వేసవిలో మాత్రమే దొరికే చల్లటి పండు ముంజలు. తాటి కాయ నుంచి వచ్చే ఈ ముంజలలో ఉండే నీళ్లు కొబ్బరి నీళ్లలా తియ్యగా ఉంటాయి. వీటిని తాజాగానే తీసుకోవాలి. వేసవిలో మాత్రమే పుష్కలంగా లభించే ముంజల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముంజలను ఐస్ ఆపిల్ అంటారు.
♦ దాహార్తిని తగ్గించి, శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది.
♦ ఇందులో విటమిన్ బి, ఐరన్, క్యాల్షియమ్ వంటివి పుష్కలంగా ఉంటాయి.
♦ తాటిముంజల గుజ్జులో కొద్దిగా పాలపొడి కలిపి కాలిన గాయాలకు, మచ్చలు, దద్దుర్లు మీద పూస్తే ఉపశమనం లభిస్తుంది.
♦ ముఖానికి పూసుకుని, ఐదు నిమిషాల తరవాత కడిగేసుకుంటే, చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.
♦ వేసవిలో ముంజల ద్వారా శరీర బరువు తగ్గించుకోవచ్చు. వీటిలో నీటిశాతం అధికంగా ఉండటం వల్ల త్వరగా పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది. దాంతో తేలికగా బరువు తగ్గవచ్చు.
♦ ఎండకు వికారంగా అనిపించినప్పుడు ఒక్క ముంజ తిన్నా వెంటనే ఉపశమనం కలుగుతుంది.
♦ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎసిడిటీని నివారిస్తుంది.
♦ చికెన్‌పాక్స్ నివారించడంలో మంచి ఔషధంగా పనిచేస్తుంది.
♦ వడదెబ్బ తగలకుండా రక్షిస్తుంది
♦ గర్భిణీలు తాటిముంజలు తినడం ద్వారా మలబద్దకం సమస్య తగ్గుతుంది.
♦ తాటిముంజల పొట్టును తీసి చర్మానికి మర్దన చేయడం వల్ల చెమటకాయలు తగ్గడంతో పాటు, చర్మానికి చల్లదనం అందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment