగా సాగుతోంది. కొనకనమిట్ల మండలం గొట్లగట్టు, హనుమంతునిపాడు, జె.పంగులూరు, కొత్తపట్నం మండలం ఈతముక్కల తదితర ప్రాంతాల్లో విస్తారంగా ఉన్న తాటి తోపులు వందలాది కుటుంబాలకు ఉపాధినిస్తున్నాయి. కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టు, బ్రాహ్మణపల్లి, నాయుడుపేట, చినమనగుండం, వింజవర్తిపాడు, దాసరపల్లి, సలనూతల, మర్రిపాలెం తదితర గ్రామాలకు చెందినవారు తాటి ముంజలు సేకరిస్తూ హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నారు. గొట్లగట్టు కేంద్రంగా సుమారు 300 కుటుంబాలు ఉపాధి పొందుతుండగా, బ్రాహ్మణపల్లి గ్రామంలో ప్రతి కుటుంబం తాటి ముంజలు సేకరించి విక్రయించడం విశేషం. ఈ గ్రామంలో 14 ఏళ్లలోపు పిల్లలు కూడా హుషారుగా తాటి చెట్లు ఎక్కి అవలీలగా కాయలు దించేయడంలో దిట్టలు. కాయల నుంచి ముంజలు తీస్తూ.. మూడు నెలలే ఉపాధి తాటి ముంజల సేకరణ చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే అలవాటైన పని కావడం, తగిన జాగ్రత్తలు తీసుకుంటుండటంతో పెద్దగా ఇబ్బందేమీ లేదని ముంజల సేకరించేవారు చెబుతున్నారు. వేసవిలో మూడు నెలలపాటు సాగే తాటి ముంజల వ్యాపారంలో ఒక్కో కుటుంబం నెలకు రమారమీ రూ.40 వేలు సంపాదిస్తోంది. తెల్లవారుజామునే తాటి తోపులకు వెళ్లి కాయలు సేకరించడం.. గ్రామాల్లో విక్రయించి సొమ్ము చేసుకోవడం ముంజల వ్యాపారుల దినచర్య. ప్రస్తుతం వీరంతా హోల్‌సేల్‌గా కాయలు విక్రయించేందుకు మొగ్గుచూపుతున్నారు. గొట్లగట్టు బస్టాండ్‌లో ముంజల వ్యాపారం కొందరు చిరు వ్యాపారులు మాత్రం ముంజలు తీసి వినియోగదారులకు అమ్ముతున్నారు. కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు, పోరుమామిళ్ల, మార్కాపురం, ఒంగోలు, కొమరోలు, గిద్దలూరు, దొనకొండ ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు గొట్లగట్టు పరిసర ప్రాంతాల్లో ముంజలు హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తున్నారు. కడప జిల్లా నుంచి 20 మంది వ్యాపారులు గొట్లగట్టు నుంచి ముంజలు తీసుకెళ్లి పోరుమామిళ్ల, బద్వేలు, మైదుకూరులో విక్రయిస్తున్నారు.కరోనా నేపథ్యంలో రెండేళ్ల నుంచి తాటి ముంజల వ్యాపారం ఆటోలు, మోటార్ సైకిళ్లపైనే సాగుతోంది. తాటి చెట్టుకు విరగకాసిన కాయలు ఉపయోగాలివే.. ► వేసవిలో ఎన్ని నీళ్లు తాగినా దాహార్తి తీరక త్వరగా అలసిపోయేవారు తాటి ముంజలు తినడం ద్వారా చలాకీగా ఉంటారు. ► ఎక్కువగా ఎండలో తిరిగేవారు డీహైడ్రేషన్‌కు గురికాకుండా ముంజలు ఎంతగానో ఉపకరిస్తాయి. ► అజీర్తి సమస్యతో బాధపడేవారు లేత ముంజలు తింటే ఎసిడిటీ దూరమవుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ► తాటిముంజల్లో ఏ, బీ, సీ విటమిన్లతో పాటు జింక్, పొటాషియం లాంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. ► ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయి. -
Summer Drinks: తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి..
Summer Drinks- Thati Munjala Smoothie: ముంజలలో ఫైటో కెమికల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్యఛాయలను త్వరగా రానివ్వకుండా నెమ్మదిపరుస్తాయి. అనారోగ్యాలను దరిచేరనియ్యవు. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి డ్రింక్‌గా పనిచేస్తుంది. శరీరానికి పోషకాలను అందించడంతోపాటు తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. మండే ఎండల్లో ముంజల స్మూతీ తాగితే వడదెబ్బకు గురికారు. చురుక్కుమనే ఎండల వల్ల చర్మం పై ఏర్పడే చెమటకాయలు, దద్దుర్లు రావు. అజీర్ణం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలో బాధపడుతున్న వారు ఈ జ్యూస్ తాగితే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసి సమస్యలన్నింటికి చక్కటి పరిష్కారం దొరుకుతుంది. పాలిచ్చే తల్లులుకు దీనిని తాగితే పుష్కలమైన పోషకాలు అందుతాయి. ఫలితంగా తల్లిపాల నాణ్యత కూడా పెరుగుతుంది. ఈ జ్యూస్‌లోని పుష్కలమైన ఖనిజ పోషకాలు, విటమిన్లు రోగనిరోధక వ్యవస్థను మరింత సమర్థవంతంగా పనిచేసేలా ప్రేరేపిస్తాయి. ముంజల స్మూతీ తయారీకి కావలసినవి తాటి ముంజలు – ఆరు, కాచిన చల్లటి చిక్కటి పాలు – రెండు కప్పులు, పంచదార – మూడు టేబుల్ స్పూన్లు, నానబెట్టిన సబ్జాగింజలు – టేబుల్ స్పూను. తయారీ: ►ముందుగా తాటిముంజలను తొక్కలు లేకుండా శుభ్రం చేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ►మిక్సీజార్‌లో పాలు, పంచదార వేసి నిమిషం పాటు గ్రైండ్ చేయాలి ►ఇప్పుడు పాలమిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకున్న తాటిముంజల మిశ్రమంలో వేసి కలపాలి. దీనిలో సబ్జాగింజలు వేసి చక్కగా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. చదవండి👉🏾 Muskmelon Mojito Health Benefits: కొవ్వులు తక్కువ.. బరువు తగ్గాలనుకునేవాళ్లకు ఇది చాలా మంచిది! Maredu Juice: మారేడు జ్యూస్ తాగుతున్నారా.. ఇందులోని టానిన్, పెక్టిన్‌ల వల్ల.. Palmyra Palm: వేసవిలో తాటి ముంజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా? -
వేసవిలో తాటి ముంజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా?
వేసవిలో మాత్రమే కనిపించే సీజనల్ ఫుడ్ తాటి ముంజలు. ఇవి చూసేందుకు చిన్నవైనా పోషకాల్లో మెండు. మండుతున్న ఎండల నుంచి ఉపశమనాన్ని కలిగించే దివ్య ఔషధం. ప్రకృతి వరప్రసాదంగా మారి ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. ఎండలు మండుతుండడంతో ప్రజలు పండ్లు, పానీయాలు సేవిస్తుంటారు. కానీ వేసవిలో మాత్రమే లభించే ముంజలు తప్పక తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వేసవిలో సాధారణంగా మామిడి, పుచ్చకాయ, జామ, ఖర్బూజా ఇలా అనేక రకాల పండ్లు, పానీయాలు తీసుకుంటుంటారు. కానీ వీటిని మించి పోషకాలు ముంజల్లో ఉంటుంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఇవి ఉంటుండడంతో వీటిని పట్టణాలకు తరలించి పలువురు ఉపాధి పొందుతున్నారు. నగరంలో వ్యాపారం గ్రామాల్లో తాటి ముంజల ఉపాధి మూడు పూలు ఆరు కాయలు అన్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన ప్రధాన రహదారుల వెంట తాటి ముంజలు కనిపించని చోటు లేదు. ఆటోల్లో నగరానికి తరలించి విక్రయిస్తున్నారు. పలువురు వ్యాపారులు నగరం నుంచి వచ్చి పల్లెల్లో గీత కార్మికుల వద్ద ముంజలు కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నారు. వీటి ధర సుమారు రూ.100 నుంచి 150 వరకు ఉంది. చాలా మంది గీత కార్మికులు, ముదిరాజ్ కులస్తులు కుటుంబ సభ్యులు నగరంలో జోరుగా వ్యాపారం సాగిస్తున్నారు. చదవండి👉🏾 Health Tips: తల దురదతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే పోషకగని తాటి ముంజల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ ఎ, బీ, సీతో పాటు ఐరన్, జింక్ , పాస్పరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలుంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకి పంపుతాయి. దీంతో శరీరం శుభ్రమవుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. తాటి ముంజలకు శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటడంతో వేసవిలో ఎంతో మేలు చేస్తాయి. ఎండ వలన కలిగ ఆలసట నీరసాన్ని దూరం చేస్తుంది. మలబద్దకం సమస్యను నివారించడంలో ముంజలు బాగా పని చేస్తాయి. వీటిని తరుచుగా తినడం వలన జీర్ణక్రీయ మెరుగుపడుతుంది. అజీర్తి, ఎసిడిటీ సమస్యలు దరిచేరవు. మొటిమలను తగ్గించడంలోను మంజలు పని చేస్తాయి. వీటిని గర్భిణులు ఆహారంగా తీసుకుంటే ఎంతో మేలు చేకూరుతుంది. -
సమ్మర్ డేస్: చలువ పందిరి జ్ఞాపకం
వేసవి ఈ కాలపు పిల్లలకు ఏం జ్ఞాపకాలు మిగులుస్తోంది? ఓటిటిలో కొత్త సినిమా... వేరే చోట ఉండే మేనత్త కొడుకుతో ఇంట్లో కూచుని ఆడే వీడియో గేమ్? ఐఐటి ఫౌండేషన్ కోర్సులో చేరిక... మహా అయితే కింద సెల్లార్లో వెహికిల్స్‌కు తగలకుండా ఆడే క్రికెట్ షాట్సు.. ఇదా వేసవి అంటే.. ఆ చలువ పందిళ్లు ఎక్కడా? ఆ తాటి ముంజలు ఎక్కడా? ఆ మల్లెజడల ఫొటోలు ఎక్కడా? ఆ తెలుగుదనపు సంపద ఎక్కడా? ఎక్కడమ్మా ఆ రోజులు. మార్చి నెల రావడంతోనే చందాలు మొదలవుతాయి బజారు వీధిలో. అంగళ్లు ఉన్నవాళ్లంతా తలా ఇంత అని ఇస్తారు. ఎవరో ఒకరు ముందుకు పడి బజారు ఉన్నంత మేరా చలువ పందిరి వేయిస్తారు. సవక కర్రలు, కొత్త తాటాకులు, వెదురు బొంగులు అన్నీ కలిసి బజారు వీధిని ఎండ తగలకుండా కప్పేస్తాయి. ఇక ఎండాకాలం అయ్యేంత వరకూ ఊరికి అదే వేదిక. మధ్యాహ్నం పన్నెండైతే చాలు రిక్షా వాళ్లొచ్చి దాని కిందే ఆగుతారు. సోడా బండ్లు దాని కిందే ఉంటాయి. చల్లమజ్జిగను కుండలో పెట్టుకుని అమ్మే ముసలాయన అక్కడే. మరి పిల్లలు? అక్కడే కాలక్షేపం. ఇంట్లో బోర్. బయట ఎండ. ఆ చలువ పందిరి కింద అటూ ఇటూ తిరుగుతూ చోద్యం చూడటమే పని. అంగళ్ల వాళ్లు చల్లగా కూచుని బేరాలు చేస్తూ లాగే రిక్షా నుంచి సరుకు దించుకుంటూ మధ్య మధ్య తాటి ముంజల గెలలు అటుగా వెళుతుంటే కొని ఇళ్లకు పంపిస్తూ కూల్‌డ్రింక్ షాపు నుంచి ఆరంజ్ క్రష్ తెప్పించుకుంటూ ఆ భోగమే వేరు. చలువ పందిరి వేసీ వేయగానే శ్రీరామ నవమి వస్తుంది. నవమి తొమ్మిది రోజులు విష్ణాలయం వారు అక్కడే ప్రోగ్రాములు పెట్టిస్తారు. నాలుగు బల్లలు వేస్తే అదే స్టేజ్. పక్కనే ఉండే సవక గుంజకు తొమ్మిది రోజుల ప్రోగ్రామ్ పోస్టరు ఉంటుంది. ఆ రోజు ప్రోగ్రామ్‌ను పలక మీద రాసి కడతారు. ‘రుక్మిణీ కల్యాణం– హరికథ– చెప్తున్నది ఫలానా ఆమె– బ్రాకెట్లో ఆకాశవాణి ఆర్టిస్టు అని ఉంటుంది. పిల్లలు దానిని నోరు తెరుచుకుని చదివి సాయంత్రం 7 నుంచి మొదలయ్యే ఆ కార్యక్రమానికి స్నానాలు చేసి తల దువ్వుకుని అమ్మ దగ్గర ఒక పావలా తీసుకొని వస్తారు. మరుసటి రోజు బుర్ర కథ ఉంటుంది. ఇంకోరోజు సత్య హరిశ్చంద్ర కాటిసీను. ఒకరోజు మిమిక్రీ, వెంట్రిలాక్విజమ్, మేజిక్ షో ఉంటాయి. చివరి రోజు పాటకచ్చేరి. దీని కోసమే జనం యుగాలుగా ఎదురు చూస్తున్నట్టుంటారు. పిల్లలు ఆ పాటకచ్చేరి స్టేజి చుట్టూ మూగి డ్రమ్స్, తబలా, గిటార్లను నోరు తెరుచుకుని చూస్తారు. ముందు వాతాపిగణ పతిం భజే పాడి ఆ తర్వాత రెండు ఘంటసాల పాటలు వేసుకుని ఆ తర్వాత ‘రాక్షసుడు’ నుంచి ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ పాడతారు. అక్కడే గుగ్గిళ్లు అమ్మేవాడు పిల్లల డబ్బులకు తగిన గుగ్గిళ్లు ఇచ్చి వెళతాడు. పీసుమిఠాయి బండి అక్కడే ఉంటుంది. రౌండ్‌గా ఉండే రేకు డబ్బాలో రోజా రంగు ఐస్‌క్రీమ్ అమ్మేవాడు కూడా అక్కడే ఉంటాడు. చిల్లర ఉన్న పిల్లలు కొనుక్కుంటారు. లేని పిల్లలకు కొనిపెడతారు. ఇంతలో ఒకడు ‘ఆకుచాటు పిందె తడిచె’ కావాల్సిందేనని పట్టుబడతారు. ఆ పాటను ప్రిపేర్ అయి రాని పాటకచ్చేరి బృందం కచ్చాపచ్చాగా పాడి ప్రమాదం నుంచి బయటపడుతుంది. చలువ పందిరి కింద మధ్యాహ్నం అయ్యాక లూజుగా పోసిన మల్లెమొగ్గలు అమ్ముతూ తిరిగేవాళ్లుంటారు. ఆడవాళ్లు రేకు డబ్బా నిండుగా రెండు రూపాయల లెక్కన కొంటారు. ఇంటికి తీసుకెళ్లి ఓపిగ్గా వాటిని కడతారు. ఆడపిల్లలకు జడ కుట్టే సీజను ఇదే. మల్లెపూలు, కనకాంబరాలు, మరువం మూడు వరుసలు చేసి మూడు రంగులతో కళకళలాడిస్తారు. కలిగిన వాళ్లు బంగారు జడబిళ్లలు పెట్టుకుంటారు. ఫొటో సమయంలో పాపిటబిళ్ల సరేసరి. లేదంటే స్టూడియోవాడు ఇస్తాడు. జడ అద్దంలో పడేలా ఒక ఫోటో దిగి అది వచ్చే వరకు ఆడపిల్లలు వెయిట్ చేస్తారు. వచ్చాక ఫ్రేమ్ కట్టించి గోడకు తగిలిస్తే ఎప్పటికీ అది అలా ఉండిపోతుంది. ఊళ్ల నుంచి బంధువుల పిల్లలు వస్తారు. గోలీలు, బొంగరాలు తెస్తారు. బజారులో దొరికే గోలీలు ఎవరి దగ్గరైనా ఉంటాయి. కాని సోడా గోలీలు ఉన్నవాళ్లు గొప్ప. నీలం రంగులో ఉండే ఆ గోలీలు భలే మెరుస్తాయి. పెద్దసైజు గోలీని డంకా అంటారు. రెండు గోలీలు గోడకు వేసి డంకాతో కొడితే ఒక గోలీ లాభం. చెట్టు కింద అరుగులు కూడా ఈ కాలంలో కళకళలాడుతాయి. వేపచెట్టు నీడలో పిల్లలు ‘సీతారాములు’ ఆట ఆడతారు. సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు పేర్లు చీటీలలో రాసి నలుగురూ నాలుగు చీటీలు ఎత్తుకొని సీత ఎవరో కనిపెట్టమంటారు. కనిపెడితే మార్కులు. ఈ కాలంలోనే పరమపద సోపానపటం ఆడతారు. ఈలోపు అమ్మ కిరిణీ పండును తొక్క తీసి ముక్కలు చేసి కాసింత చక్కెర అలంకరణగా జల్లి ఇస్తుంది. అవి తిని చేయి కడుక్కోకుండానే ఆటకు పరుగు. వేసవి వస్తే ఒక ఊరి పిల్లలు ఇంకో ఊరు చూస్తారు. కాదు.. ఒక ఊరి పిల్లలు ఇంకో ఊళ్లో ఉండే తమ వారిని చూస్తారు. వీరు తమ మనుషులు అని ఆనందిస్తారు. బంధాలను బాల్యం నుంచే పెనవేసుకుంటారు. మేనత్తకు ఒక మేనల్లుడంటే ఇష్టం. పెద్దమ్మకు ఒక చెల్లికూతురు అంటే ప్రాణం. పిన్ని ఫలానా బుజ్జిగాడి కోసం డబ్బు దాచి సినిమాకు పోరా అని ఇస్తుంది. బంధువులొస్తే కజ్జికాయలు వండుతారు. పొయ్యి దగ్గర కూచుని మాటలు మరిగిస్తారు. రాత్రిళ్లు పెరట్లో నులకమంచాలు వేసుకుని ఆకాశాన్ని చూస్తూ కథలు చెప్పుకుంటారు. నీళ్లు జల్లి డాబాల మీద పక్కలు వేస్తారు. చందమామలు చదివి తెలుగు నేరుస్తారు. బాలమిత్ర లోకంలో తమను తాము మరుస్తారు. చద్దన్నం రుచి తెలుస్తుంది. బండి వాడు అతి సన్నగా కోసిన పావలా బద్ద పుచ్చకాయను ఎంత ఆలస్యంగా తిందామనుకున్నా తొందరగానే అయిపోతుంది. స్కూల్లో చదువుకున్నది స్కూలు చదువు. వేసవిలో చదువుకునేది మరో చదువు. అలాంటి చదువు ఇప్పుడు ఉందా.. లేకపోవడం వల్ల దూరం చేస్తున్నామా... ఉండీ దూరం చేస్తున్నామా... మూలాలు ఉన్న మొక్కలు గట్టిగా ఎదుగుతాయి. వేసవిలో పడాల్సిన వేర్లు పిల్లలకు పడనివ్వండి. -
Summer Food: మామిడి, ఉల్లి, క్యారట్, నెయ్యి.. ఇవీ ఉపయోగాలు!
Summer Care- Superfoods: కాలానికి అనుగుణంగా తీసుకునే ఆహారం ఇంటిని, ఒంటినీ ఆరోగ్యంగా ఉంచుతుందనేది పెద్దల మాట. ఈ మాటను అనుసరించి వేసవిలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. మసాలాలు, వేడిచేసే ఆహార పదార్థాలనూ తీసుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వేసవిలో తేలిగ్గా జీర్ణమయ్యేవి, శరీరం నిర్జలీకరణ జరగకుండా ఉండే ఆహార పదార్థాలేమిటో తెలుసుకుందాం. వేసవిలో నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరం నిర్జలీకరణ కాకుండా ఉంటుంది. అటువంటి వాటిలో ముఖ్యమైన వాటిని చూద్దాం... పుచ్చకాయ: ఇందులో 80 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. అందువల్ల ఇది దాహాన్ని తీర్చి, డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. అందుకే వేసవి రాగానే ప్రతి ఒక్కరూ పుచ్చకాయలు తింటూ ఉంటారు. తాటిముంజలు: తాటిముంజలు తినడం వల్ల వేసవిలో దాహార్తి తీరుతుంది. చెమట కాయలు రాకుండా ఉంటాయి. మామిడి: పండ్లకు రాజయిన మామిడిలో అధిక శాతం సి విటమిన్, ఏ విటమిన్ ఉంటాయి. కాస్త ధర ఎక్కువయినా ఆల్ఫోన్సో మామిడి మరీ మంచిది. ఇందులో పీచుపదార్థాలు, రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మామిడిలో ఉండే పొటాషియం చెడుకొవ్వును తగ్గించి రక ్తప్రసరణ వేగాన్ని మెరుగుపరుస్తుంది. దానివల్ల గుండె సంబంధిత ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఉల్లి, క్యారట్: ఎండలో పడి ఇంటికి రాగానే ఉల్లిపాయ, క్యారట్, బీన్స్, వెల్లుల్లి వంటి కూరగాయలను తినాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఎండతో వచ్చే చర్మవ్యాధుల నుంచి రక్షిస్తాయి. సలాడ్స్: వేసవిలో కూరగాయలతో రకరకాల సలాడ్స్‌ను తయారు చేసుకోవచ్చు. గ్రిల్డ్ వెజిటబుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పాస్తా, నూడుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పనీర్ సలాడ్స్ వంటివి చేసుకోవచ్చు. సూప్స్: దోసకాయతో చేసిన సూప్‌ను భోజనానికి ముందుగా తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. హోల్ గ్రెయిన్ సలాడ్స్: మొక్కజొన్న, మొలకెత్తిన పెసలు, శనగలు, కూరముక్కలు.. వంటివాటిని కలిపి తీసుకుంటే మంచిది. అలాగే మొలకెత్తిన గింజలు, బీన్స్, తరిగిన కూరముక్కలు, పండ్లతో కలిపి సలాడ్‌లా తీసుకుంటే కాల్షియం, ప్రొటీన్లు వొంటికి అందుతాయి. ఇందులో తక్కువ క్యాలరీలున్న చీజ్‌ను తరిగిన కూరలతో కలపడం వల్ల కాల్షియం, ప్రొటీన్ల పరిమాణాన్ని పెంచవచ్చు. వేసవి పానీయాలు: సాధారణంగా సమ్మర్లో చాలామంది తియ్యగా, చిక్కగా ఉండే శీతల పానీయాలను, సోడాలను, ఐస్‌క్రీమ్‌లను తీసుకుంటూ ఉంటారు. వీటిలో కేలరీలు ఎక్కువ. ఎటువంటి ద్రవపదార్థాన్ని తీసుకున్నా తాత్కాలిక ఉపశమనమే.. అందువల్ల మజ్జిగ, లస్సీ వంటి వాటిని తాగాలి. ఇందులో కొవ్వు లేని పాలు శ్రేష్ఠం. ముఖ్యంగా మంచినీళ్లు, కొబ్బరినీళ్లు, పళ్ల రసాలు మంచిది. వీటన్నింటికంటే నిమ్మరసం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. పండ్లు, పండ్ల రసాలు: చిక్కగా ఉండే డెజర్ట్స్‌కు బదులుగా పండ్లతో తయారు చేసిన డెజర్ట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. పండ్లు, బెర్రీలు, పుచ్చకాయ వంటి వాటిని తీసుకోవాలి. ఆకుపచ్చని కూరలు, టొమాటోలు, బఠాణీ వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి పోషక పదార్థాలు అందుతాయి. కీరకాయను తినడం వల్ల కడుపులో చల్లగా ఉంటుంది. వేసవిలో లభించే సీజనల్ పండ్లు తప్పకుండా తినాలి. ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ సి, ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. వీటన్నింటితో పాటు అక్రోట్లను తీసుకోవాలి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. మాంసాహారులైతే చేపలను ఎక్కువగా తినడం మంచిది. ఉదయం పూట ఓట్స్ తినడం వల్ల శరీరానికి పీచు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువ గా అందుతాయి. పొట్టు తీయని పప్పు ధాన్యాలు, గింజలను తీసుకుంటే చాలామంచిది. నూనె పదార్థాలు శరీరంలోని నీటి శాతాన్ని తగ్గించేస్తాయి. అందువల్ల వేసవిలో జంక్‌ఫుడ్, వేపుళ్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో ఉండే గుమ్మడి, బంగాళాదుంప, చిలగడదుంప, బెల్‌పెపర్.. వంటివాటిలో విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నీరు: దాహాన్ని తీర్చడానికి నీటిని మించినది లేదు. ఎండలో ఇంటికి వచ్చినప్పుడు గ్లాసుడు మంచినీళ్లు తాగితే మంచిది. మంచినీళ్లు తాగితే శరీరం ఉత్తేజితమవుతుంది. డీహైడ్రేషన్‌కు దూరంగా ఉండచ్చు. వాల్ నట్స్: యాంటీ ఆక్సిడెంట్లు, నిద్రని రప్పించే ట్రిప్టోఫాన్ మూలకం వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. గింజల రాజుగా పేరొందిన వాల్ నట్లలో ఫైబర్, ఒమెగా కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. వాల్నట్లను తీసుకోవడం వల్ల మనం చెమట ద్వారానూ, వాతావరణంలోని ఇతర మార్పుల మూలంగానూ కోల్పోయే ఖనిజ లవణాలను భర్తీ చేసి, శరీరానికి తగినంత శక్తి చేకూరుతుంది. నెయ్యి: బరువు పెరుగుతున్నారని పక్కన పెడుతున్నారు కానీ, ఇందులో విటమిన్ ఏ, విటమిన్ కే2, విటమిన్ ‘ఈ’ లతోపాటూ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే లినోలిక్ ఆమ్లాలు ఉన్నాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు జీర్ణక్రియ మెరుగవుతుంది.. అలాగని అధికంగా తీసుకుంటే దాహం ఎక్కువ కావడం వంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తగిన మోతాదులో నెయ్యి తీసుకోవడం వల్ల వొంటికి తగిన మెరుపు వస్తుంది. తొందరగా అలసట కలగదు. అంజీర( అత్తి పండ్లు): ఆపిల్, ఎండుద్రాక్షల కంటే అంజీరా చాలా మెరుగైనవి. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఈ పండ్లను తినడం వల్ల మలబద్దకం దూరమవుతుంది. చర్మ సమస్యలు రావు. ముఖ్యంగా వేసవిలో బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.. వేసవిలో ఎటువంటి ఆహార పానీయాలు తీసుకోవాలి.. వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకున్నాం కదా, ఈ సీజన్లో ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యకరమైన వేసవిని ఆస్వాదించవచ్చు. చదవండి: Muskmelon Juice Health Benefits: కర్బూజా జ్యూస్.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో! -
చెమట కాయలా? ఆ నీటితో స్నానం చేశారంటే!
ఎండలు మండుతున్నాయి. దీంతో విపరీతమైన చెమట, దురదలతో చాలా ఇబ్బంది పడిపోతుంటారు. చర్మం తన మృదుత్వాన్ని కూడా కోల్పోతుంది. చెమటకాయలు దురదకు కారణమై, చికాకు, ఆయా భాగాలలో మంట, నొప్పికి దారితీస్తాయి. అతిగా చెమట పట్టే వారిలో వీటి సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా నుదుటిపై, ముఖం, మెడ, వీపు, ఛాతీ, తొడల మీద చెమట కాయలు వస్తుంటాయి. వీటి తీవ్రత ఎక్కువైతే చర్మం ఎర్రపొక్కులుగా మారటం, గోకటం వల్ల చర్మం చిట్లి రక్తం కారడం జరుగుతుంది. కొన్ని చిట్కాలతో కొంత ఉపశమనం పొందవచ్చు. అవేంటో చూద్దాం. ►రెండు పూటలా స్నానం చేస్తూ శరీరాన్ని శుభ్రంగా వుంచుకోవాలి. చెమట ఎక్కువగా పట్టినప్పుడు స్నానం చేయడం, లేదా తడి వస్త్రంతో శరీరాన్ని తుడవడం తప్పనిసరి. వదులుగా ఉండే పల్చని కాటన్ వస్త్రాలు వేసుకోవాలి. నీళ్లు బాగా తాగాలి. దాంతో శరీరం చల్లగా ఉంటుంది. వీలైనంత వరకు ఎండలోకి వెళ్లకుండా చూసుకోవాలి. ►స్నానం చేసే నీటిలో గుప్పెడు మల్లెపూలు, జాజిపూలు లేదా వట్టివేళ్ల చూర్ణం వేసి గంటసేపు నాననిచ్చి, ఆ నీటితో స్నానం చేయడం మంచిది. ఇటువంటి స్నానం శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ►వంటినిండా చెమటకాయలు వచ్చినప్పుడు గంధం ముద్దని పేలిన చోట పల్చని పూతలా వేసుకుంటే, మంట, దురద తగ్గుతాయి. ఇందులో కర్పూరాన్ని కలిపి పేలిన చోట లేపనంలా రాసినా కూడా సమస్య అదుపులోకి వస్తుంది. మార్కెట్లో లభ్యమయ్యే గంధం పొడిలో సహజత్వం ఉండదు. అందుకే గంధపు చెక్కని సానపై అరగదీసి, దాన్ని వాడటం శ్రేయస్కరం. ►చందనం పొడి, వట్టివేళ్ల పొడిని రోజ్‌వాటర్‌లో కలిపి పల్చని లేపనంలా చెమట కాయలపై రాసినా మంచిదే. కలబంద గుజ్జుని రాసుకున్నా కూడా చెమటకాయల నుంచి ఉపశమనం కలుగుతుంది. ►తాటి ముంజెలలోని నీటిని చెమట కాయలపై రాసి, ఆరిన తర్వాత శుభ్రమైన వస్త్రంతో మృదువుగా తుడిచేయాలి. పుచ్చకాయ, కర్బూజా, కీరదోస, ముంజెలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, పల్చని మజ్జిగ... వంటి చలువచేసే పదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. కారం, గరం మసాలా, నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. చదవండి: మొలకలు తింటున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు! -
Summer Tips: తాటిముంజెలు ఎక్కువగా తింటున్నారా.. ఇందులో 80 శాతానికి పైగా!
Health Benefits Of Ice Apple: తాటిచెట్లు.. గ్రామీణ ప్రాంతాల్లో ఎందరికో జీవనాధారం. తాటి ఆకులు, కొయ్యలతో నివాసాలు ఏర్పరచుకోవచ్చు. ఇక తాటి చెట్ల నుంచి వచ్చే నీరా తాగితే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని పెద్దల మాట. అంతేకాదు నీరాతో బెల్లం కూడా తయారు చేయవచ్చట. అంతేనా... ఆరోగ్య ప్రదాయిని అయిన స్వచ్ఛమైన కల్లుతో పాటు సీజనల్‌గా తాటి ముంజెలు, తాటి పండ్లు, ఆ తర్వాత తేగలు, బురుగుంజ అందిస్తాయి తాటిచెట్లు . మరి ఇప్పటికే వేసవి వచ్చేసింది. ఈ సీజన్లో దొరికే తాటి ముంజెలు(ఐస్ ఆపిల్) తినడం వల్ల కాలిగే ప్రయోజనాలు తెలుసుకుందామా! తాటి ముంజెల వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ►తాటి ముంజెలు ఎండధాటి నుంచి రక్షణ కల్పిస్తాయి. ►100గ్రాముల ముంజెల్లో 43 కేలరీలు ఉంటాయి. ►మూడు తాటి ముంజెలు తిన్నట్లయితే, ఒక కొబ్బరిబొండాన్ని తాగినంత ఫలితం ఉంటుంది. ►లేత తాటిముంజెల్లో దాదాపు ఎనభై శాతానికి పైగా నీరే ఉంటుంది. ►వీటిలో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ►బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి తాటిముంజెలు చక్కని ఫలహారం. ►ఆటలమ్మ వంటివి సోకినప్పుడు శరీరంపై ఏర్పడే పుండ్లపై తాటిముంజెల నీటిని పట్టిస్తే దురద తగ్గి, అవి త్వరలోనే మానిపోతాయి. ►కొన్ని ప్రాంతాల్లో తాటిముంజెలతో శీతలపానీయాలను కూడా తయారు చేస్తారు. తమిళనాడులో తాటిముంజెల పానీయాన్ని ‘ఎలనీర్ నుంగు’ అంటారు. చదవండి: World TB Day 2022: ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి! -
చెట్టు దిగనంటున్న 'ఐస్ ఆపిల్'
సాక్షి, అమరావతి: ఐస్ ఆపిల్‌గా పిలిచే తాటి ముంజలపై కరోనా ప్రభావం పడింది. ప్రతి ఏడూ వేసవి కాలంలో పసందు చేసే తాటి ముంజలు ఈ ఏడాది వేసవిలో అసలు కనిపించడం లేదు. ప్రస్తుతం కరోనా కాలం కావడంతో చెట్ల నుంచి కాయలు దించే వారు కరువయ్యారు. వాటిని కోసి, ముంజలు తీసి అమ్మే వాళ్లు కూడా కరోనా భయంతో బయటకు రావడం లేదు. ఒకవేళ దూరాభారం నుండి మార్కెట్‌కు తీసుకొచ్చినా ప్రస్తుతం జనసంచారం తక్కువగా ఉన్న పరిస్థితుల్లో వ్యాపారం జరుగుతుందో లేదోనని సీజనల్ వ్యాపారులు మిన్నకుంటున్నారు. ఫలితంగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే తియ్యటి తాటి ముంజలు ఈసారి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి. ఐస్ ఆపిల్ అని ఎందుకంటారంటే.. వేసవి ప్రత్యేక ఫలాల్లో ఒకటైన తాటి ముంజ పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటుంది. ముంజ లోపల తియ్యటి నీరుంటుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి, వేసవి తాపం నుండి ఉపశమనం కలిగిస్తుంది. అందుకనే దీన్ని ఐస్ యాపిల్ అంటారు. ముంజల్లో నీటి శాతం ఎక్కువ. వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు ఇవి మనకు ఉపయోగపడతాయి. ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయంటే.. తాటి ముంజల్లో క్యాలరీలు తక్కువ. పోషకాలు ఎక్కువ. ముంజలపై తెల్లగా ఉండే పై పొరతో పాటుగా తింటే శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయని డాక్టర్లు సైతం చెబుతున్నారు. వీటిలో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వడదెబ్బ తగలకుండా రక్షణనిస్తాయి. శరీరానికి కావాల్సిన ఏ, బీ, సీ విటమిన్లతోపాటు కరోనా కాలంలో విస్తృతంగా వాడుతున్న ఐరన్, జింక్, ఫాస్పరస్, క్యాన్సర్,కాలేయ సంబంధ వ్యాధుల్ని తగ్గించే పొటాషియం ముంజల్లో పుష్కలంగా లభిస్తాయి. శరీర బరువును తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఆటలమ్మ (చికెన్‌పాక్స్)తో బాధ పడేవారికి ఒంటిపైన వీటితో రుద్దితే ఉపశమనం కలుగుతుంది. -
మురిపాల ముంజలు
వేసవిలో మాత్రమే దొరికే చల్లటి పండు ముంజలు. తాటి కాయ నుంచి వచ్చే ఈ ముంజలలో ఉండే నీళ్లు కొబ్బరి నీళ్లలా తియ్యగా ఉంటాయి. వీటిని తాజాగానే తీసుకోవాలి. వేసవిలో మాత్రమే పుష్కలంగా లభించే ముంజల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముంజలను ఐస్ ఆపిల్ అంటారు. ♦ దాహార్తిని తగ్గించి, శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. ♦ ఇందులో విటమిన్ బి, ఐరన్, క్యాల్షియమ్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ♦ తాటిముంజల గుజ్జులో కొద్దిగా పాలపొడి కలిపి కాలిన గాయాలకు, మచ్చలు, దద్దుర్లు మీద పూస్తే ఉపశమనం లభిస్తుంది. ♦ ముఖానికి పూసుకుని, ఐదు నిమిషాల తరవాత కడిగేసుకుంటే, చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. ♦ వేసవిలో ముంజల ద్వారా శరీర బరువు తగ్గించుకోవచ్చు. వీటిలో నీటిశాతం అధికంగా ఉండటం వల్ల త్వరగా పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది. దాంతో తేలికగా బరువు తగ్గవచ్చు. ♦ ఎండకు వికారంగా అనిపించినప్పుడు ఒక్క ముంజ తిన్నా వెంటనే ఉపశమనం కలుగుతుంది. ♦ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎసిడిటీని నివారిస్తుంది. ♦ చికెన్‌పాక్స్ నివారించడంలో మంచి ఔషధంగా పనిచేస్తుంది. ♦ వడదెబ్బ తగలకుండా రక్షిస్తుంది ♦ గర్భిణీలు తాటిముంజలు తినడం ద్వారా మలబద్దకం సమస్య తగ్గుతుంది. ♦ తాటిముంజల పొట్టును తీసి చర్మానికి మర్దన చేయడం వల్ల చెమటకాయలు తగ్గడంతో పాటు, చర్మానికి చల్లదనం అందుతుంది. -
తాపం తీర్చే తాటి ముంజెలు
ఆరోగ్య ‘ఫలాలు’ * ఎండాకాలం అనగానే అందరికీ గుర్తొచ్చేవి - తాటి ముంజెలు. వేసవి తాపం తీర్చే ముంజెల్లో చాలా పోషకాలున్నాయి. *ముంజెల్లో 87 శాతం నీరే ఉంటుంది. మూడు తాటిముంజెలు తింటే ఒక కొబ్బరి బోండాం తాగిన ఫలితం ఉంటుంది. * 100గ్రా. ముంజెల్లో ఉండేది 43 కేలరీస్. * విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్ వంటి బి కాంప్లెక్స్, సి విటమిన్లు ఉంటాయి. * జింక్, పొటాషియం,క్యాల్షియం, ఐరన్, ఖనిజ లవణాలుంటాయి. తాటిముంజెల్లో యాంటీ ఆక్సిడెంట్లుంటాయి. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గాయాల వాపులను తగ్గిస్తాయి. * తట్టు, ఆటలమ్మ లాంటివి సోకినప్పుడు బుడిపెల మీద తాటిముంజెల నీటిని రాస్తే దురద తగ్గుతుంది, బొబ్బలు మాడిపోతాయి. * ముంజెలతో ఆకలి పెరుగుతుంది. వీటిని ఇంగ్లిష్‌లో ‘ఐస్ యాపిల్’ అంటారు.