సమావేశంలో మాట్లాడుతున్న బండి సంజయ్
ఆరు గ్యారంటీలు ఎంతమందికి ఇచ్చారో చెప్పే దమ్ముందా?
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్
ఈనెల 21న ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు ప్రకటన
కరీంనగర్ టౌన్: ఆరు గ్యారంటీలను అమలు చేశామని అంటున్న కాంగ్రెస్ నేతలు కొండగట్టు అంజన్న సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. కొండగట్టు అంజన్న చాలా పవర్ ఫుల్ అని, ఆయన సన్నిధిలో అబద్ధాలాడిన, దొంగ హామీలిచ్చిన కేసీఆర్, ఆయన కుమార్తె కవితకు ఏ గతి పట్టిందో కాంగ్రెస్ నేతలకూ అదే గతి పడుతుందని హెచ్చరించారు.
‘ఆరు గ్యారంటీలను అమలు చేశామంటున్న ఆ కాంగ్రెస్ నేతను అడుగుతున్నా.. మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఎంతమందికి ఇచ్చారు..? రైతులు, కౌలు రైతులకు రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు ఎంతమందికి అందించారు..? ధాన్యం క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చారా..? తరుగు లేకుండా ధాన్యాన్ని సర్కారే కొనుగోలు చేస్తామన్నారు.. చేశారా..? అని ప్రశ్నించారు.
కరీంనగర్‌లో గురువారం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ మండలాల అధ్యక్షులు, ఇన్‌చార్జిల తో బండి çసమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుమ్కక్కై నయ్.. రెండుపార్టీలు కలిసి నన్ను ఓడించడానికి కుట్ర చేస్తున్నయి.’’ అని ఆరోపించారు. ప్రజలకు కాంగ్రెస్ మంచి చేస్తే పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌కు ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. ఈ నెల 21న వేలాదిమందితో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధిగా నామినేషన్ వేస్తున్నట్లు బండి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment