2022–23లో 68% అప్..
ముంబై: రిజర్వ్ బ్యాంక్ అంబుడ్స్‌మన్ స్కీముల కింద వివిధ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 2022–23లో ఇవి 68 శాతం పెరిగి 7.03 లక్షలుగా నమోదయ్యాయి. మొబైల్/ఎల్రక్టానిక్ బ్యాంకింగ్, రుణాలు, ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు, పింఛను చెల్లింపులు, రెమిటెన్సులు మొదలైన వాటికి సంబంధించిన ఫిర్యాదులు వీటిలో ఉన్నాయి.
ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవడం, ఆర్‌బీఐ–సమీకృత అంబుడ్స్‌మన్ స్కీము (ఆర్‌బీ–ఐవోఎస్) కింద దాఖలు చేసే ప్రక్రియను సరళతరం చేయడం తదితర అంశాలు ఫిర్యాదుల నమోదుకు దోహదపడ్డాయని అంబుడ్స్‌మన్ స్కీము వార్షిక నివేదిక పేర్కొంది. అత్యధికంగా 83.78 శాతం ఫిర్యాదులు (1,93,635) బ్యాంకులపై వచ్చాయి. అంబుడ్స్‌మన్ ఆఫీసులు 2,34,690 ఫిర్యాదులను హ్యాండిల్ చేశాయి. సమస్య పరిష్కారానికి పట్టే సమయం సగటున 33 రోజులకు మెరుగుపడింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది 44 రోజులుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment