దాతృత్వం పేదల నుంచి సంపన్నులను ఎడంగా ఉంచుతుంది. సహాయం పేద లను సంపన్నులతో సమస్థాయికి పెంచు తుంది.
– ఇవా పెరోన్, అర్జెంటీనా దివంగత ప్రథమ మహిళ
మే 7 ఇవా పెరోన్ జయంతి. తన జన్మభూమిలోనే కాక, ప్రపంచంలో ఆకలి, పేదరికం, అనారోగ్యం మానవాళిని పట్టి పీడిస్తున్న ప్రతి మూలలోనూ ఈనాటికీ ఆమె భావాలు ఆమెను కారణజన్మురాలిని చేస్తూనే ఉన్నాయి. జీవితపు కనీసావసరాలకు పరిష్కారం చూపే నాయకులు లేనప్పుడు భారీస్థాయిలో ఆర్థిక అసమానతలు ఏర్పడతాయని నమ్మినవారు ఇవా పెరోన్.
శ్రామిక వర్గాల గౌరవాన్ని పొందిన ‘అర్జెంటీనా ఆధ్యాత్మిక నాయకురాలు’గా ఆమె ప్రసిద్ధి చెందారు. మానవీయమైన ఆర్థిక సమానత్వ సాధనకు అంకిత భావంతో పని చేసినందుకే ఆమెకు ఆ పేరు వచ్చి ఉంటుందని నా భావన. ఎందుకంటే అవసరంలో ఉన్న వారి తక్షణ కష్టాలను అర్థం చేసుకోడానికి మనలో ఆధ్యా త్మికమైన బాధ్యత ఉండాలి. అదొక రోజువారీ పనిలానో, వేష ధారణలానో ఉండకూడదు. ఇవా దీనిని అర్థం చేసుకున్నారు. ఆచరణలో పెట్టారు.
భవిష్యత్ సంరక్షణ అనే ముసుగులో నాయకులుగా చలా మణీ అవుతున్నవారు.. ఆసరాతో ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు పాటుపడుతున్న నిజమైన నాయకులపై దుష్ప్రచారానికి ఒడిగట్టడం పేదల స్థితిగతులు ఏ మాత్రం మెరుగుపడకుండా అడ్డుకుంటుంది. అర్జెంటీనా అధ్యక్షుడు జువాన్ పెరోన్ సతీమణిగా ఇవా ఆ దేశంలోని ఉన్నత వర్గాలకు ప్రభుత్వ రాయితీలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె తన సొంత ‘ఇవా ఫౌండేషన్’తో వాలంటీర్ వ్యవస్థను ఏర్పరిచారు. వ్యాపార వర్గాలు సమకూర్చిన నిధులు, నేషనల్ లాటరీ, ఇతర నిధులలో గణనీయమైన కోతలతో మిగిలిన వనరులతో అర్జెంటీనా అంతటా ఆమె ఈ వాలంటీర్ వ్యవస్థతో వేలాది ఆసుపత్రులు, పాఠశా లలు; అనాథ, వృద్ధాశ్రమాలు, స్వచ్ఛంద సంస్థలను ప్రారంభించి ప్రజాసంక్షేమానికి తోడ్పడ్డారు. ఆ దేశంలో మహిళలకు ఓటు హక్కు చట్టం రూపుదాల్చడం ఇవా కృషి ఫలితమే. 1949లో ఆమె పెరొనిస్టా ఫెమినిస్టు పార్టీని స్థాపించారు.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే – ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, సహాయ పథకాలపై వినిపిస్తున్న కొన్ని ప్రతికూల అభిప్రాయాలు నా చెవిని సోకాయి. కానీ నిశితంగా పరిశీలించిన మీదట రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల కోసం ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక తోడ్పాటు ఆదర్శవంతమైనదని నేను గ్రహించాను. ఆ సంకల్పబలం ఇవా పెరోన్‌ను తప్పక గుర్తు చేస్తుంది. రెండు ముఖ్యమైన పరిశీలనలతో నేనీ మాట అంటున్నాను. ఒకటి : ఏపీలో ప్రతి ఒక్క పేద వర్గం గత నాలుగేళ్లలో ఆర్థికంగా మెరుగు పడింది. రెండు వ్యవస్థీకృత నిర్మాణం, ప్రక్రియల ద్వారా ఆర్థిక సహాయం పంపిణీ అవుతోంది. అది కూడా చాలా గౌరవప్రదంగా, అతి తక్కువ సమస్యలతో అత్యంత ప్రభావవంతంగా!
అర్జెంటీనాలో ఇవా స్మారకస్థలి వద్ద వ్యాస రచయిత్రి
మరి అలాంటప్పుడు ఆర్థిక సహాయ పథకాలపై ఎందుకీ సణుగుడంతా?! ఎందుకంటే రాజకీయ ప్రయోజనాల కోసం విషయాన్ని వివాదాస్పదం చేయడానికే! ఎవరైనా నేలకు ఒక చెవిని ఆన్చితే రెండు స్పష్టమైన కథనాలు వినిపిస్తాయి. మొదటి కథనం.. సంతృప్తి చెందిన లబ్ధిదారుల గురించి, వారికి సరళంగా అందుతున్న సహాయం గురించి ఉంటుంది. రెండో కథనం మొదటి కథనానికి విరుద్ధంగా, నిందాపూర్వకంగా ఉంటుంది. హమీలను అమలు చేయడం కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడాన్ని ప్రత్యర్థులు ఆర్థిక వ్యవస్థకు జరుగుతున్న చేటుగా ప్రచారం చేస్తున్నారు.
ఇటాంటి ప్రచారాలు ఏదీ కూడా... నిబద్ధత కలిగి, పేదల సంక్షేమానికి కట్టుబడి నిశ్చయంతో ముందుకు సాగుతూ ఉన్న నాయకుడిని ఏమీ చేయలేవు. పూర్వం తమ పాలనలో, తమ విధానాలతో పరిశ్రమలను తెచ్చామనీ, నేటి మౌలిక సదు పాయాలన్నీ ఆనాటి తమ చొరవ వల్లే రూపుదిద్దుకున్నాయనీ, అవన్నీ దీర్ఘకాలికమైన ప్రయోజనాలిచ్చేవనీ చెప్పుకునే నాయ కులు ఇవాళ్టి గురించి పట్టించుకోరా? ఆకలితో ఉన్న పిల్లవాడికి ఆహారం ఇవ్వడానికి తల్లి ఈ రోజు పడుతున్న క్షోభను; వృద్ధులు, అశక్తులకు ఈరోజు అవసరమైన ఆసరాను, విద్యార్థి జీవితానికి విద్య ద్వారా ఈ రోజు ఏర్పరచవలసిన ధీమాను కేవలం భవిష్యత్ అవసరాల పెట్టుబడుల గురించి ఆలోచించే మనస్తత్వాలు గుర్తించలేవు. వర్తమానానికి, భవిష్యత్తుకు సమతుల్యత అవసరం. అదిప్పుడు కచ్చితంగా ఏపీలో ఉంది.
ఆర్థికాభివృద్ధి పథంలో జరుగుతున్న సహాయ పథకాలపై అబద్ధాలను ప్రచారం చేస్తూ, మంచిని తిరస్కరిస్తున్న ప్రత్యర్థి రాజ నీతిజ్ఞులు పునరాలోచన చేయాలి. ఇవా పెరోన్ మాదిరిగా ప్రపంచంలో చిరస్మరణీయం అయేందుకు నిబద్ధతతో కూడిన నిజా యితీ, పట్టుదల అవసరం. ఇవా పెరోన్ తన 33వ ఏట మరణించారు. ఆమె జీవిత కాలం బహు స్వల్పమే అయినప్పటికీ ఆమె ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిజమైన నాయకులకు ప్రేరణగా పనిచేస్తూనే ఉంటుంది.
-రాణీ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment