వైఎస్సార్‌సీపీ పథకాలే బాబు హామీలు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ పథకాలే బాబు హామీలు

Published Wed, May 1 2024 4:54 AM

YSRCP schemes are Babu promises: Andhra pradesh

సాక్షి, అమరావతి: టీడీపీ– జనసేన ప్రకటించిన తాజా మేనిఫెస్టోలో చాలా హామీలు ఇప్పటికే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గత ఐదేళ్లుగా విజయ వంతంగా అమలు చేస్తోంది. ఆ హామీలు ఇలా ఉన్నాయి..  
టీడీపీ హామీ: స్కూల్‌కు వెళ్లే విద్యార్థులకు ఏడాదికి రూ.15వేలు 
ఇప్పటికే అమలవుతోందిలా: అమ్మఒడి కింద ప్రతి తల్లికి రూ.15వేలు ఇస్తోంది. ఈ మొత్తాన్ని రూ.17 వేలకు పెంచి అమలు చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో ప్రకటించారు.  

టీడీపీ హామీ:  డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విదేశీ విద్యా పథకం పునరుద్ధరణ 
ఇప్పటికే అమలవుతోందిలా: జగనన్న విదేశీ విద్యా దీవెన పేరిట ఇప్పటికే అమలవుతోంది. సీఎం జగన్‌ ఒక్కొక్కరికి రూ.1.25 కోట్ల వరకు ఆరి్థక సాయం అందిస్తున్నారు. 

టీడీపీ హామీ: కేజీ టూ పీజీ సిలబస్‌ని రివ్యూ చేస్తాం 
ఇప్పటికే అమలవుతోందిలా: జగన్‌ ప్రభుత్వం ఇప్పటికే కేజీ టూ పీజీ సిలబస్‌ను రివ్యూ చేయడమే కాదు.. డిగ్రీలో ఆనర్స్‌ను ప్రవేశపెట్టింది. ఉన్నత విద్యలో అంతర్జాతీయ వర్శిటీలందించే 2 వేల కోర్సులను ఎడెక్స్‌ సరి్టఫికేషన్‌ ద్వారా ఇప్పటికే అందిస్తోంది. 

టీడీపీ హామీ: ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా     
ఇప్పటికే అమలవుతోందిలా: వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఖర్చు చేస్తోంది. 

టీడీపీ హామీ:  బీపీ, షుగర్‌ వంటి నాన్‌ కమ్యూనికబుల్‌ వ్యాధులకు ఉచితంగా జనరిక్‌    మందుల పంపిణీ 
ఇప్పటికే అమలవుతోందిలా: ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్,  జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాల ద్వారా బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. వీరికి సొంత ఊరులోనే ప్రభుత్వ వైద్యులు వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు. 

టీడీపీ హామీ: కిడ్నీ, తలసీమియా వంటి వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10వేలు పింఛన్‌ 
ఇప్పటికే అమలవుతోందిలా: ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కిడ్నీ, తలసీమియా, సికిల్‌ సెల్, ఇమోఫిలియా వంటి వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేల చొప్పున పింఛన్‌ అందిస్తోంది. 

టీడీపీ హామీ: మూతపడిన ప్రతి నైపుణ్య శిక్షణా కేంద్రం పునఃప్రారంభం, విస్తరణ 
ఇప్పటికే అమలవుతోందిలా: వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 192  స్కిల్‌ హబ్‌లు, 26 స్కిల్‌ కాలేజీలను ఏర్పాటు 
చేసింది. 

టీడీపీ హామీ:  డిజిటల్‌ లైబ్రరీల స్థాపన 
ఇప్పటికే అమలవుతోందిలా: వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేస్తోంది. 

టీడీపీ హామీ: ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ 
ఇప్పటికే అమలవుతోందిలా: జగన్‌ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేస్తోంది. 

టీడీపీ హామీ:  ఇమామ్‌లకు రూ.10వేలు, మౌజన్‌లకు రూ.5 వేలు గౌరవవేతనం 
ఇప్పటికే అమలవుతోందిలా: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమామ్‌లకు రూ.10వేలు, మౌజన్‌లకు రూ.5 వేలకు పెంచి మరీ అందిస్తోంది. 

టీడీపీ హామీ:  క్రిస్టియన్‌ శ్మశాన వాటికలకు స్థలం కేటాయింపు, జెరూసలేం యాత్రికులకు సాయం 
ఇప్పటికే అమలవుతోందిలా: జగన్‌ ప్రభుత్వం క్రిస్టియన్‌ శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయిస్తోంది. జెరూసలేం యాత్రకు వెళ్లే వారికి ఏటా ఆరి్ధక సాయం అందిస్తోంది.

టీడీపీ హామీ: రాష్ట్ర యువతను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు రాష్ట్రాన్ని వేదికగా మారుస్తాం. 
ఇప్పటికే అమలవుతోందిలా: ఆడుదాం ఆంధ్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా క్రీడా ప్రతిభను వెలికితీసే కార్యక్రమం జరుగుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారికి వైఎస్సార్‌ క్రీడా ప్రోత్సాహకాల పేరిట గతంలోకంటే భారీగా పెంచి ప్రోత్సాహకాలను అందిస్తోంది. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ కోసం ఆరి్థక సాయం అందిస్తోంది.

టీడీపీ హామీ:  రాష్ట్రంలో అనేక స్కూళ్లు మూతపడటానికి కారణమైన జీవో 117 రద్దు, మూతపడిన పాఠశాలల 
పునఃప్రారంభం 
ఇప్పటికే అమలవుతోందిలా: 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో మూతపడిన 5 వేల స్కూళ్లను జగన్‌ ప్రభుత్వం పునరుద్ధరించి, అందుబాటులోకి తీసుకొచి్చంది. జీవో 117 ద్వారా విద్యార్థులకు సబ్జెక్టు టీచర్లను ప్రవేశపెట్టింది.

టీడీపీ హామీ: 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా, రాయితీతో సోలార్‌ పంప్‌సెట్లు, మిగిలిన విద్యుత్‌ ప్రభుత్వం కొనుగోలు  
ఇప్పటికే అమలవుతోందిలా: వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 2019 నుంచి పగటి పూట నిరంతరాయంగా 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. ఇందుకోసం రూ.1,700 కోట్లతో ఫీడర్లను ఆధునికీకరించింది. రాయితీపై సోలార్‌ పంపుసెట్లు ఇప్పటికే అందజేస్తోంది. మిగిలిన విద్యుత్‌ కొనుగోలుకు గ్రిడ్‌కు అనుసంధానించే ప్రక్రియ కూడా జరుగుతోంది.

టీడీపీ హామీ:  రైతులకు రూ.20 వేల పెట్టుబడి సాయం, ధరల స్థిరీకరణ నిధి, కౌలురైతులకు గుర్తింపు కార్డులు, సంక్షేమ ఫలాలు, పంటల బీమా వర్తింపు. సేంద్రీయ వ్యవసాయం చేసే వారికి ఆరి్థకంగా, సాగు, మార్కెటింగ్‌ అంశాల్లో తోడ్పాటు. ప్రభుత్వ రంగంలో గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్ల ఆధునికీకరణ, నూతన యూనిట్ల ఏర్పాటు, దళారుల దోపిడిని కట్టడి చేసేందుకు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీ చట్టం (ఏపీఎంసీ యాక్టు) పటిష్టంగా అమలు, డ్రిప్‌ ఇరిగేషన్‌కు 90 శాతం సబ్సిడీ, సెరికల్చర్‌కు ప్రోత్సాహం 

ఇప్పటికే అమలవుతోందిలా: వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లుగా రూ.13,500 చొప్పున రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తాన్ని రూ.16 వేలకు పెంచుతున్నట్టు వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో పేర్కొంది. ఇప్పటికే రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. కౌలు రైతులకు పంట సాగు హక్కుదారు పత్రాలు (సీసీఆర్సీ) ప్రభుత్వం జారీ చేస్తోంది. సీసీఆర్సీలు పొందిన కౌలు రైతులకు భూ యజమానులతో సమానంగా సంక్షేమ ఫలాలు అందిస్తోంది. పంటల బీమా కూడా వర్తింపచేసి అమలు చేస్తోంది. ఆర్బీకే స్థాయిలో గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. ఏపీఎంసీ యాక్టును సమర్ధవంతంగా అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు డ్రిప్‌ ఇరిగేçషన్‌ కోసం 90 శాతం సబ్సిడీ అందిస్తోంది.  పట్టు రైతులకు కూడా ప్రోత్సాహకాలు ఇస్తోంది. 

టీడీపీ హామీ: శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం 
ఇప్పటికే అమలవుతోందిలా: వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇప్పటికే గ్రామ సచివాలయాల ద్వారా శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తోంది. 

Advertisement
 
Advertisement