వచ్చే బడ్జెట్‌కు ప్రతిపాదనలు పంపండి | Send proposals for the next budget | Sakshi
Sakshi News home page

వచ్చే బడ్జెట్‌కు ప్రతిపాదనలు పంపండి

Published Mon, Dec 4 2023 5:23 AM | Last Updated on Mon, Dec 4 2023 8:45 AM

Send proposals for the next budget - Sakshi

సాక్షి, అమరావతి: నవరత్న పథకాలతోపాటు కేంద్ర పథకాలకు సంబంధించి 2024–25 వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనలను ఈ నెల 14లోగా ఆన్‌లైన్‌లో పంపాలని ఆర్థిక శాఖ సూచించింది. మహిళలు, బాలికలకు ప్రత్యేకం గాజెండర్‌ బడ్జెట్‌కు ప్రతిపాదనలను సమర్పించాలని కోరింది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్టల సంక్షేమానికి ఉప ప్రణాళికలను ప్రతిపాదించాల్సిందిగా ఆయా శాఖలను ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిందని పేర్కొన్నారు.

ప్రధానంగా రహదారులు, గృహాలు, తాగునీరు, విద్య, ఆరోగ్యం వంటి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వీటితోపాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పారిశ్రామికీకరణ లక్ష్యాలను సాధించేలా మూలధన వ్యయ ప్రతిపాదనలు పంపాల్సిందిగా సూచించారు. ఈ ప్రతిపాదనలు తప్పనిసరిగా మిషన్‌ లక్ష్యాల ఆధారంగా ఉండాలని స్ప­ష్టం చేశారు. మంజూరు చేసిన పనుల వివరాలపైనే బడ్జెట్‌ ప్రతిపాదనలు చేయాలన్నారు.

ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయని పనుల కోసం ఎటువంటి బడ్జెట్‌ ప్రతిపాదనలు చేయరాదని సూచించారు. అ­లాంటి పనులకు బిల్లులను కూడా అంగీకరించబో­మని పేర్కొన్నారు. బడ్జెట్‌ కేటాయింపుల్లేని ప­ను­ల ప్రతిపాదనలను కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చే­య­­­రాదన్నారు. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరు­ల సమర్థ వినియోగం ద్వారా ఫలితాలు సాధించేలా బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉండాలని సూచించారు.  

ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవి.. 
♦ ప్రస్తుత పథకాలను సమీక్షించి.. ఆ పథకాలకు వ్య­­యం ఎంత అవుతోంది? ఆ మేరకు ఫలితా­లు, ప్రయోజనాలు వస్తున్నాయా లేదా పరిశీ­లిం­చా­లి. ప్రయోజనం లేని పథకాలను ఆర్ధిక శా­ఖతో సంప్రదించి నిలిపివేయాలి. ఇలా ఆదా అ­యి­న సొమ్ముతో కొత్త పథకాలను రూపొందించాలి. 

♦ అన్ని శాఖాధిపతుల వేతనాలేతర వస్తువులు, ఇతర వ్యయాలను సమీక్షించి 20 శాతం మేర పొదుపును ప్రతిపాదించాలి.  
♦ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ల ఉప ప్రణాళికలకు ప్రత్యేక ప్రతిపాదనలు సమర్పించాలి. ప్రస్తుత ప్రతిపాదనలను సమీక్షించి, మార్పులు అవసరం ఉంటే చేయాలి. 
♦అన్ని శాఖలు వాస్తవికంగా అంచనాలు వేసి బడ్జె­ట్‌ ప్రతిపాదనలు సమర్పించాలి. తప్పనిసరి వ్య­­యా­లైన సబ్సిడీలు, సామాజిక భద్రత పెన్ష­న్లు మొదలైన వాటికి లబ్ధిదారుల సంఖ్య ఆ«­దా­రంగా తగిన నిధులను ప్రతిపాదించాలి. కన్స­ల్టెం­ట్స్, ఔట్‌సోర్సింగ్, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా ఎలాంటి ప్రతిపాదనలు చేయ­కూడదు. 
♦ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అంచనాలను అత్యంత జాగ్రత్తతో రూపొందించాలి. అంచనాలు, వాస్తవాల మధ్య భారీ వ్యత్యాసాలను నివారించాలి. ప్రస్తుత పన్ను రేట్లు ఆధారంగానే రెవెన్యూ రాబడుల అంచనాలను ప్రతిపాదించాలి. వీలైనంత మేర ఆదాయ వనరుల ఆర్జనపై శాఖలు దృష్టి పెట్టాలి. అందుకు అనుగుణంగా ఆదాయ వనరుల అంచనాలను పంపాలి. 
♦ సవరించిన అంచనాలు వాస్తవిక దృక్పథంతో ఉండాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8 నెలల వ్యయ పురోగతి, మిగిలిన నెలల్లో ఖర్చయ్యే అవకాశం ఆధారంగా సప్లిమెంటరీ గ్రాంట్లు కోసం అదనపు నిధులకు ప్రతిపాదనలు చేయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement