‘మనం పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం. ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. నవరత్నాల పథకాలు, మేనిఫెస్టోనే తమ ప్రభుత్వానికి జీవనాడి అని ఆయన స్పష్టం చేశారు. శాచ్యురేషన్ (సంతృప్తికర) విధానంలో అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు కచ్చితంగా అంది తీరాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అమలులో పార్టీలు, రాజకీయాలు చూడొద్దని, తమ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినాసరే వినొద్దని కలెక్టర్లకు తేల్చి చెప్పారు.