Health Benefits Of Ice Apple: తాటిచెట్లు.. గ్రామీణ ప్రాంతాల్లో ఎందరికో జీవనాధారం. తాటి ఆకులు, కొయ్యలతో నివాసాలు ఏర్పరచుకోవచ్చు. ఇక తాటి చెట్ల నుంచి వచ్చే నీరా తాగితే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని పెద్దల మాట. అంతేకాదు నీరాతో బెల్లం కూడా తయారు చేయవచ్చట.
అంతేనా... ఆరోగ్య ప్రదాయిని అయిన స్వచ్ఛమైన కల్లుతో పాటు సీజనల్‌గా తాటి ముంజెలు, తాటి పండ్లు, ఆ తర్వాత తేగలు, బురుగుంజ అందిస్తాయి తాటిచెట్లు . మరి ఇప్పటికే వేసవి వచ్చేసింది. ఈ సీజన్‌లో దొరికే తాటి ముంజెలు(ఐస్ ఆపిల్) తినడం వల్ల కాలిగే ప్రయోజనాలు తెలుసుకుందామా!
తాటి ముంజెల వల్ల కలిగే ఆరోగ్య లాభాలు
►తాటి ముంజెలు ఎండధాటి నుంచి రక్షణ కల్పిస్తాయి.
►100గ్రాముల ముంజెల్లో 43 కేలరీలు ఉంటాయి.
►మూడు తాటి ముంజెలు తిన్నట్లయితే, ఒక కొబ్బరిబొండాన్ని తాగినంత ఫలితం ఉంటుంది.
►లేత తాటిముంజెల్లో దాదాపు ఎనభై శాతానికి పైగా నీరే ఉంటుంది.
►వీటిలో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.
►బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి తాటిముంజెలు చక్కని ఫలహారం.
►ఆటలమ్మ వంటివి సోకినప్పుడు శరీరంపై ఏర్పడే పుండ్లపై తాటిముంజెల నీటిని పట్టిస్తే దురద తగ్గి, అవి త్వరలోనే మానిపోతాయి.
►కొన్ని ప్రాంతాల్లో తాటిముంజెలతో శీతలపానీయాలను కూడా తయారు చేస్తారు. తమిళనాడులో తాటిముంజెల పానీయాన్ని ‘ఎలనీర్ నుంగు’ అంటారు.
Comments
Please login to add a commentAdd a comment