
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలు ఇదంతా తరచూ జరుగుతుంటాయి. అయితే ప్రతి నెలా మారుతున్న కొన్ని రూల్స్‌పై మాత్రం సామన్యులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. ఎందుకంటే అవి వారి నగదుపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కొత్త సంవత్సరం రానే వచ్చింది. జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రజలు ఇలాంటి విషయాలను ముందస్తుగా తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే నిబంధనలు తెలుసుకోకపోతే ఆర్థికపరమైన నష్టాలను చవిచూసే అవకాశం కూడా ఉంది.
క్రెడిట్ కార్డ్‌లు: క్రెడిట్ కార్డ్ చెల్లింపుల కోసం, కొత్త సంవత్సరంలో అనేక బ్యాంకులు తమ రివార్డ్ పాయింట్ స్కీమ్‌లలో మార్పులు చేసే అవకాశం ఉంది. కాబట్టి, కస్టమర్‌లు తమ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్‌లను డిసెంబర్ 31లోపు రిడీమ్ చేసుకోవడం మంచిది.
కార్ ధరలు: పలు కార్ల కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచనున్నాయి. వీటిలో టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి దేశీయ కార్ల దిగ్గజాలతో పాటు ఆడి మెర్సిడెస్-బెంజ్ వంటి లగ్జరీ బ్రాండ్‌లు కూడా ఉన్నాయి.
గ్యాస్ సిలిండర్ ధరలు: ప్రతి నెల మొదటి రోజున, గ్యాస్ సిలిండర్ ధరలలో ఏవైనా మార్పులు చేసినట్లయితే, వాటిని ప్రకటిస్తారు. డిసెంబర్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుత జనవరిలో ధరలు పెరగడమో లేదా తగ్గనున్నాయని చూడాలి
ఎన్‌పీఎస్ పాక్షిక ఉపసంహరణ: ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు NPS (నేషనల్ పెన్షన్ సిస్టమ్) కోసం తమ ఉపసంహరణ అభ్యర్థనలను పాక్షిక ఉపసంహరణ కోసం దరఖాస్తులను వారి అనుబంధ నోడల్ కార్యాలయాల ద్వారా సమర్పించాలి. పాక్షిక ఉపసంహరణకు కారణాన్ని ధృవీకరించడానికి, సహాయక పత్రాలు కూడా అవసరమని తెలిపింది. ప్రస్తుతం, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) సభ్యులు స్వీయ ప్రకటన ద్వారా ఎన్‌పీఎస్ కింద పాక్షిక ఉపసంహరణలు చేసేందుకు అనుమతిస్తుంది.
బ్యాంక్ లాకర్లు: సవరించిన బ్యాంక్ లాకర్ నిబంధనల ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వినియోగదారులకు కొత్త అమల్లోకి వచ్చిన లాకర్ ఒప్పందాలను అందించాలని బ్యాంకులను ఆదేశించింది.
హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు: ఏప్రిల్ 1, 2019కి ముందు రిజిస్టర్ చేసుకున్న వాహనాలకు, డిసెంబర్ 31లోపు హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్‌లు (HSRP), కలర్-కోడెడ్ స్టిక్కర్‌లను ఇన్‌స్టాల్ చేయడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోకుంటే ఇబ్బందులు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు గానూ ₹5,000 నుంచి ₹10,000 వరకు జరిమానా కూడా విధించనున్నారు.
చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే నుంచి పొరపాటున వేరే ఖాతాకు.. ఇలా చేస్తే మీ పైసలు వెనక్కి!