ఈ–స్కూటర్‌కు రూ.10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం! | Central Government Scheme For Electronic Vehicle Users | Sakshi
Sakshi News home page

ఈ–స్కూటర్‌కు రూ.10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం!

Published Thu, Mar 14 2024 9:40 AM | Last Updated on Thu, Mar 14 2024 11:35 AM

Central Government Scheme For Electronic Vehicle Users - Sakshi

ఈ–త్రీవీలర్‌కు రూ.50,000 వరకు

కేంద్ర నూతన ప్రోత్సాహక పథకం

ఈ–రిక్షా, ఈ–కార్ట్‌ కొనుగోలుకు రూ.25,000 వరకు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల విక్రయాలను దేశవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్‌ టూవీలర్‌కు రూ.10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తారు. సుమారు 3.33 లక్షల యూనిట్ల ఈ–టూవీలర్లకు మద్దతు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

అలాగే ఈ–రిక్షా, ఈ–కార్ట్‌ కొనుగోలుకు రూ.25,000 వరకు, పెద్ద ఈ–త్రీవీలర్‌కు రూ.50,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం ఉంటుంది. 41,000 యూనిట్లకు ఈ స్కీమ్‌ను విస్తరిస్తారు. ఈ పథకం కోసం భారీ పరిశ్రమల శాఖ రూ.500 కోట్లను కేటాయించింది. 2024 ఏప్రిల్‌తో మొదలై జూలై వరకు ఈ స్కీమ్‌ను అమలు చేస్తారు. ఫేమ్‌–2 సబ్సిడీ పథకం ఈ ఏడాది మార్చి 31న ముగుస్తుండడంతో ప్రభుత్వం కొత్త పథకాన్ని పరిచయం చేసింది.

ఇవి చదవండి: పేటీఎంకు మరో బిగ్‌ షాక్‌..!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement