లక్నో: ఇటీవల కాన్పూర్ లో కురిసిన వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోజులు గడుస్తున్నా నిలిచిపోయిన నీటిని తొలగించడానికి యూపీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిరసనగా తన SUV వాహనం మీదకు బోటు ఎక్కించి అందులో కూర్చుని నగరమంతా తిరుగుతూ నిరసన తెలిపారు సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్ పాయ్.
కాన్పూర్లో ఇటీవల కుండపోతగా వానలు కురిశాయి. దీంతో రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు ఆర్య నగర్ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్ పాయ్.
తన SUV పైకి ఒక బోటును ఎక్కించి అందులో కూర్చుని తెడ్డు చేతపట్టుకుని నగరమంతా ఈదారు. కాన్పూర్ లోని సరసయ్య ఘాట్ దగ్గర మొదలైన ఈ కార్యక్రమం బడా చౌరాహా, మేష్టన్ రోడ్, మూలం గంజ్ ఎక్స్ ప్రెస్ రోడ్, ఫూల్ బాగ్ మీదుగా కొనసాగించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో వీఐపీ రోడ్, సివిల్ లైన్స్, బాబుపూర్వ, రాయ్ పూర్వలో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయని ఇక జుహీ బ్రిడ్జి వద్దైతే ఆ వరద ఉధృతికి ఇటీవల ఒక డెలివరీ ఏజెంటు కూడా చనిపోయాడని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో ప్రజలను కూడా లైఫ్ జాకెట్లు, బోట్లు వాడమని సలహా ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు అంతర్జాలంలో హల్చల్ చేస్తోంది.
कानपुर में सपा विधायक @AmitabhBajpai का जलभराव को लेकर अनोखा प्रदर्शन। अपनी कार के ऊपर नाव रख उसपर सवार होकर सड़कों पर निकले
— Anurag Verma ( PATEL ) (@AnuragVerma_SP) June 30, 2023
नगर निगम की विफलता पर किया प्रदर्शन ,उनका कहना है कि बारिश के चलते शहर बन गया था टापू pic.twitter.com/yEO1zFUtf5
ఇది కూడా చదవండి: మహారాష్ట్ర బస్సు ప్రమాదం.. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు
Comments
Please login to add a commentAdd a comment