ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 2019లో ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టోను.. ఎన్నికల్లో గెలిచి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే మనసా వాచా ఆచరణలోకి తీసుకురావటం మొదలుపెట్టారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆడిన మాట తప్పలేదు. ఆరంభించిన ఏ పథకాన్నీ ఆపలేదు. ఫలితంగా రాష్ట్రంలో కోట్లాది మందికి నవరత్న పథకాలు అండగా నిలిచాయి. చిన్నారులు మొదలు పండు ముదుసలి వరకు అందరూ ఆనందంగా జీవించేలా వనరులు సమకూరుతున్నాయి.
కనీస అవసరాలైన కూడు, గూడు, ఆరోగ్యానికి ఢోకా లేదనే విషయం ఊరూరా కళ్లకు కడుతోంది. పేదల జీవితకాల కల అయిన ‘సొంతిల్లు’ సాకారం కావడంతో కొత్తగా ఊళ్లకు ఊళ్లే వెలుస్తుండటం కనిపిస్తోంది. అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలబడేలా చేయూత, ఆసరా అండగా నిలుస్తోంది. పేదింటి పిల్లలకు పెద్ద చదువులు.. విదేశీ విశ్వవిద్యాలయాల్లో సైతం చదివేందుకు రాచబాట సిద్ధమైపోయింది. అన్నదాతకు వ్యవసాయం పండుగగా మారింది. వెరసి నవరత్నాల వెలుగులు ప్రతి ఊళ్లోనూ ప్రసరిస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ తపన, తాపత్రయం, ఆకాంక్ష ఫలించిన తీరు లబ్ధిదారుల మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
మా బాబు మాట్లాడుతున్నాడు..
మాది నంద్యాల జిల్లాలోని దొర్నిపాడు గ్రామం. నా భర్త పేరు రామయ్య. మేము వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. మా బాబు జాన్విత్ రెండేళ్ల వయస్సులో శబ్దాలకు స్పందించే వాడు కాదు. ఎంత చప్పుడు చేసినా వాడిలో చలనం ఉండేది కాదు. మా పరిస్థితి చూసి, ఇరుగు పొరుగు వారు కూడా మాకు సాయంగా బాబును వివిధ రకాలుగా శబ్దాలు చేస్తూ పరీక్షించేవారు. అయినా అలానే ఉండిపోయేవాడు. ఒక రోజు ఆళ్లగడ్డ ఆస్పత్రిలో చూపించాము. అక్కడి వైద్యులు బాబుకు వైద్య పరీక్షలు చేశారు. వినికిడి లోపం ఉందని నిర్ధారించారు.
వినికిడి కోసం మందులు వాడుతూనే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేరి్పంచాం. అక్కడి ఉపాధ్యాయులకు జాన్విత్ పరిస్థితి గురించి వివరించాము. దీంతో వాళ్లు ప్రత్యేక శ్రద్ధతో పాఠాలు బోధించేవారు. అయినా అబ్బాయి చదువులో వెనుకబడ్డాడు. బాబు భవిష్యత్తు ఏమిటా అని దిగులు పడేవాళ్లం. మా అదృష్టం కొద్ది మా ఊరిలో ఒక స్వచ్ఛంద సంస్థ ఉచిత వైద్య శిబిరం పెట్టింది. అక్కడికి అబ్బాయిని తీసుకువెళ్లాం. పరీక్షించిన ఒక ప్రభుత్వ వైద్యుడు.. బాబుకు సరైన చికిత్స అందించి ఆపరేషన్ చేస్తే వినడంతో పాటు మాట్లాడే అవకాశం ఉందన్నారు.
ఆ వైద్యుడి మాటలు మాలో ఆశలు రేపాయి. ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్ కూడా ఉచితంగా చేస్తారని సలహా ఇచ్చారు. దీంతో ఒక రోజు నంద్యాల పట్టణంలో మధుమణి ఆస్పత్రిలో సంప్రదించాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.12 లక్షల ఖర్చు అయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ ఉచితంగా చేశారు. బాబుకు ఇప్పుడు వినిపిస్తోంది. ఆడియో థెరపీ ద్వారా మాటలు వచ్చేందుకు వైద్యులు కృషి చేశారు. మాటలూ వచ్చాయి. జాన్విత్‌కు ఇప్పుడు తొమ్మిదేళ్లు. నాలుగో తరగతి చదువుతున్నాడు. బడిలో పాఠాలు వీడియో క్లాసెస్ ద్వారా బోధిస్తుండడంతో ఇంతకు ముందు కంటే బాగా అర్థం అవుతున్నాయని చెబుతున్నాడు. ఇపుడు బాబు భవిష్యత్తు గురించి మాకు ఎటువంటి బెంగ లేదు. – రాయపాటి పద్మ, దొర్నిపాడు, నంద్యాల జిల్లా ,(ఎం.హరిహరసాగర్, విలేకరి, నంద్యాల టౌన్)
నా ఆ్రస్టేలియా కల సాకారం
మాది శ్రీకాకుళం జిల్లా పొందూరు గ్రామం. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనేది నా కోరిక. భవిష్యత్‌లో ఉన్నతంగా ఎదగాలని, తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలని, మంచిగా స్థిరపడాలనేది నా ధ్యేయం. నేను పదో తరగతి వరకు పొందూరులోని ప్రైవేటు పాఠశాలలో, ఇంటర్, డిగ్రీ విశాఖలో చదివాను. కరోనా సమయంలో విదేశాల్లో చదివేందుకు అవసరమైన సబ్జెక్టుల్లో ఇంటి వద్దే ప్రిపేర్ అయ్యాను.
విదేశాల్లో ఉన్న ఉత్తమ కోర్సులు చదివేందుకు అవసరమైన పరీక్షలు పాసయ్యాను. నేను ఎంచుకున్నట్టే ఆ్రస్టేలియాలో మోనష్ యూనివర్సిటీలో సీటు వచి్చంది. సుమారు రూ.60 లక్షల ఫీజులో 8 లక్షలు తగ్గించారు. మిగిలిన రూ.52 లక్షలు ఎలా చెల్లించాలో తెలియక అయోమయంలో పడిపోయాను. ఆ డబ్బు సమకూర్చాలని నాన్నకు చెప్పలేకపోయాను. ఆ్రస్టేలియాలో చదివించే స్థోమత నాన్నకు లేదు. మా నాన్న గురుగుబెల్లి శ్యామలరావు పొందూరులోని వైఎస్సార్ క్రాంతి పథంలో ఎంఎస్‌సీసీగా పనిచేస్తున్నారు. ఆయనకు వచ్చే జీతం కుటుంబం గడిచేందుకు మాత్రమే సరిపోతుంది. దీంతో దిక్కు తోచలేదు. సీఎం ఆదుకుంటారనే నమ్మకంతో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాను.
జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద రూ.51,92,106 మంజూరు చేశారు. దీంతో నా గోల్ రీచ్ అవుతానన్న నమ్మకం ఏర్పడింది. 2023 జూలై 10న ఆ్రస్టేలియా వెళ్లాను. జగనన్న మంచి మనసు వల్ల నేను ఇవాళ ఆ్రస్టేలియాలోని మోనష్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ డేటా సైన్స్ చదువుతున్నాను. మొదటి సెమిస్టర్ పూర్తయ్యింది. – గురుగుబెల్లి వంశీ, మోనిష్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియా (పాయక మధుసూదనరావు, విలేకరి, పొందూరు)
ఇప్పుడు అప్పుల తిప్పల్లేవు
మాది కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పెండేకల్ గ్రామం. ఎనిమిది ఎకరాల భూమి ఉంది. ఏటా పంట పెట్టుబడి కోసం మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. అప్పుల కోసం కాళ్లరిగేలా తిరిగేవాళ్లం. ఒక్కోసారి అప్పు పుట్టేది కాదు. ఈ పరిస్థితుల్లో ఇటు వ్యవసాయం వదులుకోలేక అటు పెట్టుబడులు పెట్టుకోలేక మానసికంగా కుంగిపోయేవాళ్లం. అప్పు చేసి, పెట్టుబడులు పెట్టినా పంట చేతికందుతుందన్న గ్యారెంటీ లేదు. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఇక అంతేసంగతులు. తుపానులు వచి్చనా, వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా పెట్టుబడులు, శ్రమ మట్టిలో కలిసిపోయేవి.
అప్పులకు వడ్డీలు పెరిగిపోయేవి. అప్పు తీర్చలేక వడ్డీ వ్యాపారుల వద్ద మాట పడేవాళ్లం. మళ్లీ ఆ పొలాన్ని పంటసాగు చేసే స్థితికి తీసుకురావాలంటే, అదనపు పెట్టుబడులు పెట్టాల్సి వచ్చేది. పరిస్థితి పుండు మీద కారం చల్లినట్టు తయారయ్యేది. కళ్లలోంచి నీరు వచ్చేది. మా బాధ ఆ దేవుడికే తెలుసు. సీఎం వైఎస్ జగన్ పుణ్యాన ఇప్పడు ఆ బాధ తప్పింది. ఊర్లో అప్పులు తీర్చలేదన్న అవమానాలు లేవు. గొప్ప రైతుగా తలెత్తుకొని జీవిస్తున్నాను. ఖరీఫ్, రబీ సాగు మొదలెట్టే సమయానికి వైఎస్సార్ రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందుతోంది.
ఇప్పుడు ఎంతో ఆనందంతో ఆముదం, కంది, సజ్జ వంటి పంటలు సాగు చేస్తున్నాము. గతంలో బ్యాంకులు కూడా పంట రుణాలు సకాలంలో ఇచ్చేవి కావు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ప్రభుత్వం ఏటా ఇచ్చే రూ.13,500 పెట్టుబడులకు బాగా ఉపయోగపడుతున్నాయి. వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా కింద కూడా పరిహారం లభిస్తోంది. నాలుగేళ్లుగా అప్పుల బాధలే లేవు. పైగా రైతు భరోసా కేంద్రాల వల్ల ఎప్పటికప్పుడు విలువైన సలహాలు, సూచనలు అందుతున్నాయి. – వన్నూరప్ప, పెండేకల్, కర్నూలు జిల్లా (గవిని శ్రీనివాసులు, విలేకరి, కర్నూలు అగ్రికల్చర్)
Comments
Please login to add a commentAdd a comment