మృతికి కారకుడైన నాగుల సాయి
సాక్షి, హైదరాబాద్(హిమాయత్‌నగర్): పది రోజుల క్రితం భార్యాభర్తలపై మొదటి భర్త పెట్రోల్‌తో దాడి చేసిన సంఘటనలో ఒక్కొక్కరిగా నలుగురు మృతిచెందారు. భార్యను చెల్లిగా పిలవాలని సూచించిన రెండో భర్త నాగరాజుపై కక్ష్య పెంచుకున్న నాగులసాయి ఇద్దరూ ఒకేచోట ఉన్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ఘటనలో నాగులసాయిని నల్లగొండలో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన నారాయణగూడ పోలీసులు 15వ తేదీన రిమాండ్‌కు పంపారు.
నాగుల సాయి తెచ్చుకున్న పెట్రోల్‌ను ముందుగా నాగరాజు ఛాతిపై భాగంలో చిమ్మి ఆ తర్వాత పక్కనే ఉన్న ఆర్తి ఛాతి భాగంపై చిమ్మాడు. వెంటనే అగ్గిపుల్ల గీసి వారిపై వేయడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ఆర్తి ఒడిలో ఉన్న పది నెలల విష్ణుపై కూడా కొన్ని పెట్రోల్ చుక్కలు పడి ఆ మంటల్లో కాలడంతో 90 శాతం గాయపడ్డాడు. పెట్రోల్ ఘటన 7వ తేదీన జరగ్గా.. 8వ తేదీ సాయంత్రం విష్ణు మృతి చెందాడు. 12వ తేదీన చికిత్సలో ఉన్న నాగరాజు సైతం మరణించాడు. 14వ తేదీన రాత్రి సమయంలో ఆర్తి గర్భంలో ఉన్న ఐదు నెలల శిశువు మృతిచెందడంతో గర్భంలోంచి మరణించిన పిండాన్ని తొలగించారు. ఇది జరిగిన 24 గంటల వ్యవధిలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆర్తి సైతం కన్నుమూసింది.
చదవండి: (హైదరాబాద్‌లో వ్యభిచార దందా బట్టబయలు.. స్పా ముసుగులో..)
తన భార్యాను నాగరాజు పెళ్లి చేసుకోవడమే కాకుండా బిడ్డను కనడం.. మరో పక్క భార్యనే చెల్లి అని పిలవాలని నాగరాజు నాగులసాయిని ఆదేశించడం నాగులసాయిలో కక్ష్యను పెంచాయి. ఇది తప్పు అని హెచ్చరించాల్సిన ఆర్తి సోదరుడు జితేంద్ర సైతం నాగులసాయిపై తిరగబడి కొడుతున్న క్రమంలో ఈ హత్యకు రెండేళ్ల క్రితమే పన్నాగం పన్నాడు. రెండేళ్ల క్రితం కూడా చిక్కడపల్లి పీఎస్ పరిధిలో బావమరిది జిత్రేంద్రపై పెట్రోల్ పోసిన ఘటనలో నాగుల సాయి ఏడాది జైలుకు వెళ్లొచ్చాడు. ఆ తర్వాత కోర్టు ధిక్కరణ కింద మరో ఏడాది జైలుకు వెళ్లాడు. ఇతని స్నేహితుడు రాహుల్‌తో కలసి పన్నాగం పన్నిన నాగుల సాయి ఈ సారి పక్కా ప్లాన్‌తో పెట్రోల్‌ను ఎక్కువ మోతాదులో వారిపై చిమ్మాడు. దాని కారణంగానే పది రోజుల వ్యవధిలో ఒక్కొక్కరుగా నలుగురూ మృత్యు ఒడికి చేరారు.
Comments
Please login to add a commentAdd a comment