central govt scheme
-
ఈ–స్కూటర్‌కు రూ.10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల విక్రయాలను దేశవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ టూవీలర్‌కు రూ.10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తారు. సుమారు 3.33 లక్షల యూనిట్ల ఈ–టూవీలర్లకు మద్దతు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అలాగే ఈ–రిక్షా, ఈ–కార్ట్ కొనుగోలుకు రూ.25,000 వరకు, పెద్ద ఈ–త్రీవీలర్‌కు రూ.50,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం ఉంటుంది. 41,000 యూనిట్లకు ఈ స్కీమ్‌ను విస్తరిస్తారు. ఈ పథకం కోసం భారీ పరిశ్రమల శాఖ రూ.500 కోట్లను కేటాయించింది. 2024 ఏప్రిల్‌తో మొదలై జూలై వరకు ఈ స్కీమ్‌ను అమలు చేస్తారు. ఫేమ్–2 సబ్సిడీ పథకం ఈ ఏడాది మార్చి 31న ముగుస్తుండడంతో ప్రభుత్వం కొత్త పథకాన్ని పరిచయం చేసింది. ఇవి చదవండి: పేటీఎంకు మరో బిగ్ షాక్..! -
తెలంగాణ కు కేంద్ర ప్రభుత్వ భూములు ప్రకటించిన కేంద్రం
-
గుడ్‌న్యూస్: రూ.13,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. ప్రయోజనాలు ఇవే..
చేతివృత్తుల వారు, సంప్రదాయ హస్తకళాకారుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. విశ్వకర్మ జయంతి సందర్భంగా 'పీఎం విశ్వకర్మ' (PM Vishwakarma) పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తాజాగా ప్రారంభించారు. ఈ పథకం కింద సంప్రదాయ హస్తకళాకారులు, చేతివృత్తుల వారికి పూచీకత్తు అవసరం లేకుండా అతి తక్కువ వడ్డీకి రుణసాయం అందిస్తారు. ఐదేళ్ల కాలానికి రూ. 13,000 కోట్ల ఆర్థిక వ్యయంతో ఈ పథకం చేనేత కార్మికులు, స్వర్ణకారులు, కమ్మరులు, లాండ్రీ కార్మికులు, బార్బర్లతో సహా సంప్రదాయ హస్తకళాకారులకు చెందిన 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. సాంప్రదాయ హస్తకళాకారులు, చేతివృత్తుల వారి ఉత్పత్తులు, సేవల్లో నాణ్యతను పెంచి తద్వారా వారికి మరింత ఆదరణను పెంచడమే ఈ పథకం లక్ష్యం. రెండు విడతల్లో.. పీఎం విశ్వకర్మ పథకం కింద లబ్ధిదారులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా మొదటి విడతలో రూ. 1 లక్ష రుణం అందిస్తారు. దీన్ని 18 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత రెండో విడతలో రూ. 2 లక్షలు అందిస్తారు. ఈ రుణాన్ని 30 నెలలలో లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇక వడ్డీ రేటు విషయానికి వస్తే లబ్ధిదారుల నుంచి కేవలం 5 శాతం వడ్డీ వసూలు చేస్తారు. మిగిలిన 8 శాతం వడ్డీని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంది. క్రెడిట్ గ్యారెంటీ ఫీజులను కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇతర ప్రయోజనాలు పీఎం విశ్వకర్మ పథకం కింద తక్కువ వడ్డీ లోన్‌తోపాటు మరికొన్ని ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం కల్పించనుంది. లబ్ధిదారులకు మొదట 5-7 రోజుల (40 గంటలు) ప్రాథమిక శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వారి నైపుణ్యాన్ని ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్, గుర్తింపు కార్డు ఇస్తారు. మరింత ఆసక్తి గల అభ్యర్థులు 15 రోజుల (120 గంటలు) అధునాతన శిక్షణ కోసం కూడా నమోదు చేసుకోవచ్చు. అభ్యర్థులకు శిక్షణా కాలంలో రోజుకు రూ. 500 చొప్పున స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. అంతేకాకుండా, టూల్‌కిట్ ప్రోత్సాహకంగా రూ. 15,000 అందిస్తారు. తర్వాత వారి వృత్తిలో భాగంగా నిర్వహించే డిజిటల్ లావాదేవీలకు ఒక్కోదానికి రూ. 1 చొప్పున నెలవారీ 100 లావాదేవీల వరకు ప్రోత్సాహకం చెల్లిస్తారు. లబ్ధిదారుల ఉత్పత్తులకు నాణ్యతా ధ్రువీకరణ, బ్రాండింగ్, ప్రమోషన్, ఈ-కామర్స్ అనుసంధానం, ట్రేడ్ ఫెయిర్స్ ప్రకటనలు, ప్రచారం, ఇతర మార్కెటింగ్ కార్యకలాపాలు వంటి సేవలను జాతీయ మార్కెటింగ్ కమిటీ అందిస్తుంది. అర్హతలు స్వయం ఉపాధి ప్రాతిపదికన అసంఘటిత రంగంలో పని చేసే చేతివృత్తులపై ఆధారపడినవారు ఈ పీఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పథకంలో పేర్కొన్న 18 కుటుంబ ఆధారిత సాంప్రదాయ హస్తకళలు లేదా చేతివృత్తుల్లో ఏదో ఒకదానిలో నిమగ్నమైనవారు ఈ పథకానికి అర్హులు. అలాగే రిజిస్ట్రేషన్ తేదీ నాటికి లబ్ధిదారుల కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. -
తెలంగాణ కంటే కర్ణాటకలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ.. ఎందుకు?
‘గొంగట్లో కూర్చుని అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవాలనుకునే’వారిలాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ నాయకుల వైఖరి ఉందని పలువురు సామాన్యులు భావిస్తున్నారు. ఎందుకంటే తప్పులన్నీ తాము చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై నెపాన్ని నెట్టడాన్ని రాజకీయ పరిశీలకులు కూడా విమర్శిస్తున్నారు. ఇటీవల టీఆర్ఎస్ అధినాయకులు పదే పదే కేంద్రాన్ని విమర్శిస్తూ రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందనీ, నిధులు ఇవ్వడం లేదనీ అబద్ధాలాడడం ఎంత వరకు సమంజసం? కేంద్రమే నిధులివ్వక పోతే రాష్ట్రంలో ఇన్ని జాతీయ రహదారులు ఎలా రూపుదిద్దుకునేవి? గ్రామ పంచాయతీలలో వివిధ అభివృద్ధి పనులకు ఫైనాన్స్ కమిషన్ల పేరుతో వస్తున్నవి కేంద్రం నిధులే. వీటితోనే గ్రామ పంచాయతీల కరెంటు బిల్లులు కట్టించి నిధులు మళ్లించడం మీ తప్పిదం కాదా? రాష్ట్ర ఖజానా పరిస్థితి ఆలోచించి డబుల్ బెడ్రూమ్ల పేరుతో డాంబికాలకు పోకుండా ఉండి ఉంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా తదితర రాష్ట్రాలలాగా లక్షలాది కుటుంబాలకు కేంద్రం నిధులతో సొంతింటి కల నెరవేరేది కాదా? మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి మంజూరవుతున్న ‘ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన’ నిధులు కేంద్రానివి. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు రాష్ట్ర నిధులతో జరుగుతున్న పనులేవీ అనే సందేహం రాకమానదు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షా రూ. 20 వేలకోట్ల ప్రజాధనాన్ని నీటిపాలు చేయడం మీ తప్పు కాదా? హైదరాబాద్ మెట్రోతోపాటు స్కైవేలు, ఫ్లైఓవర్లు, రింగ్ రోడ్లు అంటూ టీఆర్‌ఎస్‌వారు గొప్పగా చెప్పుకుంటున్న వాటి అభివృద్ధికి ఇబ్బడిముబ్బడిగా అందుతున్నవి కేంద్రం నిధులు కావా? రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు అనుమతులు రాకపోవడానికి కారణం కేంద్ర నిబంధనల ప్రకారం మీరు ప్రతిపాదనలు పంపక పోవడమే కదా! మునుగోడు ఎన్నికల్లో ప్రజావ్యతిరేకత వ్యక్తం అవుతుండడంతో ఈ మధ్య చేనేత కార్మికులపై కపట ప్రేమ ఒలకబోస్తూ జీఎస్టీపై మంత్రి కేటీఆర్ ప్రధానికి లేఖ రాయడం ఎవరిని మభ్యపెట్టడానికి? ప్రతి జీఎస్టీ మండలి సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాల్గొంటున్న ప్రతినిధులు అప్పుడే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? జీఎస్టీ మండలిలో రాష్ట్రాలన్నీ కలిసి ప్రతి నిర్ణయం తీసుకుంటాయి కదా! మరి కేంద్రంపై నిందలు వేయడం ఏంటి? పై పెచ్చు జీఎస్టీ మండలి చేనేత కార్మికుల విషయంలో పన్ను పరిధిని రూ. 40 లక్షలకు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 20 లక్షలకు మించితే పన్ను వసూలు చేస్తూ ప్రధానికి లేఖ రాయడం ‘మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కడం’ లాంటిది కాదా? కేంద్రం నుంచి ప్రతి నెలా చేనేత కార్మికులకు 5 కిలోల ఉచిత రేషన్ బియ్యం అందుతున్నాయి. గతంలో నూలుపై ఉన్న 10 శాతం సబ్సిడీని మోదీ ప్రభుత్వం 15 శాతానికి పెంచింది. నేత కార్మికులు కేంద్ర ప్రభుత్వ సహకారంతో క్లస్టర్ ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చెందాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపకుండా అడ్డుపడుతోంది. కేంద్రానికి పేరు వస్తుందనా? దేశంలోనే తొలి చేనేత బజార్ స్థలం కబ్జాకు గురికాగా ఆ సమస్య పరిష్కరిస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినా ఇంతవరకు నెరవేరలేదు. కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాన్ని నిలిపివేసి నిరుపేదల నుంచి కిలో రూపాయి చొప్పున వసూలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం కాదా? ఉచిత రేషన్ విషయంలో కేంద్రం ఇస్తున్న సబ్సిడీ ఒక్కో కిలోకి రూ. 28కి పైగా ఉంది. మరి ప్రభుత్వం వాటా ఎంత? ‘మాతా శిశు సంక్షేమ పథకం’ పేరుతో కేంద్రం నిధులిస్తే దానికి కేసీఆర్ కిట్ అంటూ ప్రచారం చేసుకోవడం మీ తప్పిదం కాదా? (క్లిక్ చేయండి: మతతత్త్వం కాదు... సామరస్యం కావాలి) నోరెత్తితే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుందని అంటున్నారు. మరి పక్కనే ఉన్న కర్ణాటకలో మన కంటే 10 నుంచి 15 రూపాయలు తక్కువకు పెట్రోల్, డీజిల్ ఎలా లభిస్తుంది? మీకు పేదలపైన అంత ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా విధిస్తున్న పన్నులు తగ్గిస్తే సరిపోతుంది. కానీ మీరలా చేయట్లేదు. దేశంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా అవినీతి ఆరోపణలు లేకుండా పూర్తి పారదర్శకంగా పాలన సాగిస్తుంటే అవినీతి మరకలు అంటించేందుకు విఫలయత్నం చేశారు. కేసీఆర్ కుటుంబంపై, పార్టీపై అవినీతి ఆరోపణలు వస్తే కేంద్ర విచారణ సంస్థలు నిజాలు నిగ్గుతేల్చే పనిచేస్తే కక్ష సాధింపు చర్యలని కేంద్రాన్నే బదనామ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని బదనామ్ చేయడం ఆపి తమపై ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునే చర్యలు తీసుకుంటే మంచిది. (క్లిక్ చేయండి: దారి తప్పిన మునుగోడు ఉప ఎన్నిక) - శ్యామ్ సుందర్ వరయోగి సీనియర్ జర్నలిస్ట్, బీజేపీ రాష్ట్ర నాయకులు -
ఉచిత బియ్యం ఉఫ్! సాక్షాత్తు లబ్ధి దారులే అమ్ముకుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పడుతోంది. కరోనా నేపథ్యంలో నిరుపేదలు అకలితో అలమటించవద్దని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గరీబ్ కల్యాణ్ యోజన పథకం లక్ష్యం నీరుగారుతోంది. సాక్షాత్తూ లబ్ధిదారుల కుటుంబాలు ఉచితం బియ్యాన్ని కారుచౌకగా చిరు వ్యాపారులకు అమ్ముకోవడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఆహార భద్రత (రేషన్) కార్డులోని సభ్యుడి (యూనిట్)కి 10 కిలోల చొప్పున సభ్యుల సంఖ్యను బట్టి కుటుంబానికి కనీసం 30 కిలోల నుంచి 60 కిలోల బియ్యం వరకు ఉచితంగా పంపిణీ జరుగుతోంది. ఉచిత బియ్యంపై అనాసక్తి ఉన్నప్పటికీ డ్రా చేయకుంటే కార్డు ఇన్ యాక్టివ్‌లో పడిపోయి రద్దవుతుందన్న అపోహతో అవసరం లేని లబ్ధి కుటుంబాలు సైతం బియ్యం డ్రా చేసి చిరు, వీధి వ్యాపారులకు కారుచౌకగా అప్పజేప్పేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో బస్తీల్లో కొనుగోలు కేంద్రాలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం పీడీఎస్ బియ్యం నిల్వలు అధికమై డిమాండ్ తగ్గడంతో కిలో రూ.5 నుంచి 8 వరకు ధర మించి పలకడం లేదు. పౌరసరఫరాల, పోలీసు అధికారుల మొక్కుబడిగా తనిఖీలు, దాడులు చేస్తుండటంతో క్వింటాళ్లకొద్దీ అక్రమ నిల్వలు పట్టుబడుతున్నాయి. గత రెండేళ్ల నుంచి.. కేంద్ర ప్రభుత్వం రెండేళ్లుగా గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద ఉచిత రేషన్ కోటా కేటాయిస్తూ అమలు చేస్తోంది. ఆహార భద్రత కార్డులోని ప్రతి లబ్ధిదారుడికి అయిదు కిలోల చొప్పున ఉచిత బియ్యం కోటా కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం మరో అయిదు కిలోలు కలిపి పది కిలోల చొప్పున అందిస్తూ వస్తోంది. ఉచిత బియ్యం పథకం కాలపరిమితి ముగుస్తున్నా.. కేంద్రం పథకాన్ని పొడిగిస్తూ వస్తోంది. అవసరం ఉన్నవారు సగమే.. హైదరాబాద్ మహా నగరంలోని ఆహార భద్రత కార్డు లబ్ధి కుటుంబాల్లో పీడీఎస్ బియ్యం వండుకొని తినేవారు సగమే. మిగిలిన సగం కుటుంబాలు కేవలం అల్పాహారం ఇడ్లీ, దోసెలు, పిండి వంటలకు మాత్రమే రేషన్ బియ్యం వినియోగిస్తుంటారు. వాస్తవంగా వారి అవసరాలకు నెలకు నాలుగు కిలోల కంటే మించవు. రేషన్ బియ్యం అవసం లేకున్నా.. క్రమం తప్పకుండా డ్రా చేసి కారు చౌకగా దళారులకు ముట్టజెప్పడం సర్వసాధారణంగా మారింది. ప్రతి నెలా.. కోటా ఇలా గ్రేటర్‌లోని హైదరాబాద్– రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాల పరిధిలో సుమారు 16 లక్షల ఆహార భద్రత కార్డు లబ్ధి కుటుంబాలు ఉండగా, అందులో 55.63 లక్షల లబ్థిదారులు ఉన్నారు. ప్రతి నెలా ఉచిత బియ్యం కోటా కింద 111 మెట్రిక్ టన్నులు విడుదలవుతున్నాయి. (చదవండి: ఆర్టీసీలో కనిష్టంగా రూ. వెయ్యి పెన్షన్) -
రూ.6.5 లక్షల కోట్లతో సాగర్మాల.. ఎందుకీ భారీ ప్రాజెక్టు?
న్యూఢిల్లీ: సాగర్మాల కార్యక్రమం కింద రూ.6.5 లక్షల కోట్ల విలువైన 1,537 ప్రాజెక్టులను అమలు చేయనున్నట్టు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రకటించారు. తీరప్రాంత జిల్లాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రూ.58,700 కోట్ల వ్యయ అంచనాలతో 567 ప్రాజెక్టులను గుర్తించినట్టు మంత్రి వెల్లడించారు. సాగర్మాల దేశవ్యాప్తంగా 7,500 కిలోమీటర్ల పొడవున ఉన్న సాగర తీరాన్ని ఉపయోగించుకుంటూ, పోర్టుల ఆధారిత అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర సర్కారు సాగర్మాల కార్యక్రమాన్ని తలపెట్టింది. అలాగే, 14,500 కిలోమీటర్ల పొడవునా జలమార్గాలను కూడా ఉపయోగించుకోవాలన్నది ఈ కార్యక్రమంలో భాగంగా ఉంది. శుక్రవారం ఢిల్లీలో నేషనల్ సాగర్మాల అపెక్స్ కమిటీ (ఎన్సాక్) సమావేశం అనంతరం మంత్రి మీడియాకు వివరాలు వెల్లడించారు. సాగర్మాల ప్రాజెక్టుల పురోగతిపై చర్చించినట్టు చెప్పారు. అమలు దశలో.. 2035 నాటికి రూ.5.5 లక్షల కోట్లతో 802 ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు మంత్రి సోనోవాల్ తెలిపారు. వీటిల్లో రూ.99,281 కోట్లతో 202 ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తి చేసినట్టు వెల్లడించారు. మరో 29 ప్రాజెక్టులను (రూ.45,000 కోట్లు) ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద విజయవంతంగా అమలు చేసినట్టు తెలిపారు. రూ.51,000 కోట్ల విలువ చేసే మరో 32 ప్రాజెక్టులు పీపీపీ అమలు దశలో ఉన్నట్టు పేర్కొన్నారు. రూ.2.12 లక్షల కోట్ల విలువ చేసే 200 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని, ఇవి రెండేళ్లలో పూర్తవుతాయని తెలిపారు. లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గాలి.. ఈ సందర్భంగా కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడారు. రవాణా వ్యయాలను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. చైనాలో లాజిస్టిక్స్ వ్యయాలు 8 శాతమే ఉంటే, మన దగ్గర 14–16 శాతం మధ్యలో ఉన్నట్టు చెప్పారు. ఇక్కడా 8 శాతానికి తగ్గిస్తే ఆర్థిక వృద్ధి వేగవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. చదవండి: జూలై నాటికి డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు -
హిప్.. చిప్.. భారత్!
న్యూఢిల్లీ: భారత్‌ను ప్రపంచానికి తయారీ కేంద్రంగా మలిచే లక్ష్యంతో కేంద్ర సర్కారు మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సెమీ కండక్టర్ల తయారీ (చిప్‌లు), డిస్ప్లే తయారీ ఎకోసిస్టమ్‌కు రూ.76,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా స్వీయ సమృద్ధి సాధించడమే కాకుండా, చైనా మార్కెట్‌పై ఆధారపడడం తగ్గుతుందని కేంద్ర సర్కారు భావిస్తోంది. సెమీ కండక్టర్లు, డిస్ప్లే తయారీ, డిజైన్ కంపెనీలకు అంతర్జాతీయంగా ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ఈ పథకం కింద అందించడం వల్ల.. ఎలక్ట్రానిక్స్ తయారీలో కొత్త శకానికి దారితీస్తుందని కేంద్రం పేర్కొంది. కేబినెట్ సమావేశం వివరాలను ఐటీ, టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నిత్య జీవితంలో ఎలక్ట్రానిక్స్ ముఖ్య పాత్ర పోషిస్తుంటే.. ఎలక్ట్రానిక్స్ తయారీలో సెమీ కండక్టర్లకు కీలక పాత్ర ఉందన్నారు. లక్ష్యాలు..: మూలధన, సాంకేతిక సహకారాన్ని ఈ పథకం కింద కంపెనీలు పొందొచ్చు. అర్హులైన దరఖాస్తులకు ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం నిధుల సహకారాన్ని ప్రభుత్వం అందించనుంది. సిలికాన్ సెమీకండక్టర్ ఫ్యాబ్‌లు, డిస్ప్లే ఫ్యాబ్‌లు, కాంపౌండ్ సెమీకండక్టర్లు, సిలికాన్ ఫోటోనిక్స్, సెన్సార్ ఫ్యాబ్‌లు, సెమీకండక్టర్ ప్యాకేజింగ్, సెమీ కండక్టర్ డిజైన్లకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం ఇవ్వనుంది. ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయాల (భూమి, నీరు, విద్యుత్తు, రవాణా, పరిశోధన సదుపాయాలు) ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి కేంద్రం పనిచేయనుంది. కనీసం రెండు గ్రీన్‌ఫీల్డ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్‌లు, రెండు డిస్ప్లే ఫ్యాబ్‌లను ఏర్పాటు చేయాలన్నది కేంద్రం లక్ష్యంగా ఉంది. ఈ ప్రతిపాదిత పథకం కింద కనీసం 15 కాంపౌండ్ సెమీకండక్టర్లు, సెమీకండక్టర్ల ప్యాకేజింగ్ యూనిట్లు ఏర్పాటవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. డిజైన్ అనుసంధాన ప్రోత్సాహక పథకం (డీఎల్ఐ) కింద ప్రాజెక్టు ఏర్పాటు వ్యయంలో 50 శాతాన్ని ప్రోత్సాహకంగా ప్రభుత్వం సమకూర్చనుంది. అలాగే, ఐదేళ్లపాటు విక్రయాలపై 6–4 శాతం మేర ప్రోత్సాహకాలను ఇవ్వనుంది. ‘‘దేశీయంగా 100 వరకు సెమీకండక్టర్ డిజైన్ ఫర్ ఇంటెగ్రేటెడ్ సర్క్యూట్స్, చిప్సెట్లు, సిస్టమ్ ఆన్ చిప్స్, సెమీకండక్టర్ డిజైన్ కంపెనీలకు మద్దతు లభించనుంది. వచ్చే ఐదేళ్లలో రూ.1,500 కోట్ల టర్నోవర్ సాధించిన కంపెనీలకు ప్రోత్సాహకాలు లభిస్తాయి’’ అని ప్రభుత్వం నుంచి విడుదలైన ప్రకటన తెలిపింది. ఈ పరిశ్రమ దీర్ఘకాల వృద్ధికి వీలుగా అంతర్జాతీయ నిపుణులతో సెమీకండక్టర్ మిషన్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. 1.35 లక్షల మందికి ఉపాధి వచ్చే నాలుగేళ్లలో ఈ పథకం కింద దేశంలోకి 1.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.35 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినివైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతానికి దేశంలో 75 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎలక్ట్రానిక్స్ తయారీ ఆరేళ్లలో 300 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. టాటా గ్రూపు ఇప్పటికే సెమీకండక్టర్ల తయారీలోకి ప్రవేశించనున్నట్టు ప్రకటించగా.. వేదాంత గ్రూపు సైతం ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తితో ఉంది. రెండు అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ చిప్ తయారీ కంపెనీలు, రెండు డిస్ప్లే తయారీ కంపెనీలు ఒక్కోటీ రూ.30,000–50,000 కోట్ల స్థాయి పెట్టుబడులతో వచ్చే నాలుగేళ్లలో ముందుకు రావచ్చని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ అంచనా వేస్తోంది. ఆవిష్కరణలు, తయారీకి ఊతం: ప్రధాని మోదీ సెమీకండక్టర్లకు సం బంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఈ రంగంలో పరిశోధన, ఆవిష్కరణలకు, తయారీకి ఊతమిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తుందంటూ ప్రధాని ట్వీట్ చేశారు. డిజిటల్ చెల్లింపులకు మరింత మద్దతు న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు ఇప్పటికే గరిష్టాలకు చేరుకోగా.. వీటిని మరింత ప్రోత్సహించాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. యూపీఐ, రూపే డెబిట్ కార్టులతో చేసే చెల్లింపులను ప్రోత్సహించేందుకు రూ.1,300 కోట్ల పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. వ్యక్తులు వర్తకులకు చేసే డిజిటల్ చెల్లింపులకు అయ్యే వ్యయాలను ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రూపే డెబిట్ కార్డు, భీమ్ యూపీఐతో రూ.2,000 వరకు చెల్లింపులపై అయ్యే వ్యయాలను ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. వచ్చే ఏడాది కాలంలో ప్రభత్వం రూ.1,300 కోట్లను ఖర్చు చేయడం వల్ల మరింత మంది డిజిటల్ చెల్లింపులకు ముందుకు వస్తారని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది నవంబర్‌లో 7.56 లక్షల కోట్ల విలువైన 423 కోట్ల డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు నమోదైనట్టు వెల్లడించారు. -
ఆటో పీఎల్ఐ నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ: అత్యాధునిక ఆటోమోటివ్ టెక్నాలజీ ఆధారిత వాహనాలు (ముందస్తు అనుమతి కలిగిన), అన్ని రకాల ఆటో విడిభాగాల తయారీపై ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ పథకం) అందుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఆటోమొబైల్ రంగానికి రూ.25,938 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టు ఇటీవలే ప్రకటించగా.. ఇందుకు సంబంధించి పీఎల్ఐ పథకం కింద రాయితీలు కలి్పంచే నోటిఫికేషన్‌ను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ శుక్రవారం జారీ చేసింది. సైనిక వినియోగానికి సంబంధించిన వాహనాలకూ ఈ పథకం కింద ప్రయోజనాలు లభించనున్నాయి. సీకేడీ/ఎస్కేడీ కిట్లు, ద్విచక్ర, త్రిచక్ర, ప్యాసింజర్, వాణిజ్య, ట్రాక్టర్ల అగ్రిగేట్స్ సబ్సిడీలకు అర్హతగా నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత ఆటోమొబైల్ కంపెనీలతోపాటు.. కొత్త నాన్ ఆటోమోటివ్ పెట్టుబడి సంస్థలూ పథకం కింద ధరఖాస్తు చేసుకోవచ్చు. ఛాంపియన్ ఓఈఎం, కాంపోనెంట్ చాంఫియన్ ఇన్సెంటివ్ స్కీమ్ అనే రెండు భాగాల కింద ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ఒక గ్రూపు పరిధిలోని కంపెనీలకు మొత్తం ప్రోత్సాహకాల్లో 25 శాతానికి మించకుండా (అంటే రూ.6,485 కోట్లకు మించకుండా) ప్రోత్సాహకాలు లభిస్తాయి. చాంపియన్ ఓఈఎం పథకం కింద విక్రయాలు కనీసం రూ.125 కోట్లుగాను, కాంపోనెంట్ చాంపియన్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద విక్రయాలు కనీసం రూ.25 కోట్లుగాను ఉండాలని ఈ నోటిఫికేషన్ స్పష్టం చేస్తోంది. -
రైతన్నల ఆదాయం రెట్టింపు చేస్తాం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఆయన సోమవారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) పథకం కింద తొమ్మిదో విడతలో 9.75 కోట్ల మందికిపైగా రైతుల ఖాతాల్లోకి రూ.19,500 కోట్లు బదిలీ చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు పీఎం–కిసాన్ సొమ్ము రైతాంగానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అన్నదాతల ఆదాయాన్ని పెంచాలన్నదే తమ లక్ష్యమని, అన్ని రకాల వనరులను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మన రైతాంగం సంక్షేమం కోసం ఎన్నో పథకాల్లోకి తీసుకొచ్చామని గుర్తుచేశారు. రూ.లక్ష కోట్లతో అగ్రి–ఇన్ఫ్రా ఫండ్ ఏర్పాటు చేశామన్నారు. హనీ బీ(తేనెటీగలు) మిషన్‌తో మన దేశం నుంచి తేనె ఎగుమతులు భారీగా పెరిగాయని, తద్వారా తేనెటీగల పెంపకందారులు అదనపు ఆదాయం పొందుతున్నారని వివరించారు. జమ్మూకశ్మీర్‌లో సాగయ్యే కుంకుమ పువ్వును ‘నాఫెడ్’ రిటైల్ స్టోర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. రికార్డు స్థాయిలో ఉత్పత్తి కరోనా ప్రతికూల కాలంలోనూ 2020–21లో రైతులు రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేశారని మోదీ ప్రశంసించారు. వరి, గోధుమలు, చక్కెర ఉత్పత్తిలోనే కాదు, వంట నూనెల ఉత్పత్తిలోనూ స్వయం సమృద్ధి సాధించాలి్సన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇండియాలో తృణ ధాన్యాల ఉత్పత్తి గత ఆరేళ్లలో 50 శాతం పెరిగిందని, దేశీయంగా వంట నూనెల ఉత్పత్తి విషయంలోనూ ఇదే స్ఫూర్తిని చాటాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిలో మన దేశం టాప్–10 దేశాల జాబితాలో చేరిందన్నారు. -
విద్యార్థులందరికి రూ.11 వేలు?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో పాటు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కూడా అలానే వ్యాప్తి చేందుతుంది. ఇంటర్నెట్లో కనిపించే ప్రతిదీ నిజమని నమ్మితే.. బొక్కబోర్లా పడతాం. ఇలా వైరలయ్యే న్యూస్‌ను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ఆ తర్వాత నమ్మాలి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ న్యూస్ ఒకటి తెగ వైరలవుతోంది. దాని సారంశం ఏంటంటే.. కేంద్రం విద్యార్థులందరికి 11 వేల రూపాయల స్కాలర్షిప్ అందిస్తుంది. స్కూలు, కాలేజీ స్టూడెంట్స్ ఫీజులు చెల్లించడం కోసం ఈ స్కాలర్షిప్ను ఇవ్వనుందనే వార్త కొద్ది రోజులుగా తెగ వైరలవుతోంది. అన్‌లాక్ 4.0లో భాగంగా విద్యాసంస్థలు తెరిచారు. అయితే చాలా మంది విద్యార్థులు ఫీజులు చెల్లించే పరిస్థితిలో లేరు. కనుక తమకు సాయం చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. వారి విన్నపం మేరకు ప్రభుత్వం ప్రతి విద్యార్థికి 11 వేల రూపాయల స్కాలర్షిప్ ఇవ్వనుంది అని. (చదవండి: మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ . లక్ష : ఈ వార్త నిజమేనా!) అయితే ఇది ఫేక్ న్యూస్.. కేంద్రం ఇలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఈ ఫేక్ న్యూస్‌ని తొలగించడేమ కాక విద్యార్థులందరికి కేంద్రం 11 వేల రూపాయలు ఇస్తుందంటూ ఓ వెబ్సైట్లో వచ్చిన ఈ వార్త నిజం కాదు. ఆ వెబ్సైట్ కూడా నిజం కాదు. కేంద్రం ఇలాంటి ప్రకటన చేయలేదు అని ట్వీట్ చేసింది. ఇంటర్నెట్లో ప్రచారంలో ఉన్న తప్పుడు సమాచారం, నకిలీ వార్తలను అరికట్టడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 2019 డిసెంబర్లో ఈ ఫ్యాక్ట్ చెక్ ఆర్మ్‌ని ప్రారంభించింది. దీని లక్ష్యం “వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం అవుతున్న ప్రభుత్వ విధానాలు, పథకాలకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని గుర్తించడం.. ప్రజలను హెచ్చరించడం’’. दावा:- एक वेबसाइट पर दावा किया जा रहा है कि कोरोना महामारी के चलते केंद्र सरकार स्कूल और कॉलेजों के सभी छात्रों को उनकी फीस भरने के लिए 11,000 रुपए प्रदान कर रही है।#PIBFactCheck:- यह वेबसाइट फर्जी है। केंद्र सरकार द्वारा ऐसी कोई घोषणा नहीं की गई है। pic.twitter.com/kcD1jO8jZm — PIB Fact Check (@PIBFactCheck) September 22, 2020 -
‘ఆరోగ్య సేతు’ భద్రతా సమస్య.. కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ : ‘ఆరోగ్య సేతు’ యాప్ డేటా సెక్యూరిటీకి ఎలాంటి సమస్య లేదని, సమాచారం సురక్షితంగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. యాప్ ద్వారా ఇప్పటి వరకు ఎటువంటి భద్రతా ఉల్లంఘనలు గుర్తించలేదని, ఆరోగ్యా సేతు ప్రతి ఒక్కరికీ భరోసా ఇస్తుందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇది కరోనా సమాచారాన్ని తెలుసుకునేందుకు, మనలో కరోనా లక్షణాలు ఉన్నాయో లేవో తెలిపి, పలు సలహాలు సూచనలు అందిస్తోంది. అయితే ప్రస్తుతం ఆరోగ్య సేతు యాప్‌లో ఉన్న ప్రజల సమాచారం భద్రంగా లేదంటూ, వివరాలు హ్యకింగ్ చేసే అవకాశం ఉందని ఫ్రెంచ్ హ్యకర్ మంగళవారం ట్విటర్లో ప్రభుత్వానికి సవాల్ విసిరాడు. (విషాదం: ‘వాడిని కనీసం ముట్టుకోలేకపోయా’) ఈ యాప్ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇందులో సెక్యూరిటీ సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా సుమారు 90 మిలియన్ల మంది భారతీయుల సమాచారం ప్రమాదంలో పడిందని హెచ్చరించాడు. అయితే దీనిపై స్పందించిన కేంద్రం హ్యాకర్ వాదనలను తోసిపుచ్చింది. ప్రజల సమాచారానికి ఎటాంటి భద్రతా సమస్యలు లేవని స్పష్టం చేసింది. ఆరోగ్య సేతు యాప్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, డేటా చోరీ కాలేదని పేర్కొంది. యాప్ ఉపయోగిస్తున్న ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిన సమాచారం కూడా హ్యకింగ్‌కు గురవ్వలేదని ట్విటర్లో క్లారిటీ ఇచ్చింది. కాగా ఆరోగ్యా సేతు ట్విట్టర్లో విడుదల చేసిన ప్రకటనపై హ్యకర్ ఇలియట్ ఆల్డర్సన్ స్పందించారు. ‘యాప్‌లో ఎలాంటి లోపాలు లేవని మీరు చెప్పారు. మేము దానిని సమీక్షించి రేపు మళ్లీ వస్తాం’.. అంటూ బదులిచ్చాడు. Statement from Team #AarogyaSetu on data security of the App. pic.twitter.com/JS9ow82Hom — Aarogya Setu (@SetuAarogya) May 5, 2020 Basically, you said "nothing to see here" We will see. I will come back to you tomorrow. https://t.co/QWm0XVgi3B — Elliot Alderson (@fs0c131y) May 5, 2020 -
విద్యార్థులకూ నేరుగా నగదు!
న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నత విద్యా సంస్థల్లో ఫీజు రీయింబర్స్మెంట్ బదులుగా విద్యార్థులకు నేరుగా నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అంతే కాకుండా ఐఐటీ వంటి ఉన్నత విద్యా సంస్థలో చదువుకునే విద్యార్థులకు చదువుకోవడానికి ఆర్థిక సాయం అందించే వారితో కలిసి ని«ధుల్ని సమీకరించడానికి ఒక వేదిక ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈచ్ వన్, టీచ్ వన్ (ప్రతీ ఒక్కరూ, ఒక్కరిని చదివించాలి) అనే నినాదంతో జాతీయ స్థాయిలో ఒక ఉద్యమాన్ని లేవనెత్తడం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈచ్ వన్, టీచ్ వన్: ధనిక వర్గాల్లోని ఒక్కో కుటుంబం ఒక నిరుపేద విద్యార్థికి చదవించడానికి ముందుకు రావాలని కేంద్రం పిలుపునివ్వనుంది. ఈ విధానంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా, ఇచ్చిన డబ్బులు వృథా కాకుండా ఒక డిజిటల్ ప్లాట్ ఫామ్‌ను ఏర్పాటు చేయనుంది. విద్యాదాన్ పోర్టల్ తరహాలో రూపొందించే ఈ కొత్త పోర్టల్‌లో విద్యార్థులు, వారి చదువుకి సాయం అందించే దాతలు, విద్యాసంస్థల్ని అనుసంధానం చేస్తారు. మొత్తమ్మీద రూ.25 వేల కోట్ల నిధుల్ని సమీకరిస్తారు. వీటిని పూర్తి పారదర్శకంగా ఖర్చు చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు. 10 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరుతుంది. ఈ సిఫారసుల్ని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణులతో కూడిన 10 గ్రూపులు మేధోమథనం నిర్వహించి (ఎడ్యుకేషన్ క్వాలిటీ అప్‌గ్రెడేషన్ అండ్ ఇన్‌క్లూజన్ ప్రోగామ్ (ఎక్విప్)) రూపొందించారు. ఉన్నత విద్యా వ్యవస్థను ప్రక్షాళన కోసం వచ్చే అయిదేళ్లలో ఏయే నిర్ణయాలు తీసుకోవాలో ప్రతిపాదనలు చేశారు. ఈ గ్రూపులకు పలువురు ప్రముఖులు నేతృత్వం వహించారు. మాజీ రెవిన్యూ సెక్రటరీ హస్ముఖ్ అదిహ, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ కె. విజయరాఘవన్, రీడిఫ్ వ్యవస్థాపకుడు అజిత్ బాలకృష్ణన్, ఇన్ఫోసిస్ మాజీ సీఈవో క్రిస్ గోపాల్‌కృష్ణన్ వంటి ప్రముఖులు వీరిలో ఉన్నారు. సిఫారసులు ► ఫీజు రీయింబర్స్మెంట్కి బదులుగా విద్యార్థుల బ్యాంకు అకౌంట్లకే నేరుగా నగదు బదిలీ చేయాలి. ► ఇతర విద్యార్థులకు రుణాలు మంజూరు చేయాలి. విద్యార్థులను చదివించడానికి ముందుకు వచ్చేవారికి వారు అందించే ఆర్థిక సహకారంపై ఆదాయపు పున్ను మినహాయింపు కల్పించాలి. ► ఐఐటీ సహా దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో దాతృత్వ కార్యాలయాల ఏర్పాటు. ► 16 లక్షల మంది బీసీ విద్యార్థుల కోసం 8 వేల హాస్టళ్లు. దూర విద్య ద్వారా విద్యనభ్యసించే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజుల్లో 50 శాతం రాయితీ. ► ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 500 వృత్తివిద్యా డిగ్రీ కాలేజీల ఏర్పాటు. ► ప్రపంచస్థాయి ప్రమాణాల కోసం ఎంపిక చేసిన 40–50 విద్యాసంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి. ► విద్యార్థుల పరిశోధనలకు ఆర్థిక సహకారం కోసం జాతీయ అధ్యయన ఫౌండేషన్ ఏర్పాటు. -
రైతుకు ‘కేంద్ర’ సాయం
మెదక్‌జోన్: దేశానికి అన్నంపెట్టే రైతన్నను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. వరస కరువుకాటకాలతో సాగు ముందుకు సాగక ఆందోళన చెందుతున్న సన్న, చిన్నకారు రైతులకు పెట్టుబడి సాయం కింద రూ. 6 వేల చొప్పున అందించేందుకు సన్నాహలు చేపట్టింది. జిల్లాలో మొత్తం రైతులు 2.20 లక్షల మంది ఉన్నారు. కాగా అందులో 29 వేల మంది రైతులకు సంబంధించిన భూములు పలు కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం పార్ట్‌బీ లో పెట్టింది. దీంతో వారికి రైతులబంధు అందడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సమ్మాన్నిధి అనే ప్రత్యేక పథకం ద్వారా ఐదెకరాల లోపు భూములు ఉన్న రైతులకు మాత్రమే సాయం అందజేయడానికి నిబంధనలు రూపొందించారు. జిలాల్లో 5 ఎకరాల లోపుగల ఉన్న రైతులు 1.7 లక్షల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రూ. 6 వేల సాయంను మూడు విడతల్లో ఒక్కోవిడతకు రూ. 2 వేల చొప్పున అందించేందుకు ఏర్పాట్ల చేస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో రూ. 64.20 కోట్లు పంపిణీ చేయనున్నారు. మొదటి విడతగా రూ 21.40 కోట్లు ఇవ్వనున్నారు. ఈ మొదటి విడతకు సంబంధించిన రూ. 2 వేలను మార్చి 31 వరకు ఇవ్వనున్నారు. రెండో విడతకు సంబంధించిన రూ. 2 వేలను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు, మూడో విడత ఆగస్టు నుంచి నవంబర్ 30వ, తేదీ వరకు నేరుగా రైతుల అకౌంట్లో వేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఈ పంపిణీ పక్రియను వ్యవసాయశాఖకు అప్పగించింది. రైతులు ఊరూర సమావేశాలు నిర్వహించి బ్యాంకు అకౌంట్లు, పట్టాపాస్‌బుక్కులు, ఆధార్‌కార్డు జిరాక్స్‌కార్డులను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఐదెకరాల లోపు రైతులందరికీ.. కేంద్ర ప్రభుత్వం పీఎం సమ్మాన్నిధి పథకం ద్వారా 5 ఎకరాలలోపు రైతులందరికీ రూ. 6 చొప్పున ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన రైతుల బ్యాంక్ అకౌంట్లు, పట్టాపాస్ పుస్తకాలు, ఆధార్ జిరాక్స్‌లను సేకరిస్తున్నాం. మొదటి విడత సాయం మార్చి చివరికల్లా అందుతుంది. –పరశురాం, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
ఉప్పులేటి కల్పనా.. మజాకానా !
సాక్షి, అమరావతి బ్యూరో : పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న పలు పథకాలను అధికార టీడీపీ ప్రజాప్రతినిధులు చేజిక్కించుకుని లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణాజిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కేంద్రప్రభుత్వ నిధులతో మంజూరైన రాయితీ వాహనాన్ని బినామీ పేరుతో తీసుకుని దర్జాగా వాడుకుంటున్న వైనం వెలుగుచూసింది. నిబంధనలకు పాతర.. కేంద్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి కోసం నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎస్ఎఫ్డీసీ) ద్వారా సబ్బిడీతో వాహనాలను అందజేస్తోంది. మొవ్వ గ్రామానికి చెందిన దగాని క్రాంతికిరణ్ ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం ద్వారా దరఖాస్తు చేయగా సుమారు రూ.20 లక్షల విలువైన ఇన్నోవా వాహనాన్ని మంజూరు చేశారు. ఆ వాహనాన్ని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పేరుతో ఏపీ 16టీపీ 0661 నంబర్‌తో ఈ ఏడాది మార్చి ఒకటిన గుడివాడ ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు.అయితే రిజిస్ట్రేషన్ చేయడంలో నిబంధనలు పాటించలేదు. ట్యాక్సీ ట్రావెల్ కింద చూపితే ఎల్లో ప్లేట్ ఉండాలి. కానీ కారు యజమానిగా చూపి వైట్ ప్లేట్ వేయించుకుని నిబంధనలు ఉల్లంఘించారు. పామర్రు ఎమ్మెల్యే దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇన్నోవా వాహనంపై పామర్రు ఎమ్మెల్యేగా స్టిక్కర్ వేయించుకుని తిరుగుతున్నారు. దగాని క్రాంతికిరణ్ ఎమ్మెల్యే బినామీ మాత్రమేనని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అతని పేరుతో రాయితీతో కూడిన భూమి కొనుగోలు పథకం, వ్యక్తిగత రుణాలు మంజూరు చేయించి వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ వెబ్సైట్లో కారు రిజిష్ట్రేషన్ వివరాలు. ఇందులోనే కారు యజమాని దగాని క్రాంతి కిరణ్ పేర్కొన్న దృశ్యం సొమ్మొకరిది సోకు మరొకరిది కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాలలో పేదవర్గాలకు ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం కింద అందించే వాహనాలకు నిధులు పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ పధకం ద్వారా మంజూరైన వాహనానికి 35% సబ్సిడీ ఉంటుంది. 2% మాత్రం లబ్ధిదారుని వాటాగా చెల్లించాలి. మిగిలిన 63% రుణ సౌకర్యం కల్పిస్తారు. వాహనాన్ని ట్రావెల్స్‌లో తిప్పి రుణం చెల్లించాల్సి ఉంది. కానీ రాష్ట్రప్రభుత్వం ఈ వాహనాలను తామే ఇస్తున్నట్లు బిల్డప్ ఇచ్చేలా వాహనంపై థ్యాంక్యూ సీఎం సార్ పేరుతో స్టిక్కర్లు వేసి పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ గతంలో వాహనంపై సీఎం స్టిక్కర్ తొలగిస్తే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పడం వివాదమైంది. గతంలోనూ నెల్లూరు జిల్లాలో టీడీపీ మాజీ మంత్రి తన డ్రైవర్ పేరుతో ఇన్నోవా వాహనం తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. పేదవర్గాల పేరుతో రాయితీ పథకాలను టీడీపీ నేతలు బొక్కేయడంపై దళితులు మండిపడుతున్నారు. పేదలకు పంపిణీ చేశాం కృష్ణా జిల్లాలో ఎన్ఎస్ఎఫ్డీసీ ద్వారా దరఖాస్తులు చేసుకున్న వారికి వాహనాలు పంపిణీచేశాం. నిబంధనల మేరకే వాహనాలను మంజూరు చేశాం. లబ్ధిదారుల్లో ప్రజాప్రతినిధుల బినామీలు ఉన్నారన్న విషయం మాకు తెలియదు. – సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, కృష్ణాజిల్లా -
ఇక ఇంటికి రెండు ఫ్యాన్లు
విద్యుత్ ఆదా కోసం కేంద్ర పథకం ఎల్ఈడీ బల్బుల తరహాలో మరో ప్రయత్నం దేశంలో పెలైట్ ప్రాజెక్ట్‌గా నరసాపురం ఎంపిక సంక్రాంత్రికి పంపిణీ చేయడానికి సన్నాహాలు ఒక్కోదాని ఖరీదు రూ.1200.. వాయిదాల్లో చెల్లించవచ్చు నరసాపురం : దేశంలో విద్యుత్ వినియోగం, ఉత్పత్తిని మించి పెరిగిపోతోంది. దీంతో దీంతో కేంద్ర ప్రభుత్వం సంప్రదాయేతర (సౌర, పవన) విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రయత్నం చేస్తూనే, వినియోగంలో పొదుపును పాటించే విధంగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే గతంలో దేశంలో కొన్ని రాష్ట్రాలతో పాటుగా మనరాష్ట్రంలో కూడా తక్కువ విద్యుత్ వినియోగం అయ్యే ఎల్ఈడీ బల్బులను సరఫరా చేసింది. ఇప్పుడు అదే తరహాలో తక్కువ విద్యుత్ అవసరం అయ్యే ఫ్యాన్లను ఇవ్వాలని నిర్ణయించింది. ఎల్ఈడీ బల్బుల పంపిణీని జిల్లాలో నరసాపురం పట్టణం నుంచే ఆరంభించారు. ఇప్పుడు ఫ్యాన్ల పంపిణీని కూడా నరసాపురం నుంచే ప్రారంభించనున్నారు. దేశంలోనే పెలైట్ ప్రాజెక్ట్‌గా నరసాపురం పట్టణాన్ని ఎంపిక చేయడం మరో విశేషం. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనుంది. సంక్రాంతి నుంచి ఫ్యాన్ల పంపిణీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించి, ప్రయత్నాలు చేస్తున్నామని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (విశాఖపట్నం) కమర్షియల్ చీఫ్ జనరల్ మేనేజర్ బి.రమేష్ వివరించారు. ప్రాజెక్ట్ ద్వారా ఫ్యాన్ల పంపిణీ ఇలా.. గతంలో ఎల్ఈడీ బల్బులను ప్రతి సర్వీస్ దారుడుకి రూ.20కి రెండు చొప్పున అందించారు. అయితే ఈసారి ప్రతి సర్వీస్‌కు రెండు ఫ్యాన్లు ఇస్తారు. ఒక్కో ఫ్యాన్ రూ.1200 ఖరీదు ఉంటుంది. ఈ సొమ్మును 10 నుంచి 20 వాయిదాల్లో సర్వీస్ దారులు తిరిగి చెల్లించాలి. చెల్లించాల్సిన వాయిదా సొమ్ము ప్రతినెలా విద్యుత్ బిల్లుతో కలిపి పంపుతారు. ఇందులో బలవంతం ఏమీ ఉండదు. ఇష్టం ఉన్న సర్వీస్ దారుడు మాత్రమే ఫ్యాన్లు తీసుకోవచ్చు. సాధారణంగా మామూలుగా మనం గృహాల్లో వినియోగించే ఫ్యాన్లు 70-80 వాట్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. తాము పంపిణీ చేసే ఫ్యాన్లు కేవలం 35 వాట్స్ సామర్జ్యం మాత్రమే ఉంటాయని, దీంతో మూడవ వంతు కరెంట్ ఆదా అవుతుందని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. ఏడు సంవత్సరాల పాటు ఫ్యాన్లకు గ్యారంటీ ఇస్తారు. ఏపీ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్‌గా పట్టణానికి చెందిన జస్టిస్ గ్రంధి భవానీప్రసాద్ కొనసాగుతున్నారు. దీంతో నరసాపురాన్ని పెలైట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయడం సులువయింది. విజయవంతమైతే, రాష్ట్రంలో ముందుగా ఈ ప్రాజెక్ట్‌ను మన జిల్లాలోనే అమలు చేసే అవకాశం ఉంది. ఎంతవరకూ సక్సెస్ అవుతుందో.. ఫ్యాన్ల పంపిణీకి సంబంధించి ఢిల్లీలోని ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ సంస్థ టెండర్లు పిలిచిందని సీజీఎం రమేష్ వివరించారు. ఏపీ ఈపీడీసీఎల్ ద్వారా గృహాలకు ఉచితంగా ఇచ్చిన ఎల్ఈడీ బల్బులు బాగానే పనిచేస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఇళ్లలో చాలామంది అద్దెలకు ఉంటున్నారు. గతంలో ఎల్ఈడీ బల్బులను, ఇంటి యజమానులు అద్దెదారులకు ఇవ్వలేదు. ఇప్పుడు ఫ్యాన్ల విషయంలోనూ అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. అద్దెదారులే విద్యుత్ వినియోగం అధికంగా చేస్తున్నారు. దీంతో అసలు లక్ష్యం నెరవేరడంలేదు. మరి ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారనేది వేచిచూడాలి.