Navratnas
-
మరో నాలుగు సంస్థలకు నవరత్న హోదా
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం మరో నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న హోదా ప్రకటించింది. ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థలైన నేషనల్ హైడ్రాలిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ), ఎస్‌జేవీఎన్ (సట్లజ్ జల విద్యుత్ నిగమ్)లకు నవరత్న హోదా దక్కింది. అలాగే, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈసీఐ), రైల్‌టెల్‌కు సైతం నవరత్న హోదా లభించింది.‘‘ప్రభుత్వరంగ సంస్థల విభాగం ఆగస్ట్ 30న ఎన్‌హెచ్‌పీసీని నవరత్న కంపెనీగా ప్రకటించింది. ఇది నిర్వహణ, ఆర్థిక పరంగా స్వయంప్రతిపత్తిని తీసుకొస్తుంది’’అని ఎన్‌హెచ్‌పీసీ తెలిపింది. కంపెనీకి ఇది చరిత్రాత్మకమని ఎన్‌హెచ్‌పీసీ సీఎండీ ఆర్కే చౌదరి అభివర్ణించారు.కంపెనీ ఆర్థిక, నిర్వహణ సామర్థ్యాలకు గుర్తింపు అని పేర్కొన్నారు. ఈ హోదాతో వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఇప్పటి వరకు ఎన్‌హెచ్‌పీసీ మినీరత్న కేటగిరీ–1 కంపెనీగా ఉంది. ఎస్‌జేవీఎన్ సైతం మినీతర్న కేటగిరీ –1గా ఉండడం గమనార్హం. -
ఇవిగో నవరత్నాల వెలుగులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఆర్థికంగా నిలదొక్కుకున్నాం మాది పేద కుటుంబం. మాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భర్త గిన్ని దేముడు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశాం. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. నా కుమారుడు కూడా కూలి పనులకు వెళ్తున్నాడు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్లం. నేను విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం గిన్నివానిపాలెంలో ఇంటి వద్ద చిన్న టిఫిన్ దుకాణం పెట్టాను. పెట్టుబడికి డబ్బులు లేకపోవడంతో వ్యాపారం అంతంత మాత్రంగానే ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక జగనన్న చేదోడు పథకం కింద మూడేళ్లలో రూ.30 వేలు సాయం అందింది. ఆ డబ్బులు వ్యాపారంలో పెట్టాం. వ్యాపారాన్ని అభివృద్ధి చేశాం. అప్పులు తీర్చుకుంటున్నాం. ఆర్థికంగా నిలబడ్డాం. నా భర్తకు 60 ఏళ్లు నిండడంతో ఏడాది నుంచి వృద్ధాప్య పెన్షన్ వస్తోంది. నా కుమారుడి కుమార్తెకు అమ్మఒడి కింద ఏటా రూ.15 వేలు వస్తోంది. ఈ ప్రభుత్వం మా కుటుంబంలో వెలుగులు నింపింది. – గిన్ని రమణమ్మ, గిన్నివానిపాలెం (ముప్పిడి శ్రీనివాసరావు, విలేకరి, పెదగంట్యాడ, విశాఖపట్నం) వృద్ధాప్యంలో కొడుకులా ఆదుకున్నారు.. నేను లైట్లు, లాంతర్లు, బిందెలు, సిల్వర్ గిన్నెలకు మాట్లు వేస్తూ జీవనం సాగిస్తుంటాను. నేడు గ్యాస్ పొయ్యిలు, స్టీల్ గిన్నెలు వచ్చిన తర్వాత మాకు పని లేకుండా పోయింది. మాకు ఐదుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసేసరికి ఓపిక నశించింది. నేను, నా భార్య మాత్రమే మిగిలాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని 17వ వార్డు పరిధిలో ఉంటున్నాం. జీవనం సాగించడానికి పనులు లేక చాలా ఇబ్బంది పడేవాళ్లం. ఈ తరుణంలో నాకు పింఛన్ మంజూరైంది. నా భార్యకు వైఎస్సార్ చేయూత కింద ఇప్పటి వరకు రూ.56,250, వైఎస్సార్ ఆసరా పథకం కింద ఇప్పటి వరకు రూ.10,500 వచ్చింది. ప్రభుత్వం అందిస్తున్న పింఛను, నవరత్నాల పథకాలతో ప్రస్తుతం ఏ లోటూ లేకుండా మా జీవనం సాగుతోంది. రేషన్ కార్డుపై బియ్యం, కందిపప్పు వంటివి అందిస్తున్నారు. ఈ వయసులోనూ పిల్లలపై ఆధార పడకుండా నా కాళ్లపై నేను నిలబడ్డాననే ఆత్మ సంతప్తి కలుగుతోంది. జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరైంది. త్వరలో ఇంటి నిర్మాణం చేపడతాం. ఈ వృద్ధాప్యంలో కొడుకులా సీఎం జగన్ గారు మమ్మల్ని ఆదుకున్నారు. – కంచు సత్యనారాయణ, పాలకొల్లు (తోట రాంబాబు, విలేకరి, పాలకొల్లు సెంట్రల్) ఉచితంగానే ఖరీదైన వైద్యం నేను దుబాయిలో ప్రైవేటు కంపెనీలో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. చిన్నప్పుడే నా బిడ్డలు కందుల సౌమ్య, స్టీఫెన్ ఇద్దరూ తలసేమియా వ్యాధిబారిన పడ్డారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం చినమనగుండంలో అమ్మాయి సౌమ్య ఇంటర్, అబ్బాయి స్టీఫెన్ ఐదో తరగతి చదువున్నారు. వారికి ప్రతినెలా రక్తమార్పిడి, వైద్యం కోసం రూ.35 వేలు వరకు ఖర్చయ్యేది. వారికి వైద్యం చేయించేందుకు డబ్బులు లేక నానా ఇబ్బందులు పడ్డాను. గత ప్రభుత్వంలో ఎలాంటి సహకారం అందలేదు. వైఎస్ జగన్అధికారంలోకి రాగానే నా బిడ్డల లాంటి వారికి ప్రతినెలా రూ.10 వేలు ఇచ్చి ఆదుకుంటానని మాటిచ్చారు. అన్నట్లుగానే ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.20 వేలు పింఛన్ మంజూరు చేశారు. ప్రతి నెలా నా బిడ్డలిద్దరికీ చికిత్స చేయిస్తున్నాను. ఇటీవల కుమారుడు స్టీఫెన్‌కు ఆపరేషన్ చేయించాను. కుమార్తె సౌమ్యకు ఆపరేషన్ అవసరమని, భారీగా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. ఇటీవల మా ఇంటి వద్దకు వచ్చిన ఎమ్మెల్యే కె.పి.నాగార్జునరెడ్డికి మా సమస్య వివరించాం. తప్పకుండా ప్రభుత్వం నుంచి సహకారం అందేలా కృషి చేస్తానన్నారు. –కందుల నయోమయ్య, చినమనగుండం (నాగం వెంకటేశ్వర్లు, విలేకరి, కొనకనమిట్ల, ప్రకాశం జిల్లా) -
జగనన్న కాలనీలకు స్వాగత ద్వారాలు
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద నిరుపేదలకు ప్రభుత్వం గృహ యోగం కల్పిస్తోంది. జగనన్న కాలనీల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి గేటెడ్ కమ్యూనిటీల రీతిలో తీర్చిదిద్దుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ. 75 వేల కోట్ల విలువ చేసే స్థలాలను 30.7 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది. అంతేకాకుండా ఇంటి నిర్మాణానికి రూ. 2.70 లక్షల ఆర్థికసాయం అందజేస్తోంది. 17,005 వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్తగా ఊళ్లనే నిర్మిస్తోంది. కాలనీల్లో మౌలిక వసతులను కల్పించి గేటెడ్ కమ్యూనిటీల్లా రూపొందిస్తోంది. ఇందులో భాగంగా 25 అంతకంటే ఎక్కువ ఇళ్లు ఉన్న కాలనీలకు స్వాగత ద్వారాలు నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 5,684 ఆర్చిల నిర్మాణానికి శ్రీకారం 21.75 లక్షల (19.13 లక్షల సాధారణ+2.62 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. సాధారణ ఇళ్లు నిర్మిస్తున్న 5,684 కాలనీలకు ఆర్చ్‌లు నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసింది. ఇప్పటికే ఈ పనుల కోసం 2,314 ప్రాంతాల్లో టెండర్లను ఖరారు చేయగా వీటిలో 594 కాలనీల్లో పనులు ప్రారంభించారు. పలు కాలనీల్లో వీటి నిర్మాణాలు సైతం పూర్తయ్యాయి. ఖరీదైన ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రూ. 32,909 కోట్లతో కాలనీల్లో రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్, నీటి సరఫరా తదితర సౌకర్యాలను కల్పిస్తోంది. -
వచ్చే బడ్జెట్‌కు ప్రతిపాదనలు పంపండి
సాక్షి, అమరావతి: నవరత్న పథకాలతోపాటు కేంద్ర పథకాలకు సంబంధించి 2024–25 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను ఈ నెల 14లోగా ఆన్లైన్లో పంపాలని ఆర్థిక శాఖ సూచించింది. మహిళలు, బాలికలకు ప్రత్యేకం గాజెండర్ బడ్జెట్‌కు ప్రతిపాదనలను సమర్పించాలని కోరింది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్టల సంక్షేమానికి ఉప ప్రణాళికలను ప్రతిపాదించాల్సిందిగా ఆయా శాఖలను ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిందని పేర్కొన్నారు. ప్రధానంగా రహదారులు, గృహాలు, తాగునీరు, విద్య, ఆరోగ్యం వంటి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వీటితోపాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పారిశ్రామికీకరణ లక్ష్యాలను సాధించేలా మూలధన వ్యయ ప్రతిపాదనలు పంపాల్సిందిగా సూచించారు. ఈ ప్రతిపాదనలు తప్పనిసరిగా మిషన్ లక్ష్యాల ఆధారంగా ఉండాలని స్పష్టం చేశారు. మంజూరు చేసిన పనుల వివరాలపైనే బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలన్నారు. ఆన్లైన్లో అప్లోడ్ చేయని పనుల కోసం ఎటువంటి బడ్జెట్ ప్రతిపాదనలు చేయరాదని సూచించారు. అలాంటి పనులకు బిల్లులను కూడా అంగీకరించబోమని పేర్కొన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లేని పనుల ప్రతిపాదనలను కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయరాదన్నారు. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరుల సమర్థ వినియోగం ద్వారా ఫలితాలు సాధించేలా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని సూచించారు. ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవి.. ♦ ప్రస్తుత పథకాలను సమీక్షించి.. ఆ పథకాలకు వ్యయం ఎంత అవుతోంది? ఆ మేరకు ఫలితాలు, ప్రయోజనాలు వస్తున్నాయా లేదా పరిశీలించాలి. ప్రయోజనం లేని పథకాలను ఆర్ధిక శాఖతో సంప్రదించి నిలిపివేయాలి. ఇలా ఆదా అయిన సొమ్ముతో కొత్త పథకాలను రూపొందించాలి. ♦ అన్ని శాఖాధిపతుల వేతనాలేతర వస్తువులు, ఇతర వ్యయాలను సమీక్షించి 20 శాతం మేర పొదుపును ప్రతిపాదించాలి. ♦ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ల ఉప ప్రణాళికలకు ప్రత్యేక ప్రతిపాదనలు సమర్పించాలి. ప్రస్తుత ప్రతిపాదనలను సమీక్షించి, మార్పులు అవసరం ఉంటే చేయాలి. ♦అన్ని శాఖలు వాస్తవికంగా అంచనాలు వేసి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించాలి. తప్పనిసరి వ్యయాలైన సబ్సిడీలు, సామాజిక భద్రత పెన్షన్లు మొదలైన వాటికి లబ్ధిదారుల సంఖ్య ఆ«దారంగా తగిన నిధులను ప్రతిపాదించాలి. కన్సల్టెంట్స్, ఔట్సోర్సింగ్, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా ఎలాంటి ప్రతిపాదనలు చేయకూడదు. ♦ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అంచనాలను అత్యంత జాగ్రత్తతో రూపొందించాలి. అంచనాలు, వాస్తవాల మధ్య భారీ వ్యత్యాసాలను నివారించాలి. ప్రస్తుత పన్ను రేట్లు ఆధారంగానే రెవెన్యూ రాబడుల అంచనాలను ప్రతిపాదించాలి. వీలైనంత మేర ఆదాయ వనరుల ఆర్జనపై శాఖలు దృష్టి పెట్టాలి. అందుకు అనుగుణంగా ఆదాయ వనరుల అంచనాలను పంపాలి. ♦ సవరించిన అంచనాలు వాస్తవిక దృక్పథంతో ఉండాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8 నెలల వ్యయ పురోగతి, మిగిలిన నెలల్లో ఖర్చయ్యే అవకాశం ఆధారంగా సప్లిమెంటరీ గ్రాంట్లు కోసం అదనపు నిధులకు ప్రతిపాదనలు చేయాలి. -
ఇవిగో నవరత్నాల వెలుగులు
ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టోను.. ఎన్నికల్లో గెలిచి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే మనసా వాచా ఆచరణలోకి తీసుకురావటం మొదలుపెట్టారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆడిన మాట తప్పలేదు. ఆరంభించిన ఏ పథకాన్నీ ఆపలేదు. ఫలితంగా రాష్ట్రంలో కోట్లాది మందికి నవరత్న పథకాలు అండగా నిలిచాయి. చిన్నారులు మొదలు పండు ముదుసలి వరకు అందరూ ఆనందంగా జీవించేలా వనరులు సమకూరుతున్నాయి. కనీస అవసరాలైన కూడు, గూడు, ఆరోగ్యానికి ఢోకా లేదనే విషయం ఊరూరా కళ్లకు కడుతోంది. పేదల జీవితకాల కల అయిన ‘సొంతిల్లు’ సాకారం కావడంతో కొత్తగా ఊళ్లకు ఊళ్లే వెలుస్తుండటం కనిపిస్తోంది. అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలబడేలా చేయూత, ఆసరా అండగా నిలుస్తోంది. పేదింటి పిల్లలకు పెద్ద చదువులు.. విదేశీ విశ్వవిద్యాలయాల్లో సైతం చదివేందుకు రాచబాట సిద్ధమైపోయింది. అన్నదాతకు వ్యవసాయం పండుగగా మారింది. వెరసి నవరత్నాల వెలుగులు ప్రతి ఊళ్లోనూ ప్రసరిస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ తపన, తాపత్రయం, ఆకాంక్ష ఫలించిన తీరు లబ్ధిదారుల మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మా బాబు మాట్లాడుతున్నాడు.. మాది నంద్యాల జిల్లాలోని దొర్నిపాడు గ్రామం. నా భర్త పేరు రామయ్య. మేము వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. మా బాబు జాన్విత్ రెండేళ్ల వయస్సులో శబ్దాలకు స్పందించే వాడు కాదు. ఎంత చప్పుడు చేసినా వాడిలో చలనం ఉండేది కాదు. మా పరిస్థితి చూసి, ఇరుగు పొరుగు వారు కూడా మాకు సాయంగా బాబును వివిధ రకాలుగా శబ్దాలు చేస్తూ పరీక్షించేవారు. అయినా అలానే ఉండిపోయేవాడు. ఒక రోజు ఆళ్లగడ్డ ఆస్పత్రిలో చూపించాము. అక్కడి వైద్యులు బాబుకు వైద్య పరీక్షలు చేశారు. వినికిడి లోపం ఉందని నిర్ధారించారు. వినికిడి కోసం మందులు వాడుతూనే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేరి్పంచాం. అక్కడి ఉపాధ్యాయులకు జాన్విత్ పరిస్థితి గురించి వివరించాము. దీంతో వాళ్లు ప్రత్యేక శ్రద్ధతో పాఠాలు బోధించేవారు. అయినా అబ్బాయి చదువులో వెనుకబడ్డాడు. బాబు భవిష్యత్తు ఏమిటా అని దిగులు పడేవాళ్లం. మా అదృష్టం కొద్ది మా ఊరిలో ఒక స్వచ్ఛంద సంస్థ ఉచిత వైద్య శిబిరం పెట్టింది. అక్కడికి అబ్బాయిని తీసుకువెళ్లాం. పరీక్షించిన ఒక ప్రభుత్వ వైద్యుడు.. బాబుకు సరైన చికిత్స అందించి ఆపరేషన్ చేస్తే వినడంతో పాటు మాట్లాడే అవకాశం ఉందన్నారు. ఆ వైద్యుడి మాటలు మాలో ఆశలు రేపాయి. ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్ కూడా ఉచితంగా చేస్తారని సలహా ఇచ్చారు. దీంతో ఒక రోజు నంద్యాల పట్టణంలో మధుమణి ఆస్పత్రిలో సంప్రదించాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.12 లక్షల ఖర్చు అయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ ఉచితంగా చేశారు. బాబుకు ఇప్పుడు వినిపిస్తోంది. ఆడియో థెరపీ ద్వారా మాటలు వచ్చేందుకు వైద్యులు కృషి చేశారు. మాటలూ వచ్చాయి. జాన్విత్కు ఇప్పుడు తొమ్మిదేళ్లు. నాలుగో తరగతి చదువుతున్నాడు. బడిలో పాఠాలు వీడియో క్లాసెస్ ద్వారా బోధిస్తుండడంతో ఇంతకు ముందు కంటే బాగా అర్థం అవుతున్నాయని చెబుతున్నాడు. ఇపుడు బాబు భవిష్యత్తు గురించి మాకు ఎటువంటి బెంగ లేదు. – రాయపాటి పద్మ, దొర్నిపాడు, నంద్యాల జిల్లా ,(ఎం.హరిహరసాగర్, విలేకరి, నంద్యాల టౌన్) నా ఆ్రస్టేలియా కల సాకారం మాది శ్రీకాకుళం జిల్లా పొందూరు గ్రామం. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనేది నా కోరిక. భవిష్యత్‌లో ఉన్నతంగా ఎదగాలని, తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలని, మంచిగా స్థిరపడాలనేది నా ధ్యేయం. నేను పదో తరగతి వరకు పొందూరులోని ప్రైవేటు పాఠశాలలో, ఇంటర్, డిగ్రీ విశాఖలో చదివాను. కరోనా సమయంలో విదేశాల్లో చదివేందుకు అవసరమైన సబ్జెక్టుల్లో ఇంటి వద్దే ప్రిపేర్ అయ్యాను. విదేశాల్లో ఉన్న ఉత్తమ కోర్సులు చదివేందుకు అవసరమైన పరీక్షలు పాసయ్యాను. నేను ఎంచుకున్నట్టే ఆ్రస్టేలియాలో మోనష్ యూనివర్సిటీలో సీటు వచి్చంది. సుమారు రూ.60 లక్షల ఫీజులో 8 లక్షలు తగ్గించారు. మిగిలిన రూ.52 లక్షలు ఎలా చెల్లించాలో తెలియక అయోమయంలో పడిపోయాను. ఆ డబ్బు సమకూర్చాలని నాన్నకు చెప్పలేకపోయాను. ఆ్రస్టేలియాలో చదివించే స్థోమత నాన్నకు లేదు. మా నాన్న గురుగుబెల్లి శ్యామలరావు పొందూరులోని వైఎస్సార్ క్రాంతి పథంలో ఎంఎస్సీసీగా పనిచేస్తున్నారు. ఆయనకు వచ్చే జీతం కుటుంబం గడిచేందుకు మాత్రమే సరిపోతుంది. దీంతో దిక్కు తోచలేదు. సీఎం ఆదుకుంటారనే నమ్మకంతో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాను. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద రూ.51,92,106 మంజూరు చేశారు. దీంతో నా గోల్ రీచ్ అవుతానన్న నమ్మకం ఏర్పడింది. 2023 జూలై 10న ఆ్రస్టేలియా వెళ్లాను. జగనన్న మంచి మనసు వల్ల నేను ఇవాళ ఆ్రస్టేలియాలోని మోనష్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ డేటా సైన్స్ చదువుతున్నాను. మొదటి సెమిస్టర్ పూర్తయ్యింది. – గురుగుబెల్లి వంశీ, మోనిష్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియా (పాయక మధుసూదనరావు, విలేకరి, పొందూరు) ఇప్పుడు అప్పుల తిప్పల్లేవు మాది కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పెండేకల్ గ్రామం. ఎనిమిది ఎకరాల భూమి ఉంది. ఏటా పంట పెట్టుబడి కోసం మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. అప్పుల కోసం కాళ్లరిగేలా తిరిగేవాళ్లం. ఒక్కోసారి అప్పు పుట్టేది కాదు. ఈ పరిస్థితుల్లో ఇటు వ్యవసాయం వదులుకోలేక అటు పెట్టుబడులు పెట్టుకోలేక మానసికంగా కుంగిపోయేవాళ్లం. అప్పు చేసి, పెట్టుబడులు పెట్టినా పంట చేతికందుతుందన్న గ్యారెంటీ లేదు. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఇక అంతేసంగతులు. తుపానులు వచి్చనా, వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా పెట్టుబడులు, శ్రమ మట్టిలో కలిసిపోయేవి. అప్పులకు వడ్డీలు పెరిగిపోయేవి. అప్పు తీర్చలేక వడ్డీ వ్యాపారుల వద్ద మాట పడేవాళ్లం. మళ్లీ ఆ పొలాన్ని పంటసాగు చేసే స్థితికి తీసుకురావాలంటే, అదనపు పెట్టుబడులు పెట్టాల్సి వచ్చేది. పరిస్థితి పుండు మీద కారం చల్లినట్టు తయారయ్యేది. కళ్లలోంచి నీరు వచ్చేది. మా బాధ ఆ దేవుడికే తెలుసు. సీఎం వైఎస్ జగన్ పుణ్యాన ఇప్పడు ఆ బాధ తప్పింది. ఊర్లో అప్పులు తీర్చలేదన్న అవమానాలు లేవు. గొప్ప రైతుగా తలెత్తుకొని జీవిస్తున్నాను. ఖరీఫ్, రబీ సాగు మొదలెట్టే సమయానికి వైఎస్సార్ రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందుతోంది. ఇప్పుడు ఎంతో ఆనందంతో ఆముదం, కంది, సజ్జ వంటి పంటలు సాగు చేస్తున్నాము. గతంలో బ్యాంకులు కూడా పంట రుణాలు సకాలంలో ఇచ్చేవి కావు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ప్రభుత్వం ఏటా ఇచ్చే రూ.13,500 పెట్టుబడులకు బాగా ఉపయోగపడుతున్నాయి. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద కూడా పరిహారం లభిస్తోంది. నాలుగేళ్లుగా అప్పుల బాధలే లేవు. పైగా రైతు భరోసా కేంద్రాల వల్ల ఎప్పటికప్పుడు విలువైన సలహాలు, సూచనలు అందుతున్నాయి. – వన్నూరప్ప, పెండేకల్, కర్నూలు జిల్లా (గవిని శ్రీనివాసులు, విలేకరి, కర్నూలు అగ్రికల్చర్) -
టార్గెట్ 5 లక్షల ఇళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పేదింటి అక్కచెల్లెమ్మ సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో ఉన్న సీఎం జగన్ సర్కార్.. వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలో మరో ఐదు లక్షల పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలనే లక్ష్యంతో గృహ నిర్మాణ శాఖ అడుగులు వేస్తోంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద 30.75 లక్షల మంది పేద మహిళల పేరిట విలువైన ఇంటి స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాక.. ఇందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు కూడా ఇచ్చారు. మొదటి దశ కింద మొన్న ఆగస్టు నెలాఖరు నాటికి ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేశారు. గత నెల 12 నాటికి రెండో దశలోని కొన్ని ఇళ్లతో కలిపి 7.43 లక్షల (5.86 లక్షల సాధారణ + 1.57 లక్షల టిడ్కో) ఇళ్లను లబ్దిదారులకు అందజేశారు. శరవేగంగా రెండో దశ ఇళ్ల నిర్మాణం.. ఇక రెండో దశలో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం చేయాల్సి ఉండగా ఇప్పటికే 98,308 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన నాలుగు లక్షలకు పైగా ఇళ్లను నిర్దేశించుకున్న లక్ష్యంలోగా పూర్తిచేసి పేదలకు అందించేందుకు గృహ నిర్మాణ శాఖ శరవేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ముగింపు దశలో 12,479, రూఫ్ లెవెల్లో 1.03 లక్షలు, పునాది పైదశల్లో 3.94 లక్షల చొప్పున ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటన్నింటినీ వేగంగా పూర్తిచేయడంపై అధికారులు దృష్టిపెట్టారు. ఉచితంగా స్థలం.. ఆపై అమిత సాయం మరోవైపు.. ఇళ్ల లబ్దిదారులకు ఖరీదైన స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన సీఎం జగన్ ప్రభుత్వం అక్కడితో ఆగకుండా ఇంటి నిర్మాణం నిమిత్తం యూనిట్‌కు రూ.1.80 లక్షల బిల్లు మంజూరు చేస్తోంది. ♦ స్వయం సహాయక బృందాల ద్వారా లబ్దిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు రుణసాయం చేస్తోంది. ♦ ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా రూ.15 వేలు.. స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా> చేయడం ద్వారా మరో రూ.40 వేలు చొప్పున మొత్తంగా రూ.2.70 లక్షల చొప్పున అదనంగా లబ్దిచేకూరుస్తోంది. ♦ అలాగే, జగనన్న కాలనీల్లో ఉచితంగా నీటి, విద్యుత్ సరఫరా కనెక్షన్లు ఇవ్వడం, డ్రెయిన్లు, రోడ్లు లాంటి సకల వసతులను సమకూరుస్తోంది. ♦ ఇలా స్థలం, ఇంటితో కలిపి పేదింటి మహిళల పేరిట రూ.10 లక్షలు, ఆపైన విలువైన స్థిరాస్తిని జగన్ సర్కార్ సమకూరుస్తోంది. అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం పేదల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి నాటికి పూర్తిచేయాల్సిన లక్ష్యాన్ని అధిగమించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. దీపావళి, క్రిస్మస్, జనవరి ఫస్ట్ ఇలా వరుస పండుగలు, ప్రత్యేక రోజులు ఉన్నందున.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు సొంతూళ్లకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించి పనులు చకచకా పూర్తిచేయడానికి శ్రమిస్తాం. – అజయ్ జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ -
వందేళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా ఇళ్ల నిర్మాణం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా వందేళ్లు చెక్కు చెదరకుండా నిలిచి ఉండేలా.. అత్యంత నాణ్యంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. వెలగపూడి అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు రూ.1,08,553 కోట్లతో 28,30,227 మంది పేదలకు 2,023 నాటికి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. తొలి దశలో ఇప్పటికే 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని, రెండో దశలో 12.70 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ఇళ్ల నిర్మాణాల కాలనీల్లో రూ.1,200 కోట్లతో తాగునీటి వసతి కల్పించడంతో పాటు రూ.32,909 కోట్లతో రహదారులు, విద్యుత్, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రతి జిల్లాకు ఒక జాయింట్ కలెక్టర్‌ను ప్రత్యేకంగా నియమించినట్టు చెప్పారు. ప్రతి లేఅవుట్‌కు ఒక మండల స్థాయి అధికారిని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక జిల్లా స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించినట్టు తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణాన్ని రూ.1.80 లక్షలతో చేపట్టామని, లబ్ధిదారులకు ప్రభుత్వం ఇసుక ఉచితంగా అందిస్తోందన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, అధికారులు ఆయా కంపెనీలతో సంప్రదింపులు జరిపి సిమెంట్, ఇనుము, మెటల్ తదితర మెటీరియల్‌ను మార్కెట్ ధర కంటే తక్కువకు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆగస్టు 7 లోగా నియోజకవర్గం, డివిజన్ స్థాయిలో సమావేశాలు నిర్వహించి, ఇళ్ల నిర్మాణాల్లో ఎదురవుతున్న సమస్యలపై చర్చించి.. పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. -
నవరత్నాలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్‌గా ఏఎన్ నారాయణమూర్తి
సాక్షి, విజయవాడ: నవరత్నాలు కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా అంకంరెడ్డి నాగ నారాయణమూర్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ ఆదిత్య నాథ్ దాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈపీడీసీఎల్ సీఎండీగా సంతోష్‌రావు నియామకం ఈపీడీసీఎల్ సీఎండీగా సంతోష్‌రావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీపీడీసీఎల్ సీఎండీగా హరనాథ్‌ను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఎవరెస్ట్‌పై ‘నవరత్నాల’ రెపరెపలు
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై ‘నవరత్నాలు’ పతాకం రెపరెపలాడింది. పేదల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న నవరత్న పథకాల జెండాతో విశాఖపట్నంలోని పోతిన మల్లయ్యపాలెం కార్ షెడ్ ప్రాంతానికి చెందిన భూపతిరాజు అన్మిష్ (28) ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. జూన్ 1వ తేదీన పర్వతారోహణలో విజయాన్ని నమోదు చేసుకుని ఇటీవల నగరానికి తిరిగి వచ్చాడు. విద్యార్థి దశలోనే మార్షల్ ఆర్ట్స్‌లో సత్తా చాటిన అన్మిష్ పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే లక్ష్యంతో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ సహకారంతో శిక్షణ పొంది తన కల నెరవేర్చుకున్నాడు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ప్రజాసంక్షేమమే ధ్యేయంగా అమలు చేస్తున్న నవరత్నాలు కాన్సెప్ట్‌ను ప్రపంచ శిఖరంపై ఆవిష్కరించాలన్న లక్ష్యాన్ని సైతం నెరవేర్చాడు. కిలిమంజారోపై.. అన్విష్ ఇప్పటికే కిలిమంజారో, అకంకాగోవా పర్వతాలను అధిరోహించాడు. ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతంపై ‘నో బ్యాగ్స్ డే’, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టాలని కోరుతూ జెండాను ఎగుర వేశాడు. మరిన్ని పర్వతాలు అధిరోహిస్తా.. నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. మొక్కలు నాటి భూమిని కాపాడుకుందాం. ఈ దిశగా ప్రజలంతా కృషి చేయాలనేది నా ఆకాంక్ష. భవిష్యత్‌లో ప్రపంచంలో ఎత్తైన మరిన్ని పర్వతాలను అధిరోహించేందుకు ప్రయత్నిస్తాను. – భూపతిరాజు అన్మిష్ -
కరోనా వేళ ఆదుకున్న నవరత్నాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాల పథకాలు కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలందరినీ ఎంతో ఆదుకున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పేదలందరికీ రూ.5 వేలు, రూ.10 వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమచేస్తే వాళ్లు ఖర్చు పెట్టుకుంటారని, దీనివలన ఆర్థికంగా అందరికీ బాగుంటుందని మేధావులు చెప్పారని పేర్కొన్నారు. అదేవిధంగా నవరత్నాల పథకాల ద్వారా సీఎం జగన్ ప్రజలను ఆదుకున్నారని చెప్పారు. ఇటువంటి పథకాలు తమకెందుకు అమలు చేయడం లేదంటూ ఇతర రాష్ట్రాల ప్రజలు బాధపడ్డారన్నారు. జగన్ సీఎం అయ్యాక వివిధ సంక్షేమ పథకాల కింద రాష్ట్రంలోని పేద ప్రజల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.లక్ష కోట్లు జమచేశారని చెప్పారు. ఇన్ని పథకాలు అందిస్తూ మంచిపేరు తెచ్చుకున్న జగన్ పోలవరం నిర్వాసితుల పట్ల కూడా ఇదే విధానం అమలు చేయాలని కోరారు. 2013లో భూసేకరణ చట్టం రాకముందే భూసేకరణలో అదే విధానాలను దివంగత వైఎస్సార్ అమలు చేశారని చెప్పారు. ఇండియాలోనే పవర్ఫుల్ సీఎం అయిన వైఎస్సార్ విధానాలను అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే అవి మరింత ముందుకు వెళతాయంటూ మేధాపాట్కర్ కితాబిచ్చారని గుర్తుచేశారు. నదీజలాల వివాదంలో జగన్, కేసీఆర్ స్నేహపూర్వకంగా మాట్లాడుకోవాలని సూచించారు. -
నవరత్నాల జెండాను హిమాలయాలపై ఎగురవేసిన యువకుడు
-
నవరత్నాలతో కాపుల జీవితాల్లో వెలుగు
సాక్షి, అమరావతి: నవరత్నాలు, కాపు నేస్తం ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం కాపులకు భారీగా లబ్ధి చేకూర్చింది. వివిధ పథకాల ద్వారా దాదాపు 35 లక్షల మంది కాపులు ప్రయోజనం పొందారు. ఇదివరకు ఇలాంటి సహాయం ఎవరూ చేయలేదని, ఇంతగా లబ్ధి పొందుతామని తాము ఊహించనే లేదని ఈ సామాజిక వర్గానికి చెందిన వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ప్రశంసిస్తున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం కాపులను ఓటు బ్యాంకుగానే చూసిందని, రిజర్వేషన్లు కల్పిస్తామని మభ్యపెట్టి పబ్బం గడుపుకుందని గుర్తు చేస్తున్నారు. ఇప్పటి జగన్ సర్కారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తమను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నవరత్నాల ద్వారా కాపులకు కేవలం రెండేళ్ల పాలనలోనే ముఖ్యమంత్రి వైఎస్.జగన్ భారీ ఆర్ధిక ప్రయోజనం కల్పించారు. కాపు నేస్తంతో పాటు నవరత్నాల్లోని ఇతర పథకాల ద్వారా 2019 జూన్ నుంచి ఈ ఏడాది మే నెలాఖరు వరకు 34.82 లక్షల మంది కాపులకు రూ.9,672.25 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. ఇందులో 30.85 లక్షల మందికి నవరత్నాల పథకాల ద్వారా నేరుగా రూ.7,368.20 వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. నగదేతర బదిలీ పథకాల ద్వారా మరో 3.96 లక్షల మంది కాపులకు రూ.2,304.05 కోట్లు లబ్ధి చేకూర్చారు. కాపు నేస్తం కింద 3.27 లక్షల మంది అక్కలకు రూ.491.79 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. -
ఏపీ: జూన్ 22న వైఎస్సార్ చేయూత
సాక్షి, అమరావతి: కరోనా విపత్తులోనూ పేదలు ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం జూన్‌లో అమలు చేసే నవరత్నాల పథకాల తేదీలను ఖరారు చేసింది. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ వాహన మిత్ర, జగనన్న తోడు పథకాలను వచ్చే నెలలో అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఏ తేదీన ఏ పథకం అమలు చేయనుందో ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. చదవండి: వారికి గౌరవ వేతనం పెంచిన ఏపీ ప్రభుత్వం అంబులెన్స్‌లు నిలిపేయడం అన్యాయం -
అగ్రవర్ణ పేదలకూ నవరత్నాలతో భారీ లబ్ధి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనలో రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలందరికీ నవరత్నాల ద్వారా భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా అగ్రవర్ణ పేదలకు ఇలా సంక్షేమ పథకాలను అమలు చేసిన దాఖలాలు లేవు. తొలిసారిగా కులాల ప్రస్తావన లేకుండా కేవలం ఆర్థిక స్థోమతను పరిగణనలోకి తీసుకుంటూ ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పాలనను కొనసాగిస్తున్నారు. 2019 జూన్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు రాష్ట్రంలో 1,62,84,820 మంది అగ్రవర్ణ పేదలకు (కాపులను మినహాయించి) నేరుగా నగదు బదిలీతోపాటు నగదు బదిలీయేతర పథకాల ద్వారా ఏకంగా రూ.16,514.95 కోట్ల మేర ఆర్థిక సాయం అందించారు. నవరత్నాల ద్వారా లబ్ధి పొందిన అగ్రవర్ణ పేదలు అత్యధికంగా పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నారు. లబ్ధిదారుల ఎంపికకు పేదరికమే కొలమానమని.. కులం, మతం, ప్రాంతం, రాజకీయం, పార్టీలు కాదని ఆచరణలో అమలు చేసి చూపించిన తొలి సీఎం వైఎస్ జగన్. ఏ ప్రభుత్వానికైనా ప్రాథమిక సూత్రం పేదరిక నిర్మూలనే అవుతుంది. అందుకు అనుగుణంగానే లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఆప్రాతిపదికనే అగ్రవర్ణాల్లోనూ పేదలందరికీ సీఎం జగన్ సంక్షేమ ఫలాలు అందించారు. గత సర్కారు హయాంలో పెన్షన్, రేషన్ కార్డు కావాలంటే తొలుత ఏ పార్టీ అని ఆరా తీసేవారు. ఆ తరువాత ఏ కులం? అని ప్రశ్నించేవారు. తమ పార్టీ వారికి లేదంటే తమ కులం వారికే మంజూరు చేసేవారు. అది కూడా లంచం ఇస్తేనే తప్ప కనికరించేవారు కాదు. ఇప్పుడు అర్హతే ప్రామాణికంగా వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు అందుతుండటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చదవండి: బాలికల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ: సీఎం జగన్ కన్నెత్తి చూడని జనం.. బాలయ్య చిర్రుబుర్రు -
సీఎం జగన్‌ను అభినందించిన సత్య ఎస్ త్రిపాఠి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘నవరత్నా’ల్లోని వైఎస్సార్ రైతుభరోసా, చేయూత, ఆసరా వంటి పథకాలు ప్రజల జీవితాల్లో పెనుమార్పులు తీసుకురావడంతో పాటు స్థిరమైన అభివృద్ధిని తీసుకువస్తాయన్న నమ్మకం తనకుందని యునైటెడ్ నేషన్స్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ సత్య ఎస్ త్రిపాఠి సీఎం వైఎస్ జగన్‌తో అన్నారు. అలాగే, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఇతర దేశాలకు, రాష్ట్రాలకు ఏపీ సర్కార్ మార్గదర్శకంగా నిలుస్తోందంటూ త్రిపాఠి కొనియాడారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సత్య ఎస్ త్రిపాఠి సోమవారం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరిరువురి మధ్య ప్రకృతి వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణపై చర్చ జరిగింది. సీఎం జగన్ ఏమన్నారంటే.. యునైటెడ్ నేషన్స్‌తో కలిసి పనిచేస్తాం ‘ఆంధ్రప్రదేశ్‌లో అన్ని గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. ఆర్బీకేల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్ల (సీహెచ్సి) ద్వారా రైతులకు దీనిపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ వేస్ట్‌ను కూడా రీసైకిల్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దీనిపై సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏపీ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించడంతో పాటు యునైటెడ్ నేషన్స్‌తో కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గ్లోబల్ ఆర్గనైజేషన్స్‌తో భాగస్వామ్య ఒప్పందాలవల్ల రాష్ట్రానికి మేలు జరగడంతోపాటు ప్రజల జీవితాల్లో మార్పు సాధ్యపడుతుంది. అలాగే, సేంద్రీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు మరింత మేలు జరుగుతుంది’.. అని సీఎం వైఎస్ జగన్ వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా కార్బన్ న్యూట్రాలిటీ సాధించాల్సిన అవసరంపై ఈ సమావేశంలో చర్చించారు. వేస్ట్ టూ వెల్త్ అనే అంశంపై త్రిపాఠి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి, ఎలక్ట్రానిక్ వేస్ట్‌ను ఈ–క్లస్టర్ల ద్వారా సేకరించవచ్చని, ఇందుకుగాను అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సత్య ఎస్ త్రిపాఠిని సీఎం జగన్ శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి. విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
‘పట్టా’భిషేకాల కోలాహలం
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇంటి స్థల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన సంబరాలు అక్కచెల్లెమ్మల సంతోషాల మధ్య ఉత్సాహపూరితంగా, కోలాహలంగా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పేదలంతా ఇళ్ల స్థల పట్టాలు తీసుకుంటూ.. దశాబ్దాల నుంచి కలగానే మిగిలిపోయిన సొంతిల్లు సాకారమవుతున్న వేళ ఆనందంతో భూమి పూజల్లో పాల్గొంటున్నారు. శంకుస్థాపనల సందర్భంగా జగనన్న కాలనీలను అరటి పిలకలు, మామిడి తోరణాలతో అలంకరిస్తున్నారు. పట్టాల పంపిణీ, శంకుస్థాపన సందర్భంగా కాలనీలకు వస్తున్న ప్రజాప్రతినిధులకు మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలుకుతున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలో పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన లబ్ధిదారులు 80 శాతం కాలనీల్లో పట్టాల పంపిణీ పూర్తి గత నెల 25వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కొమరగిరి వైఎస్సార్ జగనన్న కాలనీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయగా.. అప్పటినుంచి ప్రతిరోజూ రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా ఈ కార్యక్రమాలు పండుగలా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో సోమవారం నాటికి 21.96 లక్షల మందికి ఇళ్ల స్థలాలు/టిడ్కో ఇళ్ల పంపిణీ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 17,054 వైఎస్సార్ జగనన్న కాలనీలను రూపొందించగా.. 13,595 కాలనీల్లో పట్టాలు పంపిణీ చేశారు. అంటే 80 శాతం కాలనీల్లో పట్టాల పంపిణీ ప్రక్రియ పూర్తయింది. కోర్టు కేసులున్న చోట్ల త్వరగా వాటిని పరిష్కరించి లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వనున్నారు. కోర్టు కేసులు ఉన్నచోట్ల ఎంపికైన 3.79 లక్షల మంది లబ్ధిదారులకు లేఖలు అందజేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో సోమవారం నాటికి 2.95 లక్షల మందికి లేఖలు ఇచ్చారు. మహాక్రతువు ముందుకే.. రాష్ట్రంలో ఇళ్లు్ల లేని పేదలందరికీ వచ్చే మూడేళ్లలో గృహ సౌకర్యం కల్పించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకుని మహా క్రతువుకు శ్రీకారం చుట్టి ప్రజల్లో సంతోషం నింపారు. రాష్ట్రంలో ఏ ఒక్క పేదకూ ఇల్లులేని పరిస్థితి లేకుండా చేయాలని ఉక్కు సంకల్పం పెట్టుకున్న ఆయన ఇళ్ల నిర్మాణాన్ని కూడా స్వల్పకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి సంకల్ప సాధన కోసం అధికార యంత్రాంగం 30.76 లక్షల మందిని ఇళ్ల పట్టాల కోసం ఎంపిక చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,460 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. కొత్తగా దాదాపు అదే సంఖ్యలో కొత్త కాలనీలను ప్రణాళికాబద్ధంగా రూపొందించింది. ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం సకల సౌకర్యాలతో రూపొందించిన 17,054 వైఎస్సార్ జగనన్న కాలనీలు భవిష్యత్‌లో సకల సౌకర్యాలతో కూడిన ప్రణాళికాబద్ధమైన గ్రామాలు, పట్టణాలు, నగరాలుగా విలసిల్లనున్నాయి. సకల సదుపాయాలతో.. కాలనీల్లో చక్కటి రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ సదుపాయాలతోపాటు ఉద్యాన వనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలు తదితరాల కోసం ప్రత్యేకంగా స్థలాలు కేటాయించారు. ఎక్కడా వంకర్లు లేకుండా సరళరేఖల్లా ఇళ్లు ఉండనున్నాయి. కొత్తగా రూపొందించిన వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 24 చోట్ల 5వేలకు పైగా ఇళ్లు రానున్నాయి. ఒక్కో ఇంట్లో సగటున నలుగురు జనాభా లెక్కవేసుకుంటే 24 కాలనీల్లో ఒక్కోచోట కనీసం 20 వేల చొప్పున జనాభా ఉండనున్నారు. విజయనగరం జిల్లా గుంకలాం, తూర్పు గోదావరి జిల్లా కొమరగిరి, గుంటూరు జిల్లా పేరేచెర్ల లాంటి కాలనీల్లో తొమ్మిది వేల పైగా ఇళ్లు రూపుదిద్దుకోనున్నాయి. ఇళ్ల నిర్మాణం పూర్తయి గృహప్రవేశాలు చేసేసరికే ఇవి పట్టణాలు కానున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో అనువైన ప్రాంతాల్లో స్థలాలు కేటాయించడంతోపాటు ఇళ్లు కట్టుకోవడానికి వీలుగా వారికి నచ్చేవిధంగా ఐచ్ఛికాలు ఇవ్వడంతో లబ్ధిదారుల మోముల్లో చెప్పలేనంత సంతోషం కనిపిస్తోంది. వారంతా ఆనందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను వేనోళ్ల ఆశీర్వదిస్తున్నారు. -
నవరత్నాలు, అభివృద్ధి, ఆస్తుల కల్పన
సాక్షి, అమరావతి: నవరత్నాలు, వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోని అంశాలతో పాటు అభివృద్ధి, ఆస్తుల కల్పనే లక్ష్యంగా 2021–22 వార్షిక బడ్జెట్ రూపకల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మౌలిక సదుపాయాలు కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు పారిశ్రామికీకరణ వేగవంతానికి బడ్జెట్లో పెట్టుబడి వ్యయానికి ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈసారి బడ్జెట్లో మహిళా సాధికారత, పిల్లల సంక్షేమానికి పెద్దపీట వేస్తారు. వ్యవసాయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు సవరణలపై ఆర్ధిక శాఖ అన్ని శాఖలకు మార్గదర్శకాలిచ్చింది. బడ్జెట్ ప్రతిపాదనలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ మంగళవారం నుంచి ప్రాథమిక కసరత్తు ప్రారంభించారు. సంక్షేమ, అభివృద్ధి పనులకు భారీగా నిధులు వెచ్చించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ఆర్ధిక వనరులను మరింత సమర్థంగా వినియోగించుకునేలా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. నిర్వహణ వ్యయం వీలైనంత మేర కట్టడి చేయడంలో భాగంగా రంగాల వారీగా సమీక్షించాలని నిర్ణయించింది. గంపగుత్త కేటాయింపులొద్దు ► వచ్చే బడ్జెట్లో శాఖల వారీగా గంపగుత్త కేటాయింపులకు స్వస్తి పలకాలి. ఏ శాఖలో.. ఏ రంగానికి, ఏ విభాగానికి ఎన్ని నిధులు అవసరమో ప్రత్యేక పద్దుల ద్వారా ప్రతిపాదనలు చేయాలని, అలాగే లింగ నిష్పత్తి మేరకు మహిళలకు కేటాయింపులు చేయాలని ఆర్థిక శాఖ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రభుత్వ లక్ష్యాలు.. ► గృహ నిర్మాణం, తాగునీరు, విద్య, ఆరోగ్యం, రహదారులు, రవాణా రంగాల్లో మౌలిక వసతుల కల్పన ► పారిశ్రామికీకరణ ద్వారా ఆర్ధిక వ్యవస్థను మెరుగు పరచాలి. ► కేంద్ర ప్రాయోజిత, రాష్ట్ర అభివృద్ధి పథకాలు, విదేశీ ఆర్ధిక సాయం పథకాలు తదితరాల కేటాయింపులకు ప్రాధాన్యం. ► నవరత్నాలు, మేనిఫెస్టో, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలు, వ్యవసాయ బడ్జెట్‌కు ప్రాధాన్యం. -
కాలువ గట్టు నుంచి కలల లోగిళ్లలోకి..
సాక్షి, అమరావతి: ఈమె శీలం జ్యోతి.. విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని బుడమేరు కాలువగట్టుపై టార్పాలిన్‌ను కప్పిన చిన్న పాకలో పదేళ్లుగా ఉంటోంది. భర్త చనిపోగా కూలి పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. ఈమెకు సొంత ఇల్లు అన్నది కలలో కూడా ఊహించలేని విషయం. కానీ.. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు– పేదలు అందరికీ ఇళ్లు’ జ్యోతి జీవితంలో వెలుగులు నింపింది. ..ఇలా శీలం జ్యోతే కాదు. బుడమేరు కాలువ గట్టుపై దశాబ్దకాలంగా బతుకులు వెళ్లదీస్తున్న నిరుపేదల సొంతింటి కలలను సీఎం వైఎస్ జగన్ సాకారం చేస్తున్నారు. వారికి ఇంటి స్థలాలు మంజూరు చేశారు. అంతేకాదు.. వారికి ఇల్లు కట్టించి కూడా ఇవ్వనున్నారు. లక్ష మందికిపైగా పేదల దుస్థితి ఇదీ.. ‘నవరత్నాలు–పేదలు అందరికీ ఇళ్లు’ పథకం నిరుపేదల జీవితాల్లో కొత్త కాంతులు తీసుకువచ్చింది. విజయవాడలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలు, గన్నవరం, మైలవరం, పెనమలూరు నియోజకవర్గాల్లోని నిరుపేదలు దశాబ్దాలుగా కాలువ గట్లు, ఆటోనగర్‌లోని ఇరుకు సందులు, శివారు ప్రాంతాల్లోని మురికివాడలు, కొండప్రాంతాలు, రోడ్ల పక్కన చిన్నచిన్న పాకలు, రేకుల షెడ్లు వేసుకుని లక్షమందికి పైగా పేదలు ఉంటున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ఈ పథకం అలాంటి లక్షలాది పేదల సొంతింటి ఆశలను నిజం చేసింది. సువిశాలమైన లే అవుట్లలో ఇళ్ల స్థలాలిచ్చింది. అందులో ప్రభుత్వం వారికి బృందావనాన్ని తలపించే రీతిలో ‘వైఎస్సార్–జగనన్న’ కాలనీలు నిర్మించనుంది. రోడ్లు, వీధి దీపాలు, పాఠశాలలు, హెల్త్ సెంటర్లు, పార్కులు.. ఇలా అన్ని వసతులు సమకూర్చనుంది. విజయవాడ రూరల్ మండలం నున్నలో వేసిన లే అవుట్ ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలుస్తోంది. ఓ వైపు కొండలు మరోవైపు తోటలతో ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలుస్తోంది. అందులో 1,265 ఇళ్ల స్థలాలతో వేసిన లే అవుట్ గేటెడ్ కమ్యూనిటీని తలపిస్తోంది. అలాగే, ఇబ్రహీంపట్నంలో కృష్ణానదికి సమీపంలో వేసిన లే అవుట్ ‘రివర్ వ్యూ’ శోభతో అలరారనుంది. కొండపల్లిలో వేసిన లే అవుట్లు కూడా కార్పొరేట్ కంపెనీలు నిరి్మంచే గేటెడ్ కమ్యూనిటీని తలపిస్తున్నాయి. 2,215.19 ఎకరాల్లో 151 లేఅవుట్లు.. ఈ విధంగా విజయవాడలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలు, గన్నవరం, మైలవరం, పెనమలూరు నియోజకవర్గాల్లోని పేదల కోసం ఏకంగా 2,215.19 ఎకరాల్లో 151 లే అవుట్లు వేయడం విశేషం. తద్వారా 1,33,470 మంది పేదలకు ఇళ్ల స్థలాలు సమకూర్చి వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వనుంది. అప్పుడు ఇంటి కోసం పదేళ్లు తిరిగినా ఇవ్వలేదు మేం బుడమేరు కాలువగట్టుపై చిన్నపాకలో పదేళ్లుగా ఉంటున్నాం. సొంత ఇంటి కోసం పదేళ్లుగా తిరిగాను. చంద్రబాబు ప్రభుత్వంలో అప్పటి మా ఎమ్మెల్యే, మంత్రి దేవినేని ఉమాను ఎన్నిసార్లు అడిగినా మాకు ఇల్లు రాలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక మా కల నెరవేరింది. ఇంతకంటే మాకేం కావాలి. – నాగమణి, ఇబ్రహీంపట్నం మా కుటుంబానికి పండుగరోజు జగనన్న మాకు ఇంటి స్థలం ఇచ్చిన రోజే మాకు పండగ రోజు. అందుకే మాకు స్థలం ఇచ్చిన రోజే అక్కడకు వెళ్లి పూజ చేశాం. నున్నలో సెంటు భూమి రూ.5 లక్షలకు పైగా ఉంది. మేం రూ.లక్ష కూడా పెట్టలేం. అలాంటిది మాకు ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చి.. ఇల్లు కూడా కట్టించి ఇస్తోంది. – సారేపల్లి కుమారి, నున్న గ్రామం, విజయవాడ రూరల్ మండలం నోట మాట రావడంలేదు ఎన్నో ఏళ్లుగా రోడ్డు పక్కన పాకలో ఉంటున్నాం. అడగకుండానే మా ఇంటికి వచ్చి మరీ ఇంటి స్థలం కేటాయించారు. ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. ఈ సంతోషంతో నోటి నుంచి మాట రావడంలేదు. మాకు ఇంతకన్నా ఏం కావాలి. – మల్లీశ్వరి, నున్న, విజయవాడ రూరల్ మండలం సొంతిల్లు కట్టుకుంటానని అనుకోలేదు రేకుల షెడ్డులోనే సగం జీవితం అయిపోయింది. ఇక ఈ జీవితానికి సొంతింటి యోగం లేదనుకున్నాను. కానీ, జగనన్న నా కల నిజం చేశారు. నాకంటూ ఓ సొంత ఇంటిని ఇస్తున్నారు. ఎందరో పేదలకు మేలు చేసిన సీఎంను ఆ దేవుడు చల్లగా చూడాలి. – పరసా స్వర్ణకుమారి, నున్న గ్రామం విజయవాడ రూరల్ -
ఇక్కడే సంక్రాంతి... ఇప్పుడే సంతోషం
ముగ్గులేస్తాం..గొబ్బెమ్మలు పెడతాం..ఇక్కడే సంక్రాంతి చేసుకుంటాం రోజంతా ఇక్కడే గడుపుతాం..ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో అవధుల్లేని ఆనందం తమ బతుకు చిత్రం మారిపోతుందనే విశ్వాసం జగనన్నను తమ గుండెల్లో పెట్టుకుంటామంటూ ఉద్వేగం – ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన ‘మేం ఈసారి సంక్రాంతి పండుగ ఇక్కడే చేసుకుంటాం. ముగ్గులేసి, గొబ్బెమ్మలు పెడతాం. రోజంతా ఇక్కడే గడుపుతాం. ఇంత ఆనందాన్ని జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు..’ ఉప్పొంగుతున్న సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ వణుకూరు దళితవాడ మహిళలు చేసిన వ్యాఖ్యలివి. ‘ఇన్నాల్టికి నిజమైన సంక్రాంతి చూస్తున్నాం బాబూ...’ అని వనిత అంటుండగానే, ‘మేం ఇక లక్షాధికారులం..’ అంది మరియమ్మ. ‘ఇన్నాళ్టికి బతుకు మీదే నమ్మకం వచ్చింది సార్...’ అంటూ తన కూతుర్ని హత్తుకుంది లలిత. సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్ళు’ పథకం వారిలో కోటి ఆశలు రేకెత్తిస్తోంది. జీవితంపై నమ్మకం పెంచుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే వారి బతుకు చిత్రాన్నే మార్చేస్తోంది. పనికెళ్ళకపోతే పస్తులుండే పేదల ఊరు వణుకూరు. విజయవాడకు కూతవేటు దూరంలో ఉండే ఈ గ్రామం ఇప్పుడు సంబరాల్లో మునిగితేలుతోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా ఈ గ్రామంలో దాదాపు 18 వేల పైచిలుకు ఇళ్ళ స్థలాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వణుకూరుతో పాటు విజయవాడలోని పలు ప్రాంతాల లబ్ధిదారుల కోసం ఇక్కడ దాదాపు 400 ఎకరాల్లో స్థలాలు ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ బృందం అక్కడ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళింది. ఇళ్ల స్థలాల్లో ఉన్నవారితో పాటు వణుకూరు గ్రామస్తులు కొందర్ని పలుకరించింది. మా పేదరికం పోయింది.. వణుకూరుకు సరిగ్గా అర కిలోమీటర్ దూరంలోనే ఉన్న ఆ ప్రాంతానికి పొద్దున్నుంచీ సూర్యాస్తమయం వరకు ఇళ్ల స్థలాల లబ్ధిదారులు వచ్చి పోతూనే ఉన్నారు. ‘మీరు ఎక్కడ్నుంచి? ఏం చేస్తారు? మీ ఫోన్ నంబర్ ఇవ్వండి?’ అంటూ ఒకర్నొకరు పరిచయం చేసుకుంటున్నారు. ప్లాట్ల దగ్గర నిలబడి సెల్ఫీలు దిగుతున్నారు. ఎవరికి ఏ ప్లాట్ ఇస్తారో తెలియదుగానీ లబ్ధిదారులు మాత్రం అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి అది తమ ఊరని మురిసిపోతున్నారు. విజయవాడలో టైలర్ పనిచేసే బొడుగు దీప్తి కుటుంబ సమేతంగా అక్కడి వచ్చింది. ‘ఈ సంక్రాంతితో మా పేదరికం పోయింది. ఇంతమందితో కలసి ఇక్కడ గొప్పగా బతుకుతాననే నమ్మకం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది..’ అని ఆనందంతో చెప్పింది. 12 ఏళ్ళ చిన్నారి నిహారిక తన తండ్రితో సెల్ఫీ దిగుతూ .. ‘పూరిగుడిసెలో నా పుస్తకాలు తడిచిపోయేవి. సొంత ఇల్లు వచ్చాక నా బుక్స్ అన్నీ ఓ షెల్ఫ్‌లో పెట్టుకుంటా. రోజూ దాబా మీదకెక్కి చదువుకుంటా..’ అంటూ ముసిముసి నవ్వులు నవ్వింది. జగనన్నే మాకు దేవుడు ‘మనకి ప్లాటొచ్చిందమ్మా... పండక్కి రండి’ అంటూ ఆటోనగర్‌లో ఉంటున్న వీరన్న తన అల్లుడికి ఫోన్ చేసి ఆనందం పంచుకున్నాడు. కొత్త ప్లాట్ల దగ్గర వాట్సాప్ వీడియో కాల్లో ఆ ప్రాంతాన్ని చూపించాడు. ‘మాకు జగనన్నే దేవుడు... అందుకే వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నాం’ అని టెన్త్ చదువుతున్న సంకల్ప తన వద్ద ఉన్న ఫోన్ చూపిస్తూ చెప్పింది. ‘ఇంతకాలం మురికివాడలో బతుకు .. ఇప్పుడిక కొత్త వెలుగు’ అంటూ సంజయ్ అక్కడి పరిసరాలను ఫోన్లో చిత్రీకరించాడు. ఇన్నాళ్లకు ఇల్లొచ్చింది.. ‘ఇదయ్యా ఇప్పటిదాకా మా బతుకు’ .. వణుకూరు ఎస్సీ కాలనీలో తన గుడిసె చూపిస్తూ చెప్పింది బుర్రె ప్రసన్న. గడ్డితో కప్పుకోవడమే కష్టంగా ఉన్న ఆ గుడిసెలోనే ఆ కుటుంబం ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటోంది. ఇల్లివ్వమని కొన్నేళ్ళుగా నేతల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని చెప్పిందామె. తన అత్త బతికుండగా సొంతింటి కోసమే తపించిందని, ‘ఈ ప్రభుత్వం వచ్చాక ఇల్లొచ్చింది. ఆమె బతికుంటే మురిసిపోయేది’ అని కన్నీళ్ళు దిగమింగుకుంటూ చెప్పింది. మరో రెండు అడుగులు వేస్తే కృపారావు ఇల్లు కన్పించింది. చుట్టూ పిచ్చి మొక్కలు. అటు వెళ్తుంటే పందులెదురొచ్చాయి. ఇంట్లోకి పాములు రావడం సర్వసాధారణమంట. ఇదే విషయమై కృపారావును కదిలిస్తే.. ’మాకేంటి సార్... ఇప్పుడు మాకు ప్లాట్ వచ్చింది. మా బాధలన్నీ తీరిపోయాయి’ అంటూ తన భార్య వనిత పడుతున్న ఆనందాన్ని పదేపదే చెప్పారు. ప్రభుత్వం భరోసా ఇచ్చింది ఆటో నడిపే నేను ఇంటి అద్దె కట్టడానికే కష్టపడుతున్నా. ఇక ఎదిగే పిల్లలకు ఏమిస్తాననే మనాది ఇప్పటిదాకా ఉండేది. ఇప్పుడు నామీద నాకే నమ్మకం వచ్చింది. కాదు ప్రభుత్వం ఆ నమ్మకం కల్పించింది. ఇలాంటి వాతావరణంలో ఇల్లు వస్తుందని ఊహించుకుంటేనే చెప్పలేని ఆనందం కలుగుతోంది. ఇక్కడ నుంచి పోరంకికి ఆటో నడుపుకుంటా. – కామినేని సాంబయ్య, ఆటో డ్రైవర్ నమ్మకాన్ని జగనన్న నిజం చేశాడు పొద్దస్తమానం టైలరింగ్‌తో కష్టపడే నా భార్య, నేను ఎప్పటికైనా సొంతింట్లో ఉంటామా? అన్పించేది. కానీ జగనన్న ఎన్నికల్లో చెప్పినప్పుడే నమ్మకం కలిగింది. ఇప్పుడు అది నిజమైంది. – బొడుగు లోకేష్, ఆర్టీసీ కాలనీ పేరు రాసుకెళ్లారు.. ఇల్లొచ్చిందని చెప్పారు ఎన్నో ఏళ్లుగా కన్పించిన ప్రతి నాయకుడినీ ఇంటి కోసం వేడుకున్నాం. ఎవరూ కనికరించలేదు. ఇటీవల గ్రామ వాలంటీర్ ఇంటికొచ్చి పేరు రాసుకెళ్ళారు. తర్వాత నీకు ఇల్లొచ్చిందని చెప్పారు. ప్రజల కోసం పనిచేసే జగనన్నను మా గుండెల్లో పెట్టుకుని పూజిస్తాం. –బుర్రె ప్రసన్న, వణుకూరు ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది ఎలాంటి రాజకీయ ఒత్తిడీ లేకుండా మా చేతుల మీదుగా పేదవాళ్ళను లబ్ధిదారులుగా ఎంపిక చేయడం చాలా సంతృప్తిగా ఉంది. ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. – సాయి దీప్తి, వలంటీర్ పట్టాల పండుగ.. ఆనందం నిండగ.. రాష్ట్రవ్యాప్తంగా ఆరో రోజూ ఇళ్ల పట్టాల పంపిణీ ‘అందరికీ చోటు ఇస్తేనే అది సమాజం అనిపించుకుంటుంది. అందరికీ మంచి చేస్తేనే అది ప్రభుత్వం అనిపించుకుంటుంది. అన్ని కులాలు, మతాలు ఉంటేనే రాజధాని అవుతుంది. అటువంటి సమాజాన్ని, ప్రభుత్వాన్ని, రాజధానిని మీ అందరి చల్లని దీవెనలతో నిరి్మంచుకుందాం’ అంటూ సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ ఆరో రోజైన బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగింది. పట్టాలు అందుకున్న అక్కచెల్లెమ్మలు.. ఎన్నో ఏళ్లుగా కలగానే మిగిలిన సొంతిల్లు ఇన్నాళ్లకు దక్కిందంటూ భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్ జిల్లాలో బుధవారం 6,223 మందికి ఇళ్ల పట్టాలివ్వగా..ఇప్పటివరకు పట్టాలు అందుకున్న వారి సంఖ్య 50,809కి చేరింది. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో బుధవారం 4,598 మందికి పట్టాలను అందజేశారు. కర్నూలు జిల్లాలో బుధవారం 8,023 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో బుధవారం 3,451 ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారం 5,331 మందికి ఇళ్ల పట్టాలు, 309 మందికి టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. మంత్రి గౌతంరెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో బుధవారం 3,727 మందికి పట్టాలు అందజేయగా.. ఇప్పటివరకు 23,695 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందారు. కొత్తపట్నం మండలం అల్లూరులో హౌసింగ్ కాలనీ నిర్మాణానికి మంత్రి బాలినేని భూమి పూజ చేశారు. గుంటూరు జిల్లాలో బుధవారం 13,909 మందికి ఇళ్ల పట్టాలు, 262 మందికి టిడ్కో ఇళ్లకు పత్రాలు అందజేశారు. జిల్లాలో ఇప్పటివరకు 57,325 ఇంటి పట్టాలు, 287 టిడ్కో ఇళ్లు పంపిణీ చేశారు. హోం మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో బుధవారం 8,642 మందికి ఇళ్ల పట్టాలను ఇవ్వగా.. ఇప్పటివరకు పట్టాలు పొందిన వారి సంఖ్య 55,428కు చేరింది. మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం జరిగిన కార్యక్రమంలో 7,637 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. ఇప్పటి వరకు 56,372 మంది లబ్ధి పొందారు. కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బుధవారం 5,704 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా.. ఇప్పటివరకు లబ్ధి పొందిన వారి సంఖ్య 54,542కు చేరింది. మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో బుధవారం 3,764 మందికి పట్టాల్ని పంపిణీ చేయగా..ఇప్పటివరకు లబి్ధదారుల సంఖ్య 29,764కు చేరింది. విశాఖ జిల్లాలో బుధవారం 30,444 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి పట్టాలు అందజేశారు. టీడీపీకి ఓటేసినా..జగనన్న పట్టా ఇచ్చారు నేను వైఎస్సార్సీపీకి ఓటేయలేదు. ఎప్పుడూ టీడీపీకే ఓటేశా. మా నాన్న, భర్త తెలుగుదేశం పార్టీయే. అయినా మాకు ఇల్లు రాలేదు. జగనన్న మాకు ఇంటి పట్టా ఇచ్చి.. ఇల్లు కూడా కట్టిస్తున్నారు. వైఎస్సార్ చేయూత పథకం కింద ఇప్పటికే రూ.18,750 వచ్చాయి. నూతిలో కప్పలా మనం ఉన్నదే ప్రపంచం కాదని నా భర్తకు చెబుతా. గొప్ప నాయకుడిని దేవుడిచ్చాడని చెబుతా. – షేక్ సరోజిని, 23వ వార్డు, తెనాలి -
నవరత్నాలకు దండిగా నిధులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాలకు ఎలాంటి నిధుల సమస్య రాకుండా చట్ట సవరణలు తెచ్చినట్టు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బుధవారం శాసనసభలో తెలిపారు. మనబడి, ఆస్పత్రులు, అమ్మ ఒడి, రైతుభరోసా, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాల అమలుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తున్నట్టు చెప్పారు. ఏపీ అభివృద్ధి సంస్థ బిల్లును, ఏపీ విత్త బాధ్యత, బడ్జెట్ నిర్వహణ సవరణ (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ – ఎఫ్ఆర్బీఎం) బిల్లును సభ ఆమోదించింది. ఈ సందర్భంగా ఆయన ఎఫ్ఆర్బీఎం చట్ట సవరణ ఉద్దేశాలను వివరించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రకారం 3 శాతం మాత్రమే అప్పుచేసే అవకాశం ఉందని, మన వడ్డీ, మనకు ఉన్న రెవెన్యూ రశీదులు 10 శాతం ఉంటే అప్పు చేయవచ్చని తెలిపారు. ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు సవరణలు చేస్తున్నట్టు చెప్పారు. దీనికి అనుగుణంగా అప్పు చేసుకునే వెసులుబాటు పరిధి పెరుగుతుందని తెలిపారు. కోవిడ్ కారణంగా ఈ సవరణలు చేయాల్సి వస్తోందన్నారు. ఇప్పటికే కేంద్రం 2 శాతానికి అనుమతించిందని చెప్పారు. కమీషన్లకు కక్కుర్తిపడి ‘పోలవరం’పై రాజీపడ్డ చంద్రబాబు పోలవరంపై చర్చ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ చంద్రబాబుది ఆర్భాటపు, ఆవేశపు, అసమర్థ ప్రభుత్వమని, తమది సహనం ఉన్న సమర్థ ప్రభుత్వమని చెప్పారు. చంద్రబాబు కమీషన్ల కోసం ప్యాకేజీకి కక్కుర్తిపడి ప్రత్యేక హోదా అంశంతోపాటు పోలవరం ప్రాజెక్టుపై రాజీపడ్డారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన ఆ దుర్మార్గపు చర్యే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు ఎన్నో సమస్యలను తీసుకువచ్చిందన్నారు. 2014లో కేంద్రం గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా పోలవరం నిర్మిస్తామన్న కేంద్రం 2016 సెపె్టంబర్లో మాత్రం.. 2014 నాటి ధరలమేరకే భరిస్తామంటే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం తెలపలేదని ప్రశ్నించారు. పైగా 2018 జనవరి 12న అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ రాస్తూ 2014 నాటి ధరల ప్రకారం నివేదిక సమర్పించాం.. దాన్ని ఆమోదించాలని కోరడం ఏమిటని నిలదీశారు. 27 సార్లు ఢిల్లీ వెళ్లానని గొప్పగా చెప్పుకున్న చంద్రబాబు పోలవరం విషయంలో కేంద్రం నిర్ణయాన్ని ఎందుకు అడ్డుకోలేదని, ఆనాడు కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులు కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. ఆనాటి టీడీపీ ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని, ప్రాజెక్టును పూర్తి చేసితీరతామని ఆయన చెప్పారు. -
‘వైఎస్సార్ ఆసరా’తో 90 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు లబ్ధి
-
నవరత్నాల అమలులో మరో ముందడుగు
సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టో మేరకు నవరత్న పథకాల అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో పెద్ద ముందడుగు వేస్తూ పలు కీలక సంక్షేమ పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే కీలక విధాన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశ వివరాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ► గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ,’ వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్’ పథకాలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ పథకాలను సెప్టెంబరు 1న ప్రారంభిస్తారు. ► రాష్ట్రంలోని 77 గిరిజన మండలాల్లో ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ్ ప్లస్’ పథకాన్ని, మిగిలిన మండలాల్లో ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ్’ పథకాన్ని అమలు చేస్తారు. ► 30 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చే ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.1,863 కోట్లు ఖర్చు చేయనుంది. గర్భిణులు, బాలింతలకు ఆరో నెల నుంచి 36 నెలల వరకు, పిల్లలకు 36 నెలల నుంచి 72 నెలల వరకు పౌష్టికాహారాన్ని అందిస్తారు. ► గతంలో కేవలం రక్తహీనత ఉన్న గర్భిణులు, బాలింతలకే పౌష్టికాహారం ఇచ్చే వారు. గత ప్రభుత్వంలో కేవలం రూ.762 కోట్లే ఖర్చు చేయగా, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాన్ని మూడు రెట్లు పెంచి రూ.1,863 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. డిసెంబరు 1 నుంచి లబ్ధిదారుల గడపకే నాణ్యమైన బియ్యం ► శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న లబ్ధిదారుల గడపకే నాణ్యమైన బియ్యం పథకాన్ని డిసెంబరు 1 నుంచి అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తారు. ► వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇళ్లకు బియ్యం పంపిణీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు ప్రభుత్వం ఆరేళ్లపాటు కాంట్రాక్టు ఇవ్వనుంది. వారికి ప్రతి నెల రూ.10 వేలు ఆదాయం వచ్చేలా ఉపాధి కల్పించనుంది. ► ఇందుకు అవసరమైన వాహనాల కొనుగోలుకు స్వయం ఉపాధి పథకం కింద 60 శాతం సబ్సిడీతో బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. ► వాహనాల కోసం లబ్ధిదారులు 10 శాతం చెల్లిస్తే.. 30 శాతం బ్యాంకు రుణం, 60 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇందు కోసం ప్రభుత్వం రూ.550 కోట్లు ఖర్చు చేయనుంది. ► సార్టెక్స్ చేసిన నాణ్యమైన బియ్యాన్ని అందజేయడం వల్ల గతంలో 25 శాతం ఉన్న నూక 15 శాతానికి తగ్గుతుంది. రంగు మారిన బియ్యం 6 శాతం నుంచి 1.50 శాతానికి తగ్గుతుంది. అందుకోసం ప్రభుత్వం ప్రతి కిలోకు అదనంగా రూ.1.10 వ్యయం చేయనుంది. 30 పైసలు పంపిణీకి ఖర్చు చేయనుంది. ► పర్యావరణహితంగా 10 కేజీలు, 15 కేజీలు రీ యూజబుల్ బ్యాగులను లబ్ధిదారులకు ఇస్తారు. బియ్యం మొత్తం స్టార్టెక్స్ చేయడానికి రూ.480 కోట్లు, డోర్ డెలివరీకి రూ.296 కోట్లు వెరసి ప్రభుత్వం రూ.776 కోట్లు ఖర్చు చేయనుంది. ‘వైఎస్సార్ ఆసరా’తో 90 లక్షల మందికి లబ్ధి ► మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని డ్వాక్రా అక్క చెల్లెమ్మలు 2019 ఏప్రిల్ 11 నాటికి బ్యాంకులకు ఉన్న రుణ బకాయి రూ.27,169 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతల్లో చెల్లించనుంది. ► ఇందుకోసం ఉద్దేశించిన ‘వైఎస్సార్ ఆసరా’ పథకాన్ని మంత్రివర్గం ఆమోదించింది. మొదటి విడతగా 2020–21కి గాను రూ.6,792.21 కోట్లు చెల్లించనుంది. తద్వారా రాష్ట్రంలోని 9,33,180 డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న దాదాపు 90 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం కలగనుంది. 43 లక్షల మంది విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ జగనన్న విద్యా కానుక’ పథకాన్ని సెప్టెంబర్ 5న ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు దాదాపు 43 లక్షల మందికి మూడు జతల యూనిఫారమ్ (వస్త్రం), టెస్ట్ పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఒక జత షూ, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగ్ పంపిణీ చేస్తారు. ఇందుకు ప్రభుత్వం రూ.648.09 కోట్లు వెచ్చిస్తుంది. -
నవరత్నాల స్ఫూర్తితో ఏపీ బ్రాండ్ లోగో
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా కొత్త లోగో సిద్ధమైంది. ఏపీకి కొత్తగా బ్రాండింగ్ చేసేందుకు నిర్వహించిన బ్రాండ్‌థాన్ లోగోల పోటీకి ఔత్సాహికుల నుంచి విశేష స్పందన లభించింది. పోటీలో 47,903 మంది పాల్గొనగా నవరత్నాల స్ఫూర్తితో వికసించిన పుష్పం ఆకృతిలో రూపొందించిన లోగో ప్రథమ బహుమతికి ఎంపికైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవతో కూడిన కమిటీ విజేతలను ఎంపిక చేసింది. 47 వేలకు పైగా దరఖాస్తులు.. బ్రాండ్‌థాన్ పోటీకి మంచి స్పందన లభించిందని, క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత మూడు ఎంట్రీలను ఎంపిక చేసినట్లు రజత్ భార్గవ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏపీ బ్రాండ్‌ను ప్రచారం చేసేందుకు గతేడాది అక్టోబర్ 10న న్యూఢిల్లీలో బ్రాండ్‌థాన్ పోటీని ప్రారంభించామన్నారు. నవంబర్ 4 వరకు 47,903 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. మొదటి బహుమతి కింద రూ.50,000, ద్వితీయ బహుమతి రూ.25,000, తృతీయ బహుమతి కింద రూ.10,000 చొప్పున నగదు పురస్కారం ఇవ్వనున్నట్లు చెప్పారు. త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. - నవరత్నాల పథకాలను ప్రతిబింబించేలా తొమ్మిది రేకులతో వికసించిన పుష్పం ఆకృతిలో ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న లోగో ప్రథమ బహుమతికి ఎంపికైంది. ఈ లోగోకు ‘సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం’ అనే శీర్షికను చేర్చారు. హైదరాబాద్‌కు చెందిన సిదార్థ మాధవరెడ్డి దీన్ని రూపొందించారు. - రెండు చేతులు కలిపినట్లుగా ఇంగ్లిష్ అక్షరాల్లో ‘ఏపీ’ అని రాసి ఉన్న లోగో రెండో స్థానం సాధించింది. ‘కలసికట్టుగా ఎదుగుదాం’ అనే శీర్షికను దీనికి జోడించారు. - పారదర్శక పాలనకు ప్రతీకగా రూపొందించిన లోగో తృతీయ బహుమతిని గెలుచుకుంది. -
నవరత్నాలకు ఊతమివ్వండి
ఈ మధ్యకాలంలో పత్రికల్లో హెడ్డింగులు చూస్తూనే ఉన్నారు.. మేము తీసుకున్న చర్యలన్నీ సదుద్దేశంతో, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవే. రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం కావాల్సి ఉంది. అనవసర వ్యయాలను తగ్గిస్తున్నాం. ప్రాధాన్యతల ప్రకారం ముందుకు వెళ్తున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల కింద చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలన్నీ పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచేవేనని, ఆక్సిజన్ లాంటి వీటికి బ్యాంకర్లు సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. రైతులు, ఆటోలు.. ట్యాక్సీలు నడుపుకుంటున్న వారికి, మత్స్యకారులకు, చేనేతలకు, అగ్రిగోల్డ్ బాధితులకు, కొత్తగా లా పూర్తి చేసిన వారికి.. ఇలా వివిధ వర్గాల వారికి ఇప్పటిదాకా రూ.15 వేల కోట్లకు పైగా నగదు సాయం చేశామని స్పష్టం చేశారు. పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి అమ్మ ఒడి కింద ఈ నెలలో సుమారు రూ.6,500 కోట్లు ఇవ్వబోతున్నామని చెప్పారు. ఆర్థిక మందగమనం ఉన్నప్పుడు దాని ప్రభావం సమాజంలోని అట్టడుగు వర్గాలపైనే ఉంటుందని, ఈ పథకాల ద్వారా ఆ వర్గాల వారికి ఆక్సిజన్ అందించగలిగామన్నారు. మంగళవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగదు బదిలీ రూపంలో ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాల వారికి చేరవేయడానికి ఉద్దేశించిన అన్ ఇంకంబర్డ్ ఖాతాలు అందించడంలో బ్యాంకులు చక్కటి సహకారాన్ని అందించాయన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వివిధ పథకాల కింద నగదును బదిలీ చేయగలిగామని చెప్పారు. ఈ ఏడాది మంచి వర్షాలు పడ్డాయని, రైతు భరోసాతో రైతులను ఆదుకున్నామని, వ్యవసాయ రంగం బాగుండడం ద్వారా ఆర్థిక వ్యవస్థ ముందడుగు వేస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. కౌలు రైతులకూ రుణాలు ఇవ్వండి కౌలు రైతుల విషయంలో లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు ఇవ్వడం లేదని ఎస్ఎల్బీసీ లెక్కలు చెబుతున్నాయని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. బ్యాంకర్లు, ప్రభుత్వం కలిసి కౌలు రైతులకు మరింత ఎక్కువగా రుణాలు అందించేలా ముందడుగు వేద్దామని కోరారు. కౌలు రైతుల కోసం ఒక చట్టాన్ని తీసుకు వచ్చామని, ఈ చట్టం పూర్తి పారదర్శకంగా ఉందని చెప్పారు. ఈ చట్టం ద్వారా రైతుల హక్కులను పరిరక్షిస్తూనే 11 నెలలకు సాగు ఒప్పందానికి వీలు కల్పిస్తోందన్నారు. రైతులు హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని అవగాహన కల్పించాల్సిందిగా సీఎం సూచించారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ చైతన్యం, అవగాహన కలిగించేలా కార్యక్రమాలు చేపట్టాలని సీఎం సూచించారు. ప్రతి 2 వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఉందని, 10 నుంచి 12 మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్నారని, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఉన్నారని సీఎం గుర్తు చేశారు. ప్రతి పథకాన్ని పారదర్శక విధానంలో వివక్ష, అవినీతికి తావు లేకుండా అందిస్తున్నామని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్లు కూడా ఉన్నారని, వీరిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. సచివాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏప్రిల్ నాటికి 11 వేల రైతు భరోసా కేంద్రాలు ఏప్రిల్ నాటికి గ్రామ సచివాలయాల పక్కనే దాదాపు 11 వేల రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. శిక్షణ కేంద్రంలా, రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందించేలా ఈ కేంద్రాలు పని చేస్తాయని, వీటికి ప్రభుత్వం గ్యారెంటీ కూడా ఇస్తుందని స్పష్టం చేశారు. సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులపై ఇక్కడ శిక్షణ ఇస్తారని, రైతుల ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలుగా కూడా భవిష్యత్తులో పని చేస్తాయని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామన్నారు. రైతు భరోసా కేంద్రాలను ఇంటర్నెట్ సౌకర్యంతో అనుసంధానిస్తామని, తద్వారా డిజిటలైజేషన్ పెరుగుతుందని చెప్పారు. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు చాలా మంది ఉన్నారని, వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి తెలిపారు. వీరందరికీ గుర్తింపు కార్డులతో రూ.10 వేల చొప్పున వడ్డీలేని రుణాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. తద్వారా దాదాపు 12 లక్షల మంది లబ్ధి పొందుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ నవోదయం కింద ఖాతాల పునర్ వ్యవస్థీకరణపై కూడా దృష్టి పెట్టాలని, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవాలని ఆయన బ్యాంకర్లకు సూచించారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన వినియోగంలో రాష్ట్రం 12వ ర్యాంకులో ఉందని చెబుతున్నారని, ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవాలని సీఎం సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీనిపై దృష్టి పెడతామన్నారు. రైతులు, మహిళా సంఘాల రుణాలపై వడ్డీ భారం ప్రభుత్వానిదే రైతులకు, మహిళా సంఘాలకు సకాలంలో రుణాలివ్వాలని సీఎం బ్యాంకర్లను కోరారు. వడ్డీ చెల్లింపు బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. మహిళలు, రైతుల విషయంలో బ్యాంకర్లు మానవతా దృక్పథంతో రుణాలు ఇవ్వాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల రుణాలపై వివిధ జిల్లాల్లో వేసే వడ్డీల్లో వ్యత్యాసం ఉందని, 6 జిల్లాల్లో 7 శాతం, 7 జిల్లాల్లో 12 శాతం ఉందని, ఈ వ్యత్యాసాన్ని తొలగించడానికి కృషి చేయాలని సూచించారు. గత ప్రభుత్వం వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ కింద పెట్టిన బకాయిలు రూ.648.62 కోట్లు ఉన్నాయని బ్యాంకర్లు చెబుతున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విషయాన్ని బ్యాంకులు పదే పదే తన దృష్టికి తీసుకు రావడంతో సానుకూలంగా స్పందిస్తున్నానని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కూడా బ్యాంకర్లు దృష్టి పెట్టాలని సీఎం కోరారు. మాకూ కొన్ని కలలు, ఆకాంక్షలు ఉన్నాయి.. మాకూ కొన్ని కలలు, ఆకాంక్షలు ఉన్నాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ద్వారా కరవు ప్రాంతాలకు గోదావరి వరద జలాలను తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నారు. సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) డేటా ప్రకారం శ్రీశైలం వద్ద కృష్ణాలో వచ్చిన నీళ్లు 47 సంవత్సరాల సగటు 1,200 టీఎంసీలుండగా గత 10 ఏళ్లలో అది 600 టీఎంసీలకు పడిపోయిందని చెప్పారు. గత 5 ఏళ్లలో అయితే ఏకంగా 400 టీఎంసీలకు పడిపోయిందని వివరించారు. మరో వైపు గోదావరి నుంచి 3 వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయన్నారు. గోదావరి మిగులు జలాలను వాడుకోవాల్సి ఉందని, 62 శాతం ప్రజలు ఇంకా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారని, రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసి కరువు ప్రాంతాలకు తరలించాల్సి ఉందని, ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ మేరకు ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమాలన్నీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేవేనని, వీటికి బ్యాంకర్లందరూ సహాయం అందించాలని సీఎం కోరారు. స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను పునరుద్ధరణ నాడు – నేడు కింద ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రుల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడుతున్నామని, మొత్తం 45 వేల స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలను బాగు చేస్తున్నామని సీఎం చెప్పారు. ఇందు కోసం దాదాపు రూ.12 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. అమ్మ ఒడి అనే గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నామని, తద్వారా సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా అడుగు వేస్తున్నామన్నారు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడుతున్నామని, మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచుతున్నామని సీఎం వివరించారు. వచ్చే నాలుగైదేళ్లలో విద్యాపరంగా మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రం అగ్రస్థానంలో ఉండే విధంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 62 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. వారిని ఆదుకోకపోతే ఆర్థిక వ్యవస్థ బలోపేతం కాదు. అందుకే ప్రభుత్వం, బ్యాంకులు ఒకతాటిపైకి వచ్చి మరిన్ని కార్యక్రమాలు చేయగలగాలి. ఉగాది నాటికి సంతృప్తికర స్థాయిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ.. మొత్తంగా 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఆ తర్వాత ప్రతి ఏటా 6 లక్షల చొప్పున ఇళ్లు కడతాం. తద్వారా సిమెంట్, ఐరన్, ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లు పెరుగుతాయి. పారిశ్రామిక వృద్ధి సాధ్యమవుతుంది. -
శంకుస్థాపన చేసిన 4 వారాల్లోగా పనులు ప్రారంభం
ముఖ్యమంత్రి ఏదైనా హామీ ఇస్తే అది ప్రభుత్వం ఇచ్చే హామీనే. మాట ఇస్తే కచ్చితంగా చేయాలి. ఇచ్చిన మాట నెరవేర్చలేదన్న మాట ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. విశ్వసనీయతే నా బలం, దానికి భంగం కలగకూడదు. శంకుస్థాపన చేసిన నాలుగు వారాల్లోగా ఏ పనులైనా ప్రారంభం కావాలి. – ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం తరహాలో ప్రజలను మభ్య పెట్టేందుకు పనులకు శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకోవడం ఇక కుదరదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. శంకుస్థాపన చేస్తే నాలుగు వారాల్లోగా పనులు ప్రారంభం కావాల్సిందేనని ముఖ్యమంత్రి అధికార యంత్రాంగానికి స్పష్టత ఇచ్చారు. విశ్వసనీయతే నా బలం, దానికి భంగం కలగకూడదని స్పష్టం చేశారు. నవరత్నాలే ప్రభుత్వ ప్రాధాన్యం అని పునరుద్ఘాటించారు. పరిపాలనా మార్గదర్శక సూత్రాలపై శుక్రవారం వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తాను ఇచ్చిన హామీలు, అమలుపై క్షుణ్ణంగా చర్చించారు. జనవరి లేదా ఫిబ్రవరిలో ‘‘రచ్చబండ’’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. అనవసర వ్యయం వద్దు... గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వెళ్లిపోయిందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. రూ.నాలుగు వేల కోట్లో ఐదు వేల కోట్లో బిల్లులు పెండింగ్‌లో పెట్టిందంటే సరేలే అనుకునేవాళ్లమని, కానీ ఏకంగా రూ.40 వేల కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టారని అధికారులతో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. కార్పొరేషన్ల పేర్లతో రూ.వేల కోట్లు అప్పులు తేవడమే కాకుండా పౌరసరఫరాలు లాంటి కీలక కార్పొరేషన్ల మనుగడనే గత సర్కారు ప్రశ్నార్థకం చేసిందని, అలాంటి తరుణంలో అధికారంలోకి వచ్చామంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సీఎం వివరించారు. గత ఆర్నెల్లుగా ఆర్థికపరమైన అంశాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నామని, కఠిన పరిస్థితులనుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ సమయంలో అనవసర వ్యయాన్ని తగ్గించడంపై దృష్టిపెట్టాలని, ఒక్కపైసా కూడా ఎక్కడా వృథా కాకూడదని వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులను ఆదేశించారు. ప్రాధాన్యతాంశాలపై దృష్టి సారించకుంటే ప్రయోజనం ఉండదన్నారు. చేపట్టే ప్రతి పని 100 శాతం పూర్తవ్వాలి ఈ ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేసినా సంతృప్త స్థాయి (శాచ్యురేషన్)లో అమలు చేస్తుందనేది నిర్వివాదాంశం కావాలని సీఎం స్పష్టం చేశారు. ఉన్న నిధులను సరైన దృష్టి లేకుండా అక్కడ కొంత ఇక్కడ కొంత వ్యయం చేస్తే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. చేపట్టే ప్రతి పనిని ఈ ప్రభుత్వం నూటికి నూరుశాతం చేస్తుందన్నదే మార్గదర్శక సూత్రం కావాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు.ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఎన్నిక కావడమన్నదే మైలురాయి అవుతుందని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి వారికి మేలు చేసినప్పుడే అది నెరవేరుతుందని సీఎం చెప్పారు. జనవరి లేదా ఫిబ్రవరి నుంచి ‘‘రచ్చబండ’’ జనవరి 1 నాటికి గ్రామ, వార్డు సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తాయని సీఎం చెప్పారు. జనవరి లేదా ఫిబ్రవరిలో ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును స్వయంగా పర్యవేక్షించడంతోపాటు ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, వినతులపై హామీలు ఇవ్వాల్సి వస్తుందని, అక్కడికక్కడే చేపట్టాల్సిన పనులపై ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ శాఖలు సిద్ధంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. మాట ఇస్తే తాత్సారం చేయకూడదన్నారు. సీఎం హోదాలో జిల్లాల పర్యటన సందర్భంగా తానిచ్చిన హామీల అమలుపైనా సీఎం సమీక్షించారు. తదుపరి సమీక్ష నాటికి హామీల అమలు క్షేత్రస్థాయిలో ప్రారంభం కావాలని ఆదేశించారు. సమన్వయంతో నిధులు సాధించాలి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా అందే నిధులపైనా సీఎం సమీక్ష చేశారు. ఈ పథకాల నుంచి వీలైనన్ని నిధులు తెచ్చుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శాఖకు చెందిన కార్యదర్శి లేదా విభాగాధిపతి వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి, ఏపీ భవన్ అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. వీరి సహకారంతో కేంద్ర ప్రభుత్వ అధికారులను క్రమం తప్పకుండా కలుసుకుంటూ నిధులు తెచ్చుకోవడంపై దృష్టిపెట్టాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీతోపాటు వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నవరత్నాలే తొలి ప్రాధాన్యం ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న నవరత్నాలే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని సీఎం స్పష్టం చేశారు. అధికారులంతా మేనిఫెస్టోను దగ్గర పెట్టుకుని అమలు చేయడంపై దృష్టిపెట్టాలన్నారు. 14 నెలలపాటు 3,648 కిలోమీటర్లు సాగిన తన పాదయాత్రలో వివిధ వర్గాల నుంచి అందిన విజ్ఞప్తులను అధ్యయనం చేసి మేనిఫెస్టో రూపొందించామన్నారు. ఏసీ గదుల్లో కూర్చుని ఏదో ఒకటి పెడదాంలే అన్నరీతిలో మేనిఫెస్టోని తయారు చేయలేదన్నారు. క్షేత్రస్థాయిలో గమనించిన పరిస్థితులు, వెనకబడ్డ వర్గాల వేదనల నుంచి ఈ మేనిఫెస్టో వచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నవరత్నాలతోపాటు ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న ప్రతి అంశాన్నీ అమలు చేయాలన్నారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు - జనవరి లేదా ఫిబ్రవరిలో ‘‘రచ్చబండ’’ కార్యక్రమం ప్రారంభం - నవరత్నాలే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యం - చేపట్టే ప్రతి పనిని ఈ ప్రభుత్వం నూరుశాతం చేస్తుందన్నదే మార్గదర్శక సూత్రం కావాలి. - అనవసర వ్యయాలకు కళ్లెం వేసి సామాన్యులపై భారం మోపకుండా ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలి. - ఎన్నికల హామీలు, జిల్లా పర్యటనల సందర్భంగా చేసే వాగ్దానాలను కచ్చితంగా అమలు చేయాలి. - సమన్వయంతో కృషి చేసి కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను వీలైనంత ఎక్కువగా సాధించాలి.