తాపం తీర్చే తాటి ముంజెలు | in summer ice apples | Sakshi
Sakshi News home page

తాపం తీర్చే తాటి ముంజెలు

Published Mon, May 26 2014 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 7:53 AM

తాపం తీర్చే తాటి ముంజెలు

తాపం తీర్చే తాటి ముంజెలు

ఆరోగ్య ‘ఫలాలు’

* ఎండాకాలం అనగానే అందరికీ గుర్తొచ్చేవి - తాటి ముంజెలు. వేసవి తాపం తీర్చే ముంజెల్లో చాలా పోషకాలున్నాయి.
*ముంజెల్లో 87 శాతం నీరే ఉంటుంది. మూడు తాటిముంజెలు తింటే ఒక కొబ్బరి బోండాం తాగిన ఫలితం ఉంటుంది.
* 100గ్రా. ముంజెల్లో ఉండేది 43 కేలరీస్.
* విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్ వంటి బి కాంప్లెక్స్, సి విటమిన్‌లు ఉంటాయి. 
* జింక్, పొటాషియం,క్యాల్షియం, ఐరన్, ఖనిజ లవణాలుంటాయి.  తాటిముంజెల్లో యాంటీ ఆక్సిడెంట్లుంటాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గాయాల వాపులను తగ్గిస్తాయి.
* తట్టు, ఆటలమ్మ లాంటివి సోకినప్పుడు బుడిపెల మీద తాటిముంజెల నీటిని రాస్తే దురద తగ్గుతుంది, బొబ్బలు మాడిపోతాయి.
* ముంజెలతో ఆకలి పెరుగుతుంది. వీటిని ఇంగ్లిష్‌లో ‘ఐస్ యాపిల్’ అంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement