
అంతర్జాతీయ మార్కెట్‌లలో వస్తువుల ధరలకు సంబంధించిన విషయాలను వరల్డ్ బ్యాంక్ తన అక్టోబర్ ఎడిషన్ కమోడిటీ మార్కెట్ ఔట్‌లుక్‌లో వెల్లడించింది. వస్తువుల ధరలు 2025లో 5 శాతం, 2026లో 2శాతం.. ఈ ఏడాది 3 శాతం క్షీణతను పొందుతాయని పేర్కొంది.
క్రూడ్ ఆయిల్ ధరల విషయానికి వస్తే.. 2024లో బ్యారెల్ ధర 80 డాలర్లు కాగా, ఇది 2025లో 73 డాలర్లకు చేరుతుందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. 2026 నాటికి ఈ ధరలు 72 డాలర్లకు పడిపోతుందని కూడా స్పష్టం చేసింది. చమురు ధరలు గణనీయంగా తగ్గుతాయని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్దాలు ప్రమాదం అని హెచ్చరించింది.
ఇంధన మార్కెట్లు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు దగ్గరగా ఉంటాయి. కాబట్టి దీనివల్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. 2023 అక్టోబర్ - 2024 ఏప్రిల్ మధ్య ప్రాంతీయ వైరుధ్యాల కారణంగా చమురు ధరలు 90 డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఈ ధరలు కొంత శాంతించినప్పటికీ.. రాబోయే రోజుల్లో భౌగోళిక ఉద్రిక్తతలు దీనిపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది.
చమురు ధరల విషయం పక్కన పెడితే.. లోహాల ధరలు 2025 - 26లలో తగ్గే సూచనలున్నాయి. బేస్ మెటల్ ధరలు 2026లో 3 శాతం మేర తగ్గుతాయి. అయితే వచ్చే ఏడాది ఈ ధరలు స్థిరంగా ఉంటాయని సమాచారం.
ఇదీ చదవండి: తండ్రి నుంచి అప్పు తీసుకుని మరీ!! మకుటం లేని మహరాజుగా ఎదిగి..
బంగారం ధరల విషయానికి వస్తే.. 2024లో మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీనికి కారణం పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు అని తెలుస్తోంది. అంతే కాకుండా సెంట్రల్ బ్యాంకుల నుంచి బలమైన డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తున్నాయి.